Navratri 2025: దసరా సెలవులు వచ్చేస్తున్నాయి.. ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేస్తుంటే.. ఈ అమ్మవారి టెంపుల్స్ బెస్ట్ ఎంపిక..

గణపతి ఉత్సవాలు ముగింపు రోజు వచేస్తోంది. బొజ్జ గణపయ్యని నిమజ్జనం చేసిన తర్వాత దేశ వ్యాప్తంగా శరన్నవరాత్రుల సందడి మొదలవుతుంది. ఈ నెలలోనే అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను జరుపుకోనున్నాం. అదే సమయంలో స్టూడెంట్స్ కు దసరా సెలవులు కూడా రానున్నాయి. ఈ నేపధ్యంలో నవరాత్రి ఉత్సవాలకు ఫ్యామిలీ తో కలిసి దేశంలో ఏదైనా అమ్మవారి శక్తిపీఠాన్ని సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారా.. నవరాత్రుల సమయంలో ఈ ఐదు శక్తిపీఠాల వైభవాన్ని చూడానికి రెండు కళ్ళు చాలవు అనిపిస్తుంది.

Navratri 2025: దసరా సెలవులు వచ్చేస్తున్నాయి.. ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేస్తుంటే.. ఈ అమ్మవారి టెంపుల్స్ బెస్ట్ ఎంపిక..
Navratri 2025

Updated on: Sep 02, 2025 | 12:41 PM

ఈ ఏడాది శారదీయ నవరాత్రులు సెప్టెంబర్ 22న ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2న విజయదశమితో ముగుస్తాయి. ఈ శారదయ నవరాత్రులను ప్రత్యేకంగా చేసుకోవాలనుకున్నా.. అమ్మవారి వివిధ రూపాలను సందర్శించులున్నా ఈ సమయం బెస్ట్. ఎందుకంటే పిల్లలకు దసరా సెలవులు ఉంటాయి కనుక. ఫ్యామిలీ మొత్తం సంతోషంగా యాత్రకి వెళ్ళవచ్చు. ఈ నేపధ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న శక్తిపీఠాలకు, అమ్మవారి దేవాలయాలకు భక్తులు భారీగా తరలివస్తారు.

భారతదేశంలో అనేక ప్రసిద్ధ శక్తిపీఠాలు, అమ్మవారి ఆలయాలున్నాయి. ఇక్కడ అమ్మవారి వివిధ రూపాలకు గొప్ప పూజ జరుగుతుంది. ఈ రోజు నవరాత్రి సమయంలో పుణ్యాన్ని ఇచ్చే ఐదు ప్రధాన ప్రధాన అమ్మవారి ఆలయాల గురించి తెలుసుకుందాం.. ఇక్కడ నవరాత్రులలో అమ్మవారి వైభవం గొప్పగా ఉంటుంది.

వైష్ణో దేవి ఆలయం: జమ్మూ కాశ్మీర్ త్రికూట కొండలపై ఉన్న ఈ ఆలయం. వైష్ణో దేవి అత్యంత ప్రసిద్ధ మందిరం. నవరాత్రి సమయంలో భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. మీరు ఇక్కడికి వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే, ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే నవరాత్రి రోజులలో ఇక్కడ చాలా మంది రద్దీ ఉంటుంది. కనుక ముందుగానే ప్లాన్ చేసుకుని బుక్ చేసుకోకపోతే, ఆ సమయంలో బస చేయడానికి స్థలం కూడా లభించకపోవచ్చు.

ఇవి కూడా చదవండి

కామాఖ్య దేవి ఆలయం, అస్సాం: అస్సాంలోని గౌహతిలో ఉన్న ఈ శక్తిపీఠం తాంత్రిక పూజలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న అమ్మవారిని కామాఖ్య దేవి అని పిలుస్తారు. నవరాత్రి సమయంలో ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక్కడికి వెళ్ళాలంటే.. ముందుగానే విమానం లేదా రైలులో బస చేయడానికి హోటల్ బుక్ చేసుకోవాలి. దీనితో పాటు ముందుగానే బస చేయడానికి హోటల్ బుక్ చేసుకోండి.

కాళిఘాట్ ఆలయం , కోల్‌కతా: కోల్‌కతాలోని ఈ ఆలయం అమ్మవారికి అంకితం చేయబడింది. ఈ ఆలయాన్ని దుర్గా పూజ , నవరాత్రి సమయంలో ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఈ ఆలయంలో కాళి దేవి విగ్రహం ఉగ్ర రూపంలో ఉంటుంది. అమ్మవారి నాలుక బంగారంతో తయారు చేయబడింది. అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి ఎవరు వచ్చినా వారి కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. ఇక్కడ జరిగే దేవీ నవరాత్రు దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందాయి. కనుక మీరు ఇప్పుడే ఇక్కడికి సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు.

జ్వాలా దేవి ఆలయం హిమాచల్ ప్రదేశ్: జ్వాలా దేవి ఆలయం హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలో ఉంది. ఈ ఆలయం జ్వాలకు అంకితం చేయబడింది. అమ్మవారు అగ్ని రూపంలో భక్తులతో పూజలను అందుకుంటారు. ఈ ఆలయంలో అగ్ని జ్వాలలు సహజంగా ఏర్పడాయని.. నిరంతరం వెలుగుతూ ఉంటాయని విశ్వాసం. నవరాత్రి సమయంలో ఇక్కడ ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. అందువల్ల, శారదియ నవరాత్రి సందర్భంగా ఇక్కడ సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు.

నైనా దేవి ఆలయం, హిమాచల్ ప్రదేశ్: నైనా దేవి ఆలయం హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్ పూర్ జిల్లాలో ఉంది. ఇది మాత సతి కళ్ళు పడిన ప్రదేశం. ప్రసిద్ధ శక్తి పీఠాలలో ఒకటి అని నమ్ముతారు. ప్రతి సంవత్సరం దూర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తారు. కనుక మీరు కూడా హిమాచల్ కు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే.. నైనా దేవి ఆలయాన్ని కూడా సందర్శించే లిస్టు లో చేర్చుకోండి.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)