Nachiar Kovil Temple: గరుత్మంతుని విగ్రహంపై చెమటలు.. సైన్స్ కే సవాల్.. ఈ క్షేత్రం ఎక్కడుందో తెలుసా..!

తమిళనాడులోని కుంభకోణం పట్టణానికి దగ్గరలో ఉన్న తిరునారయూర్ క్షేత్రంలో పూజలు అందుకునే ఉత్సవ మూర్తి ఓ స్పెషల్.. గరుత్మంతుడు ప్రారంభంలో తక్కువ బరువుండి క్రమంగా పెంచుకుంటూ పోయేసరికి అతడికి చెమట పడుతుందని..

Nachiar Kovil Temple: గరుత్మంతుని విగ్రహంపై చెమటలు.. సైన్స్ కే సవాల్.. ఈ క్షేత్రం ఎక్కడుందో తెలుసా..!
Follow us

|

Updated on: Jan 31, 2021 | 1:00 PM

Nachiar Kovil Temple:

భారత దేశంలో అనేక పురాతన ఆలయాలు, ప్రసిద్ధి దేవాలయాలు.. సైన్స్ నే సవాల్ చేస్తూ అంతుచిక్కని రహస్యాలను సొంతం చేసుకున్న ప్రాంతాలు అనేకం ఉన్నాయి. ఇక దేశం మొత్తంలో అతి పురాతన ఆలయాలు, ప్రసిద్ధ దేవాలయాలు, ఎక్కువగా ఆలయాలు ఉన్న ప్రాంతం తమిళనాడు అందుకే ఈ రాష్ట్రాన్ని దేవతల నిలయం అని అంటారు.. దేశ వ్యాప్తంగా ఎక్కువగా వైష్ణవ, శైవ ఆలయాలతో పాటు కుమారస్వామి, అంజనేయ, దుర్గ దేవాలయాలు దర్శనమిస్తాయి.. అయితే తమిళనాడులోని కుంభకోణం పట్టణానికి దగ్గరలో ఉన్న తిరునారయూర్ క్షేత్రంలో పూజలు అందుకునే ఉత్సవ మూర్తి ఓ స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే 108 శ్రీ వైష్ణవ దేవాలయాల్లో దీనికో విశిష్టత ఉంది. అది ఏమిటో తెలుసుకుందాం..!

తిరునారయూర్ క్షేత్రంలో నాచ్చియార్ కోవెల్‌ దేవాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ గుడిలో ఉత్సవమూర్తిగా ఉన్న గరుత్మంతుని విగ్రహం నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఆలయాన్ని దర్సించిన భక్తులే దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఇక్కడ ఏడాదికి రెండు సార్లు స్వామి వారికి ఊరేగింపు ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే అమ్మవారిని, స్వామి వారిని విడివిడిగా ఊరేగిస్తారు. తయారు అమ్మవారిని హంసవాహనం మీద, శ్రీనివాస్ పెరుమాళ్ స్వామి వారిని గరుడ వాహనం మీద ఊరేగిస్తారు.

ఈ స్థల విశిష్టత గురించి ఊరేగింపు గురించి అర్చకులు మాట్లాడుతూ.. ఊరేగింపు సమయంలో ముందు అమ్మవారి వాహనం.. వెనుక స్వామి వారి వాహనం ఉంటాయని చెప్పారు. . స్వామి వారిది గరుడ వాహనం. అందుకే అమ్మవారి హంస వాహనం కన్నా వేగం ఎక్కువగా ఉంటుంది. దాంతో స్వామి వారు చిక్కుల్లో పడతారు. వాహనం నడిపే సూత్రధారి అయిన గరుత్మంతుడు అమ్మవారిని దాటుకుని వెళ్లనంటారు. తగినంత వేగంతో అమ్మవారి వెనకే వెళతానంటారని స్థల పురాణం కథనం ద్వారా తెలుస్తోంది. అంతేకాదు ఈ ఊరేగింపు సమయంలో చోటు చేసుకునే విచిత్రం శాస్త్రజ్ఞులకు సైతం సవాల్ గా నిలుస్తుంది.

