Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
దిన ఫలాలు (సెప్టెంబర్ 5, 2025): మేష రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అవసరానికి మించి చేతిలో డబ్బు ఉంటుంది. మిథున రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా తేలికగా పూర్తవుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు లాభదాయకంగా పురో గమిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

దిన ఫలాలు (సెప్టెంబర్ 5, 2025): మేష రాశి వారికి ఆదాయం నిలకడగా వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అవసరానికి మించి చేతిలో డబ్బు ఉంటుంది. మిథున రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా తేలికగా పూర్తవుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు లాభదాయకంగా పురో గమిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ తక్కువ, లాభం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో లాభాలు అందుకుంటారు. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అవసరానికి మించి చేతిలో డబ్బు ఉంటుంది. ఇంటా బయటా ఆదరణ పెరుగుతుంది, వృత్తి, ఉద్యోగాల వారికి ఆదాయం బాగుంటుంది. ఉద్యోగంలో పదో న్నతికి అవకాశం ఉంది. అనవసర ఖర్చులు అదుపులో ఉంటాయి. వ్యాపారంలో కొద్దిగా లాభాలు కనిపిస్తాయి. కొద్దిగా శ్రమ, ఒత్తిడి తప్పకపోవచ్చు. ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాలలో సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అధికారులు ప్రోత్సాహకాలతో ఆదరిస్తారు. ఏ ప్రయత్నం తలపెట్టినా తేలికగా పూర్తవుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు లాభదాయకంగా పురో గమిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇంటా బయటా మీ ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో లాభాలు ఆశించిన దాని కంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. చేపట్టిన పనులు సకాలంలో సంతృప్తికరంగా పూర్తి చేస్తారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగ జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అదనపు బాధ్యతల నుంచి విముక్తి పొందు తారు. వృత్తి, వ్యాపారాల్లో బాగా డిమాండ్ పెరుగుతుంది. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృథా ఖర్చులకు అవకాశం ఉంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం సాధించే అవ కాశం ఉంది. ఇతరులతో ఆలోచించి మాట్లాడడం మంచిది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో సహచరుల సహాయంతో కొన్ని లక్ష్యాలు, బాధ్యతలను పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. తలపెట్టిన ముఖ్యమైన పనులు నిదానంగా పురోగమిస్తాయి. బంధువులతో విభేదాలు తలెత్తే సూచనలున్నాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి. పదోన్నతులకు కూడా అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలకు ప్రాధాన్యం ఇస్తారు. తోబుట్టువులతో వివాదాలు, అపార్థాలు పరిష్కారం అవుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో మార్పులకు లేదా స్థాన చలనానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఒడిదుడుకులు తగ్గుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
ఉద్యోగంలో ఆదరణ, గుర్తింపు పెరుగుతాయి. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాల్లో రాజీ మార్గాన్ని అనుసరిస్తారు. షేర్లు, స్పెక్యులేషన్లలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు, బకాయిలు వసూలవుతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగులకు హోదా, జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారుల్లో లాభాలు అందు కుంటారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అయి, ఊరట చెందుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. మిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. కొందరు బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. అదికారం చేపట్టే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపా రాలు నిలకడగా రాణిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సాను కూలపడతాయి. కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చవుతుంది. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ధనపరంగా ఇతరులకు వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాలలో పని ఒత్తిడి ఉన్నప్పటికీ, ఆశించిన స్థాయిలో ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అప్రయత్నంగా పరిష్కారం అవుతుంది. పెండింగ్ పనుల్ని కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ వస్తుంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరిగే అవకాశం ఉంది. అదనపు ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు కొద్ది శ్రమతో పూర్తవు తాయి. ఉద్యోగ ప్రయత్నాలలో విజయం వరిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అనుకోని ఖర్చుల వల్ల ఇబ్బంది పడతారు. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు.



