Navaratri 2024: నవరాత్రుల్లో అమ్మ అనుగ్రహం కోసం 9 రోజులలో ఈ 9 రంగుల దుస్తులను ధరించి పూజించండి..

|

Sep 30, 2024 | 9:02 PM

నవరాత్రి రోజుల్లో భక్తులు తొమ్మిది రోజులు లేదా కొన్ని రోజులు ఉపవాసం ఉండి దుర్గాదేవిని పూజిస్తారు. ఈ రోజుల్లో ఉపవాసం ఉండడంతో పాటు దుర్గా దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక పూజలు, ప్రార్థనలు కూడా చేస్తారు. ఈ నవరాత్రులలో చేసే ఉపవాసంలో ఎటువంటి దోషం ఉండకూడదని, పూజలు విజయవంతంగా, శుభప్రదంగా సాగాలని కోరుకుంటే నవరాత్రులలో ఏ రోజున ఏ రంగు బట్టలు ధరించి పూజించాలో తెలుసుకుందాం..

Navaratri 2024: నవరాత్రుల్లో అమ్మ అనుగ్రహం కోసం 9 రోజులలో ఈ 9 రంగుల దుస్తులను ధరించి పూజించండి..
Navaratri Durga Puja
Follow us on

శరన్నవరాత్రులు దుర్గాదేవికి అంకితం చేయబడిన తొమ్మిది రోజుల పాటు జరిగే ప్రసిద్ధ పండుగ. ఇది దుర్గా దేవిని ప్రసన్నం చేసుకోవడానికి, అమ్మవారి అనుగ్రహం కోసం జరుపుకునే పండుగ. నవరాత్రి రోజుల్లో భక్తులు తొమ్మిది రోజులు లేదా కొన్ని రోజులు ఉపవాసం ఉండి దుర్గాదేవిని పూజిస్తారు. ఈ రోజుల్లో ఉపవాసం ఉండడంతో పాటు దుర్గా దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక పూజలు, ప్రార్థనలు కూడా చేస్తారు. ఈ నవరాత్రులలో చేసే ఉపవాసంలో ఎటువంటి దోషం ఉండకూడదని, పూజలు విజయవంతంగా, శుభప్రదంగా సాగాలని కోరుకుంటే నవరాత్రులలో ఏ రోజున ఏ రంగు బట్టలు ధరించి పూజించాలో తెలుసుకుందాం..

దేవీ నవరాత్రి 2024 ఎప్పుడు?

పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్షం ప్రతిపద తిథి అక్టోబర్ 3న అర్ధరాత్రి 12.19 గంటలకు ప్రారంభమై మర్నాడు అక్టోబర్ 4న తెల్లవారుజామున 2.58 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం శరన్నవరాత్రులు గురువారం అక్టోబర్ 3, 2024 నుంచి ప్రారంభంకానున్నాయి. నవ రాత్రులు అక్టోబర్ 12, 2024 శనివారం ముగుస్తుంది.

నవరాత్రి 9 రోజులు ఈ రంగుల దుస్తులను ధరించండి

మొదటి రోజు
నవరాత్రుల మొదటి రోజున ఘటస్థాపన చేస్తారు. ఈ రోజు శైలపుత్రిని పూజిస్తారు. శైలపుత్రికి ఇష్టమైన రంగు తెలుపు. అమ్మవారికి తెలుపు రంగు అత్యంత ఇష్టమైనదిగా భావిస్తారు. కనుక నవరాత్రుల మొదటి రోజున తెల్లని వస్త్రాలు ధరించి శైలపుత్రి దేవిని పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు.

ఇవి కూడా చదవండి

రెండవ రోజు
నవరాత్రుల రెండవ రోజున బ్రహ్మచారిణి తల్లిని పూజిస్తారు. తల్లి బ్రహ్మచారిణి కూడా తెలుపు రంగు దుస్తులను ఇష్టపడుతుంది. కనుక నవరాత్రులలో రెండవ రోజున కూడా తెల్లని రంగును పూజలో ధరించాలి.

మూడవ రోజు
నవరాత్రుల మూడవ రోజున చంద్రఘంట తల్లిని పూజిస్తారు. దుర్గాదేవికి ఎరుపు రంగు చాలా ప్రియమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున చంద్రఘంట రూపమైన దుర్గాదేవిని ఎరుపు రంగు దుస్తులు ధరించి పూజించాలి.

నాల్గవ రోజు
నవరాత్రులలో నాల్గవ రోజున తల్లి కూష్మాండ దేవిని పూజిస్తారు. ఈ రోజున ముదురు నీలం లేదా ఊదా రంగు దుస్తులు ధరించి కూష్మాండ దేవిని పూజించాలి. ఇలా చేయడం వల్ల అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయని, ఇంటికి ఐశ్వర్యం చేకూరుతుందని నమ్మకం.

ఐదవ రోజు
నవరాత్రి ఐదవ రోజున దుర్గా రూపంగా స్కందమాతను పూజిస్తారు. అమ్మవారి ఒడిలో కార్తికేయుడు (స్కందుడు) కూర్చుని ఉంటాడు. దుర్గాదేవి ఈ రూపం ప్రేమకు చిహ్నంగా పరిగణించబడుతుంది. స్కందమాతను పసుపు లేదా తెలుపు బట్టలు ధరించి పూజించాలి.

ఆరవ రోజు
నవరాత్రులలో ఆరవ రోజున కాత్యాయని దేవిని పూజిస్తారు. ఈ రోజున గులాబీ రంగు దుస్తులు ధరించి కాత్యాయని తల్లిని పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు.

ఏడవ రోజు
నవరాత్రులలో ఏడవ రోజున కాళరాత్రి తల్లిని పూజిస్తారు. దుర్గామాత ఈ రూపం చెడిని నాశనం చేసేదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున బూడిద రంగు లేదా గోధుమ రంగు దుస్తులు ధరించి కాళరాత్రిని పూజించాలి.

ఎనిమిదవ రోజు
నవరాత్రులలో ఎనిమిదవ రోజున అమ్మ మహాగౌరీ దేవిని పూజిస్తారు. మహాగౌరి రంగు తెల్లగా పరిగణించబడుతుంది. ఈ రోజున మహాగౌరీ దేవిని తెలుపు లేదా ఊదా రంగు దుస్తులు ధరించి పూజించాలి.

తొమ్మిదవ రోజు
నవరాత్రుల చివరి రోజున తల్లి సిద్ధిదాత్రిని పూజిస్తారు. ఈ రోజున పచ్చని వస్త్రాలు ధరించి పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం పెరుగుతాయని నమ్ముతారు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి