Nirjala Ekadashi: నిర్జల ఏకాదశి రోజున విష్ణువు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ చర్యలు చేస్తే చాలు.. డబ్బుకు ఎప్పటికీ కొరత

|

Jun 15, 2024 | 3:15 PM

నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల ఏడాది పొడవునా ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల వచ్చే పుణ్యానికి సమానమైన పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఈ ఏడాది నిర్జల ఏకాదశి వ్రతాన్ని జూన్ 18న జరుపుకోనున్నారు. కనుక ఈ రోజున విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం.

Nirjala Ekadashi: నిర్జల ఏకాదశి రోజున విష్ణువు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ చర్యలు చేస్తే చాలు.. డబ్బుకు ఎప్పటికీ కొరత
Varuthini Ekadashi 2024
Follow us on

హిందూ మతంలో ఏకాదశి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ తిథి త్రిమూర్తుల్లో ఒకరైన శ్రీ మహా విష్ణువుకు అంకితం చేయబడింది. ఒక సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశి తిథిలు ఉంటాయి.అంటే ప్రతి నెలలో 2 ఏకాదశి తిథిలు వస్తాయి. ఒకొక్క ఏకాదశిని ఒకొక్క పేరుతో పిలుస్తారు. ఒకొక్క విశిష్టత ఉంది. అదే విధంగా జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథిని నిర్జల ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి నాడు ఆహారం తీసుకోకుండా చుక్క నీరు తాగకుండా ఉపవాసం పాటించడం వల్ల దీన్ని నిర్జల ఏకాదశి అంటారు. నిర్జల ఏకాదశిని సంవత్సరంలో అత్యంత శక్తివంతమైన. అత్యంత పవిత్రమైన ఏకాదశి అని కూడా అంటారు. హిందూ మత విశ్వాసం ప్రకారం నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం పాటించడం ద్వారా సంవత్సరంలో 24 ఏకాదశులు చేసిన పుణ్యం లభిస్తుందని నమ్మకం.

నిర్జల ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువు, లక్ష్మీదేవి ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆచారాల ప్రకారం నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తి లభిస్తుంది. నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల ఏడాది పొడవునా ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల వచ్చే పుణ్యానికి సమానమైన పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఈ ఏడాది నిర్జల ఏకాదశి వ్రతాన్ని జూన్ 18న జరుపుకోనున్నారు. కనుక ఈ రోజున విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం.

నిర్జల ఏకాదశి రోజున చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే

ఇవి కూడా చదవండి

నిర్జల ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును శాస్త్రోక్తంగా పూజించిన తర్వాత చందన తిలకం దిద్దాలి. దీనితో పాటు ‘ఓం ఆః అనిరుద్ధాయ నమః.’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో సంతోషం, శ్రేయస్సు లభిస్తాయని మత విశ్వాసం.

వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు కలగాలంటే నిర్జల ఏకాదశి రోజున ఇంట్లోని తులసి మొక్క దగ్గర స్వచ్ఛమైన ఆవు నెయ్యితో 11 దీపాలు వెలిగించాలి. దీనితో పాటు తులసి మొక్క చుట్టూ 11 సార్లు ప్రదక్షణ చేయాలి. ఇలా చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు.

జీవితంలోని అన్ని రకాల సమస్యల నుంచి బయటపడటానికి నిర్జల ఏకాదశి ఉత్తమ పర్వదినం. నిర్జల ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువుకి బియ్యంతో చేసిన పాయసాన్ని సమర్పించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ ఖీర్ లో తులసి దళాన్ని వేసి దేవుడికి నైవేద్యంగా పెట్టడం వల్ల జీవితంలోని ప్రతి కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని ఒక నమ్మకం.

ఎవరి జాతకంలో ఏ విధమైన దోషం ఏర్పడి ఉంటే.. దానిని పోగొట్టుకోవడానికి నిర్జల ఏకాదశి రోజున నీరు, పసుపు పండ్లు, బట్టలు, మామిడి పండ్లు, పుచ్చకాయ లేదా పంచదార మొదలైన వాటిని బ్రాహ్మణుడుకి లేదా పేదవారికి దానం గా ఇవ్వండి. ఇలా చేయడం చాలా పవిత్రమైనది. పుణ్యమైనదిగా పరిగణించబడుతుంది.

నిర్జల ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువును, లక్ష్మీదేవిని పూజించేటప్పుడు లేదా రోజంతా ఉపవాసం చేసిన సమయంలో ‘ఓం నమో వాసుదేవాయ నమః’ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీ కోరిక నెరవేరుతుందని నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు