Dhari Devi Temple: ఓవైపు సైన్స్.. మరోవైపు విశ్వాసం.. ఉత్తరాఖండ్ విపత్తుకి ఆ దేవి విగ్రహం తరలింపునకు లింకేంటి?

|

Feb 14, 2021 | 8:42 PM

దేవభూమి ఉత్తరాఖండ్ సంరక్షక దేవతగా పరిగణించబడుతూ.. చార్ ధామ్ యొక్క రక్షకురాలిగా స్థానికుల తో గౌరవించబడుతున్న దేవి యొక్క ప్రాశస్యం ఏమిటి ..? ఆ దేవత విశిష్టత గురించి తెలుసుకుందాం..!

Dhari Devi Temple: ఓవైపు సైన్స్.. మరోవైపు విశ్వాసం.. ఉత్తరాఖండ్ విపత్తుకి ఆ దేవి విగ్రహం తరలింపునకు లింకేంటి?
Follow us on

Dhari Devi Temple: దేవభూమి ఉత్తరాఖండ్ సంరక్షక దేవతగా పరిగణించబడుతూ.. చార్ ధామ్ యొక్క రక్షకురాలిగా స్థానికుల తో గౌరవించబడుతున్న దేవి యొక్క ప్రాశస్యం ఏమిటి ..? ఆ దేవత విశిష్టత గురించి తెలుసుకుందాం..!

ఉత్తరాఖండ్ లోని గర్వాల్ శ్రీనగర్ ప్రాంతంలో అలకనందా నది ఒడ్డున ప్రాచీన కాలం నాటి ధారీదేవి ఆలయం ఉంది. గర్భగుడిలో అమ్మవారి సగభాగం మాత్రమే ఉంటుంది. ఈ గుడిలోని దేవి రూపం ఉదయం బాలికగా, మధ్యాహ్నం యువతిగా సాయంత్రం వృద్ధ స్త్రీగా మారుతూ పూజలందుకుంటుంది. ఈ ధారీదేవి యొక్క విగ్రహం క్రింది భాగం కాళీమఠ్ లో వున్నది. ధారీదేవి అత్యంత శక్తివంతురాలని.. అలకనందా నదీ ప్రవాహాన్ని ఈ దేవత నియంత్రిస్తుందని ఈ ప్రాంతవాసుల నమ్మకం. తమ నమ్మకం నిజమని అందుకు అనేక నిదర్శనాలున్నాయని స్థానికులు చెబుతారు. ఈ దేవి ఆశీసులతోనే అలకనంద ప్రశాంతంగా ప్రవహిస్తూ భక్తులకు ఆనందాన్ని కలిగిస్తుందని అంటారు. ధారీదేవి ఆలయం దాదాపు 8 దశాబ్దాల నుండి వున్నట్లుగా చాలామంది భావిస్తున్నారు.

నిజానికి ఆ ఆలయం కొన్ని వేల సంవత్సరాల నుండి ఉనికిలో వుందని తెలుస్తోంది. ఈ ఆలయం ప్రస్తావన మహాభారతంలోనూ ఉంది.. సిద్ధపీఠం పేరుతో భాగవతంలోనూ పేర్కొన్నారు. 108 శక్తి పీఠాల్లో ధారీదేవి ఆలయం కూడా ఒకటని దేవీ భాగవతంలో తెలిపారు..ఈ ప్రదేశంలో మహాకాళి యొక్క అవతారమైన ధారీదేవి వెలసిందని ఆ కారణం వలన ఈ ప్రాంతానికి అమోఘమైన మహత్యం ఏర్పడిందని మహాభాగవతంలో పేర్కొనబడినది. ఉగ్ర అంశం ఈ ధారీదేవి ఆదిశక్తి యొక్క ఉగ్రఅంశం అని చెబుతారు. ఈ శక్తిని భక్తితో కొలిచినవారికి ఎంత మేలు జరుగుతుందో ఈ శక్తిని ధిక్కరించిన వారికి అంత కీడు జరుగుతుందని కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు విశ్వసిస్తారు.

