నరక చతుర్దశి రోజున యమ దీపాన్ని ఏ దిశలో వెలిగించాలి? యముడి అనుగ్రహాన్ని ఎలా పొందుతారంటే?

|

Oct 28, 2024 | 8:50 AM

నరక చతుర్దశి రోజున యమ దీపం వెలిగించడం ఒక ముఖ్యమైన సంప్రదాయం. యమ దీపం వెలిగించడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని, ఇంట్లో సుఖశాంతులు లభిస్తాయని నమ్ముతారు, అయితే యమ దీపాన్ని ఏ దిక్కున వెలిగించాలి అనే సందేహం చాలా మందికి ఉంటుంది. నరక చతుర్దశి రోజున యమ దీపాన్ని ఏ దిశలో ఎలా వెలిగిస్తే దీర్ఘాయువు అనుగ్రహాన్ని ఎలా పొందుతారు తెలుసుకుందాం..

నరక చతుర్దశి రోజున యమ దీపాన్ని ఏ దిశలో వెలిగించాలి? యముడి అనుగ్రహాన్ని ఎలా పొందుతారంటే?
Yama Deepam
Follow us on

హిందూ మతంలో దీపావళి పండగను కొంతమంది నరక చతుర్దశి , దీపావళి గా రెండు రోజులు జరుపుకుంటారు. నరక చతుర్దశి రోజుని ఛోటీ దీపావళిని అని కూడా అంటారు. ఈ రోజు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా చోటీ దీపావళిగా జరుపుకుంటారు. నరక చతుర్దశి రోజున ప్రదోష కాలంలో యముడికి అంకితం చేసిన నాలుగు ముఖాల దీపాలను వెలిగించే సంప్రదాయం ఉంది. ఈ రోజున ప్రజలు కుబేరుడు, లక్ష్మీ దేవి, ధన్వంతరి, మృత్యుదేవతగా పరిగణించబడే యమ దేవుడిని పూజిస్తారు. నరక చతుర్దశి రోజున సాయంత్రం యమ దీపాన్ని వెలిగించడం కూడా ఆచారం.

ఛోటీ దీపావళి రోజున సాయంత్రం ప్రదోషకాలంలో గోధుమపిండితో లేదా బియ్యం పిండితో దీపం చేసి నాలుగు వత్తులు తయారుచేసి దీపంలో వేసి అందులో నువ్వుల నూనే లేదా ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఆ తర్వాత దీపం చుట్టూ గంగాజలం చల్లాలి. దీని తరువాత.. ఇంటి ప్రధాన ద్వారం వద్ద దక్షిణ దిశలో ఉంచండి. దీపం కింద కొంచెం ధాన్యం ఉంచండి. కొంతమంది డ్రెయిన్ దగ్గర లేదా కొన్ని ప్రదేశాలలో యమ దీపాన్ని ఉంచుతారు. దీపం వెలిగించిన తర్వాత పూర్తి భక్తిశ్రద్దలతో, విశ్వాసంతో, భావోద్వేగంతో భగవంతుడిని ప్రార్థించండి. కుటుంబ శ్రేయస్సు కోసం ఆశీర్వాదం పొందండి.

పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి తిథి బుధవారం అక్టోబర్ 30వ తేదీ మధ్యాహ్నం 1:15 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా చతుర్దశి తిథి గురువారం అక్టోబర్ 31వ తేదీ మధ్యాహ్నం 3.52 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఈ సంవత్సరం నరక చతుర్దశి 30 అక్టోబర్ 2024 న జరుపుకుంటారు. నరక చతుర్దశి రోజున సూర్యాస్తమయం తర్వాత యమ దీపం వెలిగిస్తారు. ఈ రోజున సాయంత్రం 5.36 నుంచి 6.05 గంటల వరకు పూజ శుభ సమయం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి

పురాణాల ప్రకారం హిందూ మతంలో దక్షిణ దిశను యమధర్మ రాజు దిశగా పరిగణిస్తారు. ఈ దిక్కున యమ దీపం వెలిగించడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. యమ దీపం వెలిగించడం వల్ల పూర్వీకులకు మోక్షం లభిస్తుందని నమ్మకం. సాయంత్రం సమయంలో యమ దీపం వెలిగించాలి. యమ దీపంలో స్వచ్ఛమైన నెయ్యిని మాత్రమే ఉపయోగించాలి. యమ దీపంలోని ఒత్తి నాణ్యమైన పత్తితో చేసింది అయి ఉండాలి. దీపం శుభ్రంగా మరియు అందంగా ఉండాలి. కొంతమంది ఇంటి బయట కూడా యమ దీపాన్ని వెలిగిస్తారు. యమ దీపం వెలిగించేటప్పుడు మీ మనస్సులో స్వచ్ఛమైన భావాలను ఉంచుకోండి. లేకుంటే జీవితంలో ఇబ్బందులు తప్పవు.

ఈ దిశలో యమ దీపాన్ని వెలిగించండి

నరక చతుర్దశి రోజున యమ దీపం వెలిగించడం ఒక ముఖ్యమైన సంప్రదాయం. యమ దీపం వెలిగించడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని, ఇంట్లో సుఖశాంతులు లభిస్తాయని నమ్ముతారు, అయితే యమ దీపాన్ని ఏ దిక్కున వెలిగించాలి అనే సందేహం చాలా మందికి ఉంటుంది. సాధారణంగా దక్షిణ దిశలో యమ దీపాలను వెలిగించే సంప్రదాయం ఉంది. దక్షిణ దిశను యమధర్మ రాజు దిశగా పరిగణిస్తారు. అందువలన దక్షిణ దిశలో యమ దీపాన్ని వెలిగించడం వలన యమధర్మ రాజు సంతోషిస్తాడు.

యమ దీపానికి ప్రాముఖ్యత

దీపావళి పండగ ఈ పవిత్రమైన రోజున పూజించబడే దేవతలలో యముడు ఒకడు. ఈ రోజున ప్రదోష కాలంలో నాలుగు ముఖాల దీపాన్ని వెలిగించి.. దానిని దక్షిణం వైపు ఉంచుతారు. ఇది యముడికి అంకితం చేయబడింది. ఈ నాలుగు ముఖాల దీపాన్ని వెలిగించిన వారికి మృత్యుభయం నుండి ఉపశమనం లభిస్తుందని, దీర్ఘాయువు ప్రసాదిస్తాడని నమ్మకం. ఎందుకంటే యముడు వారిని రక్షిస్తాడు, దీర్ఘాయువు, శ్రేయస్సును అనుగ్రహిస్తాడని విశ్వాసం.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)