Dussehra: అమ్మవారి మెడలో పూలదండ వేసేందుకు వేలంపాట.. ఎన్ని లక్షలకు అవకాశం దక్కిందంటే..?

| Edited By: Janardhan Veluru

Oct 09, 2024 | 1:23 PM

దసరా రోజు అమ్మవారి ఊరేగింపు రోజున అమ్మవారి మెడలో మొదటి పూలదండ వేయనున్నారు ఆకుల లక్ష్మణరావు. సాధారణంగా వినాయక చవితి లో వినాయకుడి చేతిలో లడ్డూ కు లేదా అమ్మవారి వచ్చిన చీరలకు వేలం పాట పెట్టి అమ్మడం సర్వసాధారణం. అయితే రమణం వీధిలోని అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాల్లో అమ్మవారి మెడలో పూలదండ వేసేందుకు వేలంపాట పెట్టడం విశేషం.

Dussehra: అమ్మవారి మెడలో పూలదండ వేసేందుకు వేలంపాట.. ఎన్ని లక్షలకు అవకాశం దక్కిందంటే..?
Dussehra Celebrations In Amalapuram
Follow us on

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మైసూర్ తర్వాత అంతటి ఖ్యాతిగాంచాయి ఇక్కడ దసరా ఉత్సావాలు. అమలాపురంలో  ఉన్న శ్రీమహిషాసుర మర్దిని అమ్మవారి మెడలో పూల దండ వేసేందుకు వేలంపాట నిర్వహించారు కమిటీ సభ్యులు. అమలాపురం రవణం వీధిలో ఉన్న శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారికి మెడలో పూల దండ వేసేందుకు ప్రతి ఏటా వేలంపాట నిర్వహిస్తున్నారు ఆలయ కమిటీ సభ్యులు. అమ్మవారి మెడలో వేసే మొదటి పూలదండ వేసేందుకు వేలంపాటలో లక్ష మూడువేల రూపాయలకు పూల దండ ను దక్కించుకున్నరు హైదారాబాద్ భక్తుడు.

హైదారాబాద్ లో వుంటున్న భక్తుడు ఆకుల లక్ష్మణరావు ఫోన్ లో వీడియో కాల్ ద్వారా వేలంపాటలో పాల్గొని అమ్మవారి మెడలో పూల దండ వేలంపాటలో దక్కించుకున్నారు. అయితే ఈసారి అమ్మవారి మెడలో పూలదండ వేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు పోటీపడ్డారు. గత కొన్ని సవత్సరాలుగా శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారి మెడలో పూలదండకు వేలంపాట నిర్వహిస్తున్నరు కమిటీ సభ్యులు.

12 సంవత్సరాల క్రితం 5 వేల రూపాయలు పలికిన పూలదండ ప్రతి ఏటా వేరుగుతూ ఈసారి లక్ష మూడువేల రూపాయలకు చేరింది. అమ్మవారి మెడలో పూల దండ వేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం.  దసరా రోజు అమ్మవారి ఊరేగింపు రోజున అమ్మవారి మెడలో మొదటి పూలదండ వేయనున్నారు ఆకుల లక్ష్మణరావు. సాధారణంగా వినాయక చవితి లో వినాయకుడి చేతిలో లడ్డూ కు లేదా అమ్మవారి వచ్చిన చీరలకు వేలం పాట పెట్టి అమ్మడం సర్వసాధారణం. అయితే రమణం వీధిలోని అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాల్లో అమ్మవారి మెడలో పూలదండ వేసేందుకు వేలంపాట పెట్టడం విశేషం.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..