Mysterious Temple: ఈ ఆలయం తాంత్రిక విశ్వవిద్యాలయం.. 64 గదుల్లో 64 శివలింగాలు, 64 యోగినీలు.. సాయంత్రం తర్వాత..

|

Jul 17, 2024 | 11:01 AM

చౌసత్ యోగిని ఆలయం క్రీ.శ. 1323లో నిర్మించబడిందని.. ఈ ఆలయాన్ని రాజపుత్ర రాజులు నిర్మించారని నమ్ముతారు. ఈ ఆలయంలో 64 గదులు ఉన్నాయి. ఈ 64 గదులలో 64 శివలింగాలను ప్రతిష్టించారు. ఈ ఆలయం వృత్తాకారంలో నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం పార్లమెంటు భవనాన్ని పోలి ఉంటుంది. ఆలయం మధ్యలో బహిరంగ మంటపం ఉంది. ఈ మంటపంలో శివలింగాన్ని కూడా ప్రతిష్టించారు.

Mysterious Temple: ఈ ఆలయం తాంత్రిక విశ్వవిద్యాలయం.. 64 గదుల్లో 64 శివలింగాలు, 64 యోగినీలు.. సాయంత్రం తర్వాత..
Chausath Yogini Temple
Follow us on

చౌసత్ యోగిని ఆలయం మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలోని మితావాలి గ్రామంలో ఉంది. ఈ ఆలయం పురాతనమైనది, రహస్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం తంత్ర సాధన, యోగిని ఆరాధనకు కేంద్రంగా పరిగణించబడుతుంది. భారతదేశంలో మొత్తం నాలుగు అరవై నాలుగు యోగిని ఆలయాలు ఉన్నాయి. వాటిలో రెండు ఒడిషాలో, రెండు మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి. ఈ నాలుగు దేవాలయాలలో మొరెనా జిల్లాలోని మితావాలి గ్రామంలోని దేవాలయం అత్యంత ప్రముఖమైనది. పురాతనమైనది. ఈ ఆలయం ముఖ్యంగా తంత్ర మంత్ర జ్ఞానానికి ప్రసిద్ధి చెందింది.

ఈ ఆలయాన్ని తాంత్రిక విశ్వవిద్యాలయం అంటారు

చౌసత్ యోగిని ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రముఖ తాంత్రిక ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. చౌసత్ యోగిని ఆలయం తాంత్రిక సాధన, యోగిని ఆరాధనకు ముఖ్యమైన కేంద్రంగా పరిగణించబడుతుంది. ఇక్కడ భక్తులు తంత్ర విద్య కోసం ధ్యానం చేసేవారట. అంతేకాదు యోగిని ఆరాధన ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పొందేవారని స్థల పురాణం. తంత్ర సాధనలో ఈ ఆలయానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాన్ని తాంత్రిక విశ్వవిద్యాలయం అని కూడా అంటారు. పూర్వం తంత్ర-మంత్రాలు నేర్చుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి వచ్చేవారని స్థానికులు చెబుతారు.

ఇవి కూడా చదవండి

ఆలయంలోని 64 గదుల్లో 64 శివలింగాలు, 64 యోగినిలు

చౌసత్ యోగిని ఆలయం క్రీ.శ. 1323లో నిర్మించబడిందని.. ఈ ఆలయాన్ని రాజపుత్ర రాజులు నిర్మించారని నమ్ముతారు. ఈ ఆలయంలో 64 గదులు ఉన్నాయి. ఈ 64 గదులలో 64 శివలింగాలను ప్రతిష్టించారు. ఈ ఆలయం వృత్తాకారంలో నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం పార్లమెంటు భవనాన్ని పోలి ఉంటుంది. ఆలయం మధ్యలో బహిరంగ మంటపం ఉంది. ఈ మంటపంలో శివలింగాన్ని కూడా ప్రతిష్టించారు. ఈ మంటపం చుట్టూ 64 గదులు నిర్మించారు. ఇక్కడ ప్రతి గదిలో శివలింగంతో పాటు యోగిని విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారని ప్రతీతి. అంటే ఇక్కడ 64 శివలింగాలతో పాటు 64 యోగిని విగ్రహాలను కూడా ప్రతిష్టించారు. వీటిలో కొన్ని విగ్రహాలు ఇప్పుడు చోరీకి గురయ్యాయి. తంత్ర సాధన కోసం 64 మంది యోగినిల విగ్రహాలు ముఖ్యమైనవని నమ్ముతారు.

ఇక్కడ