ఊరేగింపు సమయంలో విచిత్రం:

పెరుమాళ్ స్వామి వారు మొదటి ప్రాకారంలో గరుడ వాహనం ఎక్కినప్పుడు అది తేలికగా ఉండి కేవలం నలుగురు మనుషులు మోస్తే చాలు కదులుతుంది. అనంతరం ఆ వాహనం క్రమ క్రమంగా వాహనం బరువు పెరుగుతుంటుంది. 2వ ప్రాకారానికి వచ్చే సరికి 8 మంది మోయాల్సి వస్తుంది. అది దాటుకుని మూడవ ప్రాకారానికి వచ్చే సరికి 16మంది, 4వ ప్రాకారానికి వచ్చేసరికి 32 మంది, 5వ ప్రాకారానికి వచ్చే సరికి 64 మంది మోయాల్సి వస్తుంది. ఇలా అయిదు ప్రాకారాలు దాటి పుర వీధుల్లోకి వచ్చే సమయానికి గరుడ వాహనం బరువు విపరీతంగా పెరిగిపోయి 120 మంది వరకు మోయాల్సి వస్తుంది.

ప్రధాన వీధుల్లోకి వచ్చేసరికి అమ్మవారు ఉన్న హంస వాహనాన్ని 16 మంది మోస్తుండగా, స్వామి వారి గరుడ వాహనాన్ని 128 మంది మోయాల్సొస్తుంది. దాంతో ఈ వాహనం నిదానంగా కదులుతూ ఉంటుంది. ఇక్కడొక విచిత్రం చోటు చేసుకుంటుంది. అది.. ఊరేగింపు సమయంలో గరుత్మంతుని ఉత్సవ విగ్రహంపైన చెమట బిందువులు కనిపిస్తాయి. గరుత్మంతుడు ప్రారంభంలో తక్కువ బరువుండి క్రమంగా పెంచుకుంటూ పోయేసరికి అతడికి చెమట పడుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ గరుత్మంతుడిని ఇక్కడి భక్తులు కాలగరుడన్ అని కూడా పిలుస్తారు.

మహాశక్తిమంతుడైన ఈ కాలగరుడన్ నవ (9) నాగుల్ని ఆభరణాలుగా ధరిస్తారని చెబుతారు. అవి.. ఆదిశేషుడుని తన కంకణంగా… కర్కోటకుడు ను పూలదండగా ధరిస్తాడు. ఇక పద్మనాభుడుని కుడిచెవి ఆభరణంగా.. మహా పద్ముడుని ఎడమ చేతి ఆభరణంగా అలంకరించుకుంటాడు. కిరీటంగా శంఖపాలుడ్ని.. గుళికుడ్ని కుడి చేయి గాజులాగా ధరిస్తాడు. తక్షకుడు వడ్డాణంకాగా.. వాసుకి జంధ్యంగా గరుత్మంతుడితో పాటు పూజలందుకుంటుంది. ఇక 9వ సర్పం ఆయన కంఠానికి అలంకారంగా చుట్టుకుని ఉంటుంది.

గరుత్మంతుడు హిందూ పురాణాలలో ఒక గరుడ పక్షి. శ్రీమహావిష్ణువు వాహనంగా గరుత్మంతుడు ప్రసిద్ధి. ఇతడు మహాబలశాలి. కాని వినయశీలి. ఆర్త్రత్రాణపరాయణుడైన శ్రీమహావిష్ణువు ఎక్కడికి వెళ్లాలనుకున్నా గరుత్మంతుదు సిద్ధంగాఉంటాడు. వెంటనే విష్ణువు గరుడారూఢుడై వెళ్లి ఆపన్నులను రక్షిస్తూ ఉంటాడు. సాధారణంగా విష్ణువు ఆలయాలలో మూలవిరాట్టు విగ్రహానికి అభిముఖంగా గరుత్మంతుని విగ్రహం ఉంటుంది. అయితే తిరునారయూర్ క్షేత్రంలో నాచ్చియార్ కోవెల్‌ ఉత్సవ విగ్రహంగా పూజలందుకోవడం విశేషం.. ఈ గరుత్మంతుడుని దర్శించిన భక్తుల కోరిన కోరికలు తీరుస్తాడని అర్చకులు చెప్పారు. ఉద్యోగం, వివాహం ఆలస్యమైన వారు గరుత్మంతుడుని పూజిస్తే వెంటనే ఫలితం దక్కుతుందని భక్తుల నమ్మకంమని తెలుస్తోంది.

Also Read: దేశ వ్యాప్తంగా సెంచరీకి చేరువలో పెట్రోలు ధర .. కేంద్రానికి లేఖ రాసిన ఇంధన శాఖ

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..