నాలుగు వేదాలలో నర్మదా నది వైభవం.. ఈ నదిని కన్య నది అని ఎందుకు అంటారో తెలుసా..

|

Jun 11, 2024 | 7:31 PM

శివపార్వతుల కుమార్తెగా శివపార్వతుల చెమట ద్వారా ఉద్భవించిన కన్యగా నర్మదా నది. నర్మదా జయంతి రోజున నర్మదా నదిలో స్నానం చేయడం వల్ల ఇలాంటి పుణ్యం లభిస్తుంది. గంగామాతలాగే నర్మదామాత కూడా మోక్షదాయిని. నర్మదా నదిని మధ్యప్రదేశ్ "జీవనాధారం" అంటారు. ఇది మధ్య భారతదేశంలో ప్రవహించే నది. భారత ఉపఖండంలోని ఐదవ పొడవైన నది. గోదావరి నది, కృష్ణా నది తర్వాత దక్షిణ భారతదేశంలో ప్రవహించే మూడవ పొడవైన నది నర్మదా నది

నాలుగు వేదాలలో నర్మదా నది వైభవం.. ఈ నదిని కన్య నది అని ఎందుకు అంటారో తెలుసా..
Narmada River
Follow us on

హిందూమతంలో దేవుళ్ళను మాత్రమే కాదు నదులు, జంతువులు, పక్షులు, మొక్కలను కూడా దైవంగా భావించి పూజించే సంప్రదాయం ఉంది. హిందూ సంస్కృతిలో నదులకు చాలా ప్రాధాన్యత ఉంది. తల్లిగా భావించి నదులను పుజిస్తారు. గంగా లేదా ఇతర పవిత్ర నదులలో స్నానం చేస్తే అంత పుణ్యం లభిస్తుందని విశ్వాసం. హిందూ మతంలో నర్మదా నదికి చాలా ప్రాముఖ్యత ఉంది. గంగామాతలాగే నర్మదామాత కూడా మోక్షదాయిని. ఈ నదిలో స్నానం చేయడం గంగా నదిలో స్నానం చేయడంతో సమానం. ఈ నదిలోని ప్రతి గులకరాయి నర్మదేశ్వర్ శివయ్యగా పుజిస్తారు. మత విశ్వాసాల ప్రకారం నర్మదా నదికి ప్రదక్షిణలు చేయడం వలన పాపాల నుండి విముక్తి లభిస్తుంది. మరణానంతరం మోక్షం లభిస్తుంది. నర్మదాను రేవా, కున్వారీ నది అని కూడా అంటారు. నర్మదా నది వైభవం నాలుగు వేదాలలో వర్ణించబడింది. అయితే ఈ నదిని కన్య నది అని పిలుస్తారు.

మధ్యప్రదేశ్ గుండా ప్రవహించే నర్మదా నది

శివపార్వతుల కుమార్తెగా శివపార్వతుల చెమట ద్వారా ఉద్భవించిన కన్యగా నర్మదా నది. నర్మదా జయంతి రోజున నర్మదా నదిలో స్నానం చేయడం వల్ల ఇలాంటి పుణ్యం లభిస్తుంది. గంగామాతలాగే నర్మదామాత కూడా మోక్షదాయిని.

నర్మదా నది ప్రత్యేకత

నర్మదా నదిని మధ్యప్రదేశ్ “జీవనాధారం” అంటారు. ఇది మధ్య భారతదేశంలో ప్రవహించే నది. భారత ఉపఖండంలోని ఐదవ పొడవైన నది. గోదావరి నది, కృష్ణా నది తర్వాత దక్షిణ భారతదేశంలో ప్రవహించే మూడవ పొడవైన నది నర్మదా నది. మహాకాల్ పర్వతంలోని అమర్‌కంటక్ ప్రదేశంలో ఉద్భవించిన నర్మదా నది పశ్చిమం వైపు ప్రవహించి ఖంభాట్ గల్ఫ్‌లో కలుస్తుంది. నర్మదా నది మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో ప్రవహిస్తుంది. నేటికీ మధ్యప్రదేశ్‌లో నర్మదా నదికి ప్రత్యేక పూజలు చేస్తారు. భారతదేశంలో నర్మదా నదికి తల్లి హోదా కూడా ఇవ్వబడింది.

ఇవి కూడా చదవండి

ఏ విధంగా నర్మదా కన్యగా మారిందంటే

పురాణాల ప్రకారం నర్మదా మహల్ రాజు కుమార్తె. నర్మద చాలా అందమైన యువతి. గుణవంతురాలు, తల్లిదండ్రుల పట్ల విధేయత గల కుమార్తె. నర్మద వివాహం చేసుకునే వయసుకి వచ్చినప్పుడు మహల్ రాజు ఆమె వివాహాన్ని ప్రకటించింది. గుల్బకాలీ పువ్వును ఏ యువరాజు తీసుకువస్తాడో అతనితో యువరాణి వివాహం జరుగుతుందని ప్రకటించారు. దీని తర్వాత చాలా మంది యువరాజులు వచ్చారు. అయితే ఎవరూ మహల్ రాజు కోరిన కోర్కెను నెరవేర్చలేదు. అప్పుడు రాజకుమారుడు సోనభద్ర వచ్చి గుల్బక్వాలి పువ్వు తెచ్చి రాజు పెట్టిన కండిషన్ ను నెరవేర్చాడు. ఆ తర్వాత నర్మద, సోనభద్రల వివాహం నిశ్చయమైంది.

కన్యగా ఉంటానని ప్రమాణం

యువరాణి నర్మదకు ఒక స్నేహితురాలు ఉంది. ఆమె పేరు జూహిలా. ఆమె నర్మదాకు పనిమనిషి. నర్మదాకు తన వంశం లేదా కులం గురించి పట్టించుకోలేదు. పని మనిషిని స్నేహితురాలిగా చూసుకునేది. తన ఆలోచనలు పంచుకునేది. సోనభద్రతో నర్మ్డద వివాహం నిర్ణయం అయిన తర్వాత.. యువరాణి నర్మద ఒకసారి సోనభద్రను చూడాలని కోరుకుంది. పనిమనిషి జుహీలాతో తన కోరికను తెలియజేస్తూ యువరాజుకు సందేశం పంపింది. అయితే ఎంత సమయం గడిచినా స్నేహితురాలు రాకపోవడంతో.. యువరాణిలో ఆందోళన మొదలైంది. ఆమెను వెతకడానికి వెళ్ళింది. అప్పుడు నర్మద.. సోనభద్ర వద్దకు చేరుకుంది. అక్కడ తనకు కాబోయే భర్తతో పాటు ఉన్న స్నేహితురాలి జూహిలాను చూసింది. అది చూసి నర్మడకు విపరీతమైన కోపం వచ్చింది. దీని తర్వాత తాను పెళ్లి చేసుకోనని.. ఆమె జీవితాంతం కన్యగా బతుకుతానని ప్రతిజ్ఞ చేసి.. వ్యతిరేక దిశలో వెల్లిపోయింది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు