AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మసీదు నుంచి దేవతపై పూల వర్షం కురిపించిన ముస్లింలు.. అమ్మవారి పల్లకికి పూజలు..

భారత దేశం అనేక సంస్కృతి, సంప్రదాయాలు, మతాల సంగమం. బిన్నత్వంలో ఏకత్వానికి సజీవ సాక్ష్యం మన దేశం. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మరోవైపు వినాయక నిమజ్జనం కూడా నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్ లో పూజలో భాగంగా అమ్మవారిని ఊరేగిస్తూ తీసుకుని వెళ్తుంటే.. ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కరించారు ముస్లింలు. ఊరేగింపుని ముస్లింలు పూల వర్షం కురిపించి స్వాగతించారు. ప్రత్యేకత ఏమిటంటే వినాయకుదిపై మసీదు పైనుండి పూల వర్షం కురిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మసీదు నుంచి దేవతపై పూల వర్షం కురిపించిన ముస్లింలు.. అమ్మవారి పల్లకికి పూజలు..
Neemuch Dol Gyaras Festival
Surya Kala
| Edited By: |

Updated on: Sep 04, 2025 | 6:57 PM

Share

దేశంలో హిందూ ముస్లిం సంఘర్షణ చిత్రాలు ఎలా కనిపిస్తాయో.. అదే విధంగా సోదర భావం కూడా ఆవిష్కృతం అవుతుంది. అందుకనే భిన్నత్వంలో ఏకత్వం తరచుగా దర్శినం ఇస్తుంది. సోదరభావాన్ని బలోపేతం చేస్తూ.. జాతీయ ఐక్యతకు ఉదాహరణగా నిలుస్తూ ఉంటాయి. బుధవారం రాత్రి మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లాలోని జిరాన్ పట్టణంలో చోటు చేసుకున్న ఒక చిత్రం బయటకు వచ్చింది. ఇక్కడ డోల్ గ్యారాస్ సందర్భంగా హిందువుల ఊరేగింపును ముస్లింలు పూల వర్షంతో స్వాగతించారు. ప్రత్యేకత ఏమిటంటే మసీదు పై నుండి దేవతపై పువ్వుల వర్షం కురిపించారు. తమ హిందూ సోదరులపై పూల వర్షం కురిపించడంతో పాటు, ముస్లిం యువకులు వారికి డోల్ గ్యారాస్ శుభాకాంక్షలు తెలిపారు. వారు కూడా ఈ ఆనందంలో పాలుపంచుకున్నారు.

డ్యాన్స్ చేస్తూ సందడి చేసిన స్థానికులు నిజానికి డోల్ గ్యారస్ రోజున జిరాన్ నగరంలోని 11 ప్రధాన దేవాలయాల్లోని డ్రమ్స్‌ను అలంకరించి.. అందులో దేవతను ఉంచి నగరం చుట్టూ ఊరేగించే సంప్రదాయం ఉంది. బుధవారం సాయంత్రం కూడా.. ఈ ఊరేగింపు మొదట నగరంలోని చెరువు వద్దకు చేరుకుంది. ఈ ఊరేగింపులో భారీ సంఖ్యలో మహిళలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు, యువకులు పాల్గొన్నారు. DJ , ధోల్ ధమాకాలకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు.

ఊరేగింపులో పాల్గొన్న అఖాడా కళాకారులు గులాల్ విసిరి అద్భుతమైన విన్యాసాలు ప్రదర్శించారు. ఇక్కడ అన్ని డోళ్లలో ఉన్న దేవతకు సామూహిక హారతిని ఇచ్చారు. ప్రసాదం పంపిణీ తర్వాత, డోళ్లతో ఊరేగింపుగా నగర పర్యటనకు బయలు దేరారు. ఈ ఊరేగింపు సిటీ బస్టాండ్ సమీపంలో ఉన్న మసీదు ముందుకి చేరుకున్నప్పుడు.. ముస్లింలు హిందవులపై.. డోలలో ఉన్న దేవతపై పూల వర్షం కురిపించారు.

ఇవి కూడా చదవండి

అమ్మవారి పల్లకి మోసిన ముస్లిం యువకులు

మసీదు ముందు, ముస్లిం యువకులు పల్లకీలో ఉన్న అమ్మవారిని పూజించారు. పల్లకీని మోశారు. హిందూ-ముస్లిం ఐక్యతకు ఉదాహరణగా నిలిచే ఈ చిత్రంగా నిలిచింది ఈ అమ్మవారి వేడుక. మసీదు నుంచి హిందూ దేవతలపై పూల వర్షం కురిపించడమే కాదు భక్తితో పూజించిన వీడియో,చిత్రాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి.

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..