Chandra Grahan: చంద్రగ్రహణం నాడు శక్తివంతమైన సంసప్తక యోగం.. ఈ 3రాశులు ధనవంతులు అవ్వడం పక్కా..
వేద క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం అతి సుదీర్ఘ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7న జరగబోతోంది. ఈ చంద్రగ్రహణం శనీశ్వరుడు అదినేత అయిన కుంభరాశిలో ఏర్పడనుంది. అదే సమయంలో ఈ రోజున సంసప్తక యోగం కూడా ఏర్పడుతోందని పండితులు చెబుతున్నారు. ఈ యోగం కుజుడు, శనీశ్వరుడు కలయిక ద్వారా ఏర్పడుతుంది.

వేద క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం అతి సుదీర్ఘ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7న జరగబోతోంది. ఈ చంద్రగ్రహణం శనీశ్వరుడు అదినేత అయిన కుంభరాశిలో ఏర్పడనుంది. అదే సమయంలో ఈ రోజున సంసప్తక యోగం కూడా ఏర్పడుతోందని పండితులు చెబుతున్నారు. ఈ యోగం కుజుడు, శనీశ్వరుడు కలయిక ద్వారా ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం ప్రకాశిస్తుంది. అలాగే ఈ రాశుల ఆదాయంలో పెరుగుదల, ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు ఆస్తిని, లేదా వాహనం కొనుగోలు చేయాలనీ ప్రయత్నాలు చేస్తే వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. ఈ నేపధ్యంలో సంసప్తక యోగంతో అదృష్టం పొందే రాశులు ఏమిటో తెలుసుకోండి..
వృషభ రాశి సమసప్తక యోగం ఏర్పడటం ఈ రాశికి సానుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో వీరి ఆదాయంలో అపారమైన పెరుగుదల ఉండవచ్చు. దీనితో పాటు కొత్త ఆదాయ వనరులు సృష్టించబడవచ్చు. దీనితో పాటు కళ, రచన, సంగీతం లేదా ప్రదర్శన వంటి సృజనాత్మక రంగాలలో వీరి ప్రతిభ ప్రకాశిస్తుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఈ కాలంలో వీరు ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యంగా వృషభ రాశి వారు విదేశాలకు సంబంధించిన ప్రయత్నాలు ఫలించవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా కొత్త ప్రాజెక్టులను ప్రారంభించవచ్చు. చదువుకుంటున్న విద్యార్థులు విదేశాలలో చదువుకునే అవకాశం పొందవచ్చు.
మిథున రాశి సమసప్తక యోగం ఏర్పడటంతో మిథున రాశి వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఈ సమయంలో వీరు వృత్తి, వ్యాపారంలో పురోగతిని పొందవచ్చు. కొత్త ఉద్యోగ ఆఫర్ లేదా ప్రమోషన్‌ను కూడా పొందవచ్చు. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. మీరు మీ పోటీదారుల కంటే ముందు ఉంటారు. ఈ సమయంలో నిరుద్యోగులు ఉద్యోగాలు పొందవచ్చు. అదే సమయంలో, వ్యాపారవేత్తలు మంచి డబ్బును పొందవచ్చు. వ్యాపారం విస్తరించవచ్చు. ఈ సమయంలో తండ్రితో వీరి సంబంధం బలంగా ఉంటుంది.
తుల రాశి సమసప్తక యోగం ఏర్పడటం తుల రాశికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో వీరికి అదృష్టం మద్దతు లభిస్తుంది. అలాగే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. వీరు కుటుంబం, స్నేహితులతో మంచి సమయాన్ని గడుపుతారు. ప్రేమ సంబంధాలు కూడా మధురంగా మారుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. వీరు తమ కలలను నిజం చేసుకునే దిశగా కదులుతారు. అలాగే, ఈ సమయంలో చేపట్టిన ప్రతి ప్రణాళిక విజయవంతమవుతుంది. ఈ సమయంలో డబ్బు ఆదా చేస్తారు. వ్యాపారవేత్తలు ఆస్తిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే ఈ కాలంలో వారికి మంచి ఒప్పందం లభిస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)




