Naga Panchami 2024: నాగ పంచమి రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు.. కాల సర్ప దోషం బారిన పడవచ్చు సుమా..

|

Aug 05, 2024 | 11:52 AM

నాగ పంచమి నాడు నాగదేవతను పూజించడం వల్ల మనిషికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని మత విశ్వాసం. ఈ ఏడాది ఆగస్టు 9న నాగ పంచమి జరుపుకోనున్నారు. ఈ రోజున నాగేంద్రుడితో పాటు శివుడిని పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. దీనితో పాటు ఈ రోజున చేసే పనుల విషయంలో కొంత ప్రత్యేక  శ్రద్ధ వహించాలి. నాగేంద్రుడిని ఎలా పూజించాలో ఈ రోజు తెలుసుకుందాం.. 

Naga Panchami 2024: నాగ పంచమి రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు.. కాల సర్ప దోషం బారిన పడవచ్చు సుమా..
Naga Panchami L
Follow us on

శ్రావణ మాసం ఆధ్యాత్మిక మాసం. చాలా పవిత్రమైనది. ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఈ నెలలో చేసే పూజలు, వ్రతాలు అత్యంత ఫలవంతం అని నమ్మకం. శ్రీ హరి జన్మ నక్షత్రంతో ఏర్పడిన ఈ నెలలో శివ పార్వతుల పూజ కూడా విశేష ఫలితాలను ఇస్తుంది.  అంతేకాదు శ్ఈరావణ పంచమి తిధిలో సర్పాలను పూజించే సంప్రదాయం కూడా ఉంది. ఈ ప్రత్యేకమైన రోజును నాగ పంచమిగా జరుపుకుంటారు. అయితే ఇది ఎలా మొదలైంది? నాగేంద్రుడిని ఎలా పూజించాలో ఈ రోజు తెలుసుకుందాం..

నాగ పంచమి నాడు నాగదేవతను పూజించడం వల్ల మనిషికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని మత విశ్వాసం. ఈ ఏడాది ఆగస్టు 9న నాగ పంచమి జరుపుకోనున్నారు. ఈ రోజున నాగేంద్రుడితో పాటు శివుడిని పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. దీనితో పాటు ఈ రోజున చేసే పనుల విషయంలో కొంత ప్రత్యేక  శ్రద్ధ వహించాలి.

నాగ పంచమి పూజ సామగ్రి

ఇవి కూడా చదవండి

నాగ పంచమి రోజున పాలు, వడ్లు, దర్భలను ఆవు పేడతో నాగదేవత పూజ సామాగ్రి.అలాగే ఈ రోజు పేదలకు, నిరుపేదలకు ఆహారం అందిస్తారు. ఈ రోజున నాగదేవతను పూజించడం, దానం చేయడం ద్వారా ఎవరి  జాతకంలోనైనా కాలసర్ప దోషం ఉంటే ఆ దోషం నుంచి విముక్తి లభిస్తుంది.

ఈ విషయాలను గుర్తుంచుకోండి

నాగ పంచమి రోజున నాగదేవతకు పాలు సమర్పించే సంప్రదాయం ఉంది. అయితే ఇది ప్రజల్లో ఉన్న అపోహ అని అంటున్నారు. ఇలా ఏ శాస్త్రాలలో పాము దేవునికి పాలని సమర్పించమని చెప్పలేదు. అయితే పాలతో అభిషేకం చేయాలనీ సూచిస్తోంది. అదే సమయంలో సైన్స్ ప్రకారం పాములు పాలను పెట్టడం  వలన ఆ పాలు పాములకు జీర్ణం అవ్వవు. ఈ  కారణంగా అవి చనిపోతాయి. కనుక పాములకు పాలను నైవేద్యంగా పెట్టడం పుట్టలో పాలు పోయడం మానుకోవాలని కొంతమంది సూచిస్తున్నారు.

నాగ పంచమి రోజున ఏ పనులు చేయకూడదంటే

పురాణాల విశ్వాసం ప్రకారం  నాగ పంచమి రోజున పాములకు పాలు పోస్తారు. అయితే పాము నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పాముకు పాలు పోస్తే.. పాముల ఆరోగ్యం పాడవుతుంది. ఒకొక్కసారి ప్రాణ హాని కూడా ఏర్పడే సందర్భం ఉంటుంది.  నాగ పంచమి రోజున ఆలయానికి వెళ్ళండి. శివునితో పాటు నాగేంద్రుడికి  పాలతో అభిషేకం చేసి పూజించండి. ఆలయంలో నాగేంద్రుడి విగ్రహం దగ్గర గిన్నెలో పాలు పోసి ఆ గిన్నెను నైవేద్యంగా సమర్పించండి.

నాగ పంచమి నాడు ఈ పనులు పొరపాటున కూడా చేయకండి

నాగ పంచమి రోజున భూమిని తవ్వవద్దు, పొలాలను దున్నవద్దు. పురాణ గ్రంధాలలో అలా చేయడం నిషిద్ధం. భూమిలో పాము కలుగు లేదా పాములు ఉంటే హాని కలగవచ్చు. అంతేకాదు నాగ పంచమి రోజున పదునైన కత్తులు, కత్తులు, కత్తెర వంటి పదునైన వస్తువులను ఎప్పుడూ ఉపయోగించకూడదు. ఈ రోజున కుట్టుపని, ఎంబ్రాయిడరీ చేయరాదు. నమ్మకం ప్రకారం ఈ రోజున ఈ పని చేయడం నిషేధించబడింది.

పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి

నాగ పంచమి రోజున కొన్ని ప్రత్యేక విషయాలు గుర్తుంచుకోవాలి. ఈ రోజు పాముకి హాని చేయకూడదు. పాముకి హాని జరిగితే, దానిని రక్షించాలి. ఈ రోజున పాముకి హాని జరిగితే అది సర్ప దోషం, కల సర్ప దోషం వంటి లోపాలతో బాధపడాల్సి ఉంటుందని మత విశ్వాసం.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు