Navaratri 2022: ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ బాలాత్రిపురసుందరీ దేవిగా దుర్గమ్మ దర్శనమిస్తోంది. తెల్లవారుజామున 3 గంటల నుంచే దర్శనానికి అనుమతిస్తున్నారు. నిన్న దుర్గమ్మను ఏపీ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులు దర్శించుకున్నారు. దసరా వేడుకల్లో అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు జస్టిస్ మిశ్రా.
మరోవైపు ఇంద్రకీలాద్రిపై వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడమే కాకుండా.. దర్శనం కోసం ప్రత్యేక సమయం కేటాయించారు. ఇవాళ్టి నుంచి రెండు టైమ్ స్లాట్లలో దర్శనాలకు వీలు కల్పించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు.. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు వృద్ధులు, దివ్యాంగులు అమ్మవారి దర్శనం చేసుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..