Tirumala Temple: ఇలా అయితేనే తిరుమలకు రండి.. వైకుంఠ ఏకాదశి వేళ టీటీడీ కీలక ప్రకటన..

|

Jan 02, 2022 | 5:45 PM

TTD Temple: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్న వీఐపీ భక్తులకు టీటీడీ బోర్డు ఝలక్ ఇచ్చింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం విఐపిలు సిఫారసు లేఖలు పంపవద్దని స్పష్టమైన ప్రకట చేసింది.

Tirumala Temple: ఇలా అయితేనే తిరుమలకు రండి.. వైకుంఠ ఏకాదశి వేళ టీటీడీ కీలక ప్రకటన..
Follow us on

TTD Temple: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్న వీఐపీ భక్తులకు టీటీడీ బోర్డు ఝలక్ ఇచ్చింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం విఐపిలు సిఫారసు లేఖలు పంపవద్దని స్పష్టమైన ప్రకట చేసింది. జనవరి 12వ తేదీ అర్ధరాత్రి నుంచి 22 వ తేదీ అర్ధరాత్రి వరకు మొత్తం పది రోజుల పాటు కల్పించే వైకుంఠ ద్వార దర్శనం కోసం విఐపి లు సిఫారసు లేఖలు పంపవద్దని టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్లో ముందుగానే దర్శనం టికెట్ బుక్ చేసుకున్న సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసిన ఆయన.. టీటీడీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పది రోజుల పాటు ఛైర్మన్ కార్యాలయంలో కూడా సిఫారసు లేఖలు స్వీకరించబోమని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అయితే, విఐపీలు స్వయంగా వారి కుటుంబ సభ్యులతో వస్తే దర్శనం కల్పిస్తామని చెప్పారు.

తిరుమలలో వసతి..

కోవిడ్ కారణంగా తిరుమలలో గదుల మరమ్మతులు చేపట్టినందువల్ల వైకుంఠ ఏకాదశి రోజున ప్రజా ప్రతినిధులకు తిరుమల లోని నందకం, వకుళ ఆథితి గృహాల్లో వసతి కల్పిస్తున్నామని తెలిపారు. ఒక వేళ తిరుమలలో వసతి సరిపోక పోతే తిరుపతి లోనే బస పొందేందుకు సిద్ధపడి రావాలన్నారు. శ్రీవాణి ట్రస్ట్ భక్తులు తిరుపతి లోని మాధవం, శ్రీనివాసం, శ్రీ పద్మావతి నిలయం, ఎస్వీ గెస్ట్ హౌస్ లో వసతి పొందాలని చైర్మన్ తెలిపారు. పది రోజుల వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా విఐపి ల దర్శన సమయం వీలైనంత తగ్గించి, సామాన్య భక్తులకు ఎక్కువ సమయం దర్శనం కేటాయించాలని ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుందని, ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు.

Also read:

Aliens: భూమి నగరాలు, వనరులపై ఏలియన్స్ దాడి..? వివిధ రూపాల్లో రెక్కీలు నిర్వహిస్తున్నారంటున్న ప్రొఫెసర్..

Early Election: తెలుగు రాష్ట్రాల్లో కొత్త రచ్చ.. ముందస్తు ప్రచారంపై అధికార పక్షాల ఫైర్..

Apco Fashion Show: చేనేతకు చేయూత.. సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన ఏపీ సర్కార్..