క్రీ.శ 1882లో కేదారీనాథ్ ప్రాంతాన్ని ఓ ముస్లిం రాజు పడగొట్టి మసీదు నిర్మించాలని ప్రయత్నించాడు.ఆ రాజు చేసిన అపచారంతో కొండ చరియలు విరిగిపడి కేదారనాథ్ ప్రాంతం నేలమట్టమైపోయింది. ఆ ప్రకృతి విపత్తు వేలాది మందిని బలితీసుకుంది. దేవి మహత్మ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆ ఇస్లాం రాజు తన ప్రయత్నాన్ని విరమించుకుని తోకముడిచాడు. అప్పటి నుంచి ఈ ఆలయం జోలికి ఎవరైనా వెళితే ధారీదేవి ఆగ్రహం చవిచూడక తప్పదనే బలమైన విశ్వాసం ఈ ప్రాంతంలో స్థిరపడింది. కాళీమఠ్‌లో నిజానికి అమ్మవారి మిగతా శరీర భాగం ఉండదు. ఆ స్థానంలో ఒక స్త్రీ యంత్రాన్ని పూజిస్తారు. ఆదిశంకరాచార్యులు స్థాపించిన ఈ స్త్రీ యంత్రం అమ్మవారి యోనికి ప్రతిరూపంగా భావిస్తారు. ఈపీఠానికి ఉత్తరదిశలో కేథారనాథ్ జ్యోతిర్లింగం ఉంది.

2013లో విద్యుత్ ఉత్పాదనకు అడ్డంగా వున్న ధారీదేవి విగ్రహాన్ని అక్కడి నుండి తొలిగించి ఆ విగ్రహాన్ని అక్కడికి పై ప్రదేశంలో వున్న ఒక పీఠం మీద ప్రతిష్టించినప్పుడు కాళీ మఠ క్షేత్రవిగ్రహానికి మరియు ధారీదేవి విగ్రహానికి మధ్య వున్న దిక్కులకు సంబంధం మారిపోయిందని అక్కడ అండ్ స్వామిజీ తెలిపారు. అందువలనే ధారీదేవి తన శాంతాన్ని కోల్పోయి ఆగ్రహాన్ని ప్రదర్శించిందని .. ధారీదేవీ విగ్రహాన్ని అక్కడినుండి తొలగించిన జరిగిన కొద్ది గంటలలోపే తన ఉగ్రరూపం చూపిందని చెప్పారు. మరుసటిరోజే కేదారనాథ్ ప్రాంతంలో దట్టమైన కారుమబ్బులు కమ్ముకుని ఇప్పటివరకు ఆ ప్రాంతంలో కనీవినీ ఎరుగని కుంభవృష్టి ప్రారంభమైంది. ఆ తర్వాత 2 గంల పాటు ఆ మహావర్షం కొనసాగింది. ఆకస్మిక వరదలు ఉత్తరాఖండ్ ని ముంచెత్తాయి.ఈ వరదల కారణంగా దాదాపు 5000మంది మానవులు అకారమరణం పొందారు. ఇటు గుడిని పడగొట్టడానికి అటు కుంభవృష్టి కారణంగా అలకనంద వరదకు గురిఅవటం కేవలం కాకతాళీయం అని భావించటం బుద్ధిహీనత అని ఉత్తరాఖండ్ కి చెందిన కృష్ణాజీ అనే ఒక సాధువు పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆ దేవి విగ్రాన్ని స్వష్టలానికి చేర్చాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.. ఓ వైపు సైన్స్.. మరోవైపు స్తానికుల నమ్మకాలు ఏది నిజమో కాలానికే తెలుసు ..

ధారి దేవి ఆలయం శ్రీనగర్ నుండి రుద్రప్రయాగ్ వెళ్లే మార్గంలో వస్తుంది. కాబట్టి మీరు కేదార్‌నాథ్ లేదా బద్రీనాథ్ వెళ్ళినప్పుడల్లా ఈ ఆలయాన్ని చూడవచ్చు. శ్రీనగర్ నుండి దాని దూరం పదిహేను కిలోమీటర్లు, రుద్రప్రయాగ్ నుండి ఇరవై కిలోమీటర్లు. ఈ స్థలం పేరు కలిసౌర్.

Also Read:

వసంత పంచమి విశిష్టత… ఆరోజున సరస్వతి దేవిని ఇలా పూజిస్తే మంచి ఫలితాలే..

జన్మ, నామ నక్షత్రంతో మీ శిచక్రం ప్రకారం అధిదేవత ఎవరో తెలుసా..! ఎలా గుర్తించాలంటే..!