Navratri 2021: హిందువులకు అత్యంత ప్రీతికరమైన దేవీ శరన్నవరాత్రులు ఈ నెల 7 నుంచి ప్రారంభంకాబోతున్నాయి. తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు, పూజలు నిర్వహిస్తారు. చల్లంగా చూడమని తల్లిని వేడుకుంటారు.15వ తేదీన దసరా పండుగ జరుపుకుంటారు. అయితే దుర్గామాతను ప్రార్థించే ముందు భక్తులు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఉపవాసం ఉండేవారు, దేవీ మండపంలో తిరుగాడేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నవరాత్రులలో చేయాల్సిన పనులు, చేయకూడని పనుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నవరాత్రి 2021: ఏమి చేయాలి?
1. శరన్నవరాత్రులు చాలా పవిత్రమైన రోజులు. కాబట్టి ఈ సమయంలో మొదటగా పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. రోజూ కచ్చితంగా స్నానం చేయాలి. శుభ్రమైన దుస్తులు ధరించాలి. పూజగదిని, దేవీ కుటీరాన్ని శుభ్రంగా ఉంచాలి.
2. మొదటి రోజు కలశ స్థాపన, ముహూర్త సమయం, ఆచారాల ప్రకారం చేయాలి.
3. ప్రతిరోజూ రెండుసార్లు కలశం ముందు నెయ్యి దీపం వెలిగించాలి.
4. దుర్గా సప్తశతి పఠించాలి. దుర్గా మంత్రాలు, శ్లోకాలు జపించాలి.
5. ఉపవాసం చేయాలనుకుంటే ఉపవాసం ఆచారాలను పాటించాలి. సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి. స్వీయ నిగ్రహం కలిగి ఉండాలి.
నవరాత్రి 2021: ఏమి చేయకూడదు?
1. కలశానికి ముందు అఖండ జ్యోతి వెలిగిస్తే దానిని ఆర్పవద్దు. ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండేలా చూడాలి.
2. మీరు ఉపవాసం ఉన్నప్పటికీ ఆకలితో ఉండవద్దు. లైట్ ఫుడ్ ఏదైనా తినవచ్చు.
3. మాంసాహారం, మద్య పానీయాలకు దూరంగా ఉండాలి.
4. నవరాత్రి సమయంలో గుండు చేయించుకోవద్దు. అంతేకాదు జుట్టు కూడా కత్తిరించుకోకూడదు.
5. గోళ్లు కత్తిరించకూడదు.
6. ఎవరి పట్ల కఠినంగా వ్యవహించవద్దు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ధ్యానంతో అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి.
గమనిక- ఈ సమాచారం మత విశ్వాసాలు, జానపద నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవని గుర్తించండి. కేవలం సాధారణ పాఠకుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాయడం జరిగింది.