జోరు మీదనున్న వైష్ణవి చైతన్య.. వరుస ఫోటోషూట్స్ తో ఫుల్ వైరల్

Phani CH

31 March 2025

Credit: Instagram

తెలుగు అందం వైష్ణవి చైతన్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. 'బేబీ' సినిమాతో లైమ్‌లైట్‌లోకి వచ్చిన యంగ్ బ్యూటీ.

ఈ ముద్దుగుమ్మ  జనవరి 4, 1993న విజయవాడలో జన్మించిన.. చదువు అంతా హైదరాబాద్‌లోనే పూర్తి చేసింది.

చదువు పూర్తి చేసి షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సినీ ప్రస్థానం మొదలుపెట్టింది. మొదట డబ్‌స్మాష్, టిక్‌టాక్ వీడియోలతో యూత్‌లో క్రేజ్ సంపాదించింది.

'ది సాఫ్ట్‌వేర్ డెవలపర్', 'మిస్సమ్మ' వంటి షార్ట్ ఫిల్మ్స్‌తో యూత్ లో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. 

'టచ్ చేసి చూడు' సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. 'అల వైకుంఠపురములో', 'రంగ్‌దే', 'టక్ జగదీశ్' వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు చేసింది.

2023లో 'బేబీ' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ. ఆనంద్ దేవరకొండ సరసన నటించి, బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. ఈ చిత్రం రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది. 

'లవ్ మీ', 'జాక్' వంటి సినిమాలతో బిజీగా ఉంది. సిద్ధు జొన్నలగడ్డతో 'జాక్' ఏప్రిల్ 10, 2025న విడుదల కానుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మే షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.