శ్రీశైలం దసరా మహోత్సవాలు.. శైలపుత్రి అలంకారంలో భ్రమరాంబికాదేవి

శ్రీశైలంలో వైభవంగా దసరా మహోత్సవాలు మొదటిరోజు శైలపుత్రీ అలంకారాంలో భక్తులకు దర్శనమిచ్చారు. భ్రమరాంబికా భృంగివాహనంపై పురవీధుల్లో శ్రీస్వామి అమ్మవార్ల గ్రామోత్సవం నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు, వాహనసేవలు, అమ్మవారికి నవదుర్గ అలంకరణలు ఉంటాయి. లోకకల్యాణం కోసం ప్రతీరోజు జపాలు, పారాయణలు, రుద్రయాగం, చండీయాగం నిర్వహిస్తారు. ఈ రోజు నవరాత్రుల్లో రెండో రోజు అమ్మవారు

శ్రీశైలం దసరా మహోత్సవాలు.. శైలపుత్రి అలంకారంలో భ్రమరాంబికాదేవి
Sirsailam Dasara

Edited By: Surya Kala

Updated on: Sep 23, 2025 | 8:04 AM

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మొదటిరోజు భ్రమరాంబికాదేవి శైలపుత్రీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.  ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శైలపుత్రీ అలంకారంలో ఉన్న అమ్మవారికి పలురకాల పూలతో అలంకరించి బిల్వాదళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు వేదపండితులు వేదమంత్రాలతో మంగళవాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులిచ్చారు. శ్రీ భ్రమరాంబికాదేవి శైలపుత్రీ అలంకారంలో అలానే మల్లికార్జునస్వామి అమ్మవారు భృంగివాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూరహారతులిచ్చారు.

 

అనంతరం వైభవంగా గ్రామోత్సవానికి బయలుదేరగా ఉత్సవమూర్తుల ముందు కోలాటాలు, చెక్క భజనలు, కేరళ నృత్యాలు వాయిద్యాలు, గిరిజనుల నృత్యాలు, వివిధ రకాల గిరిజన నృత్యాలు వివిద రకాల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.  ఆలయం లోపలి నుంచి భాజా బజంత్రీలు బ్యాండ్ వాయిద్యాల నడుమ‌ శ్రీస్వామి అమ్మవార్లు గ్రామోత్సవంగా విహారించారు.  గ్రామోత్సవం కదలివస్తున్న స్వామి అమ్మవారిని భక్తులు దర్శించుకుని‌ కర్పూర నీరాజనాలర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస రావు దంపతులు, అర్చకులు,అధికారులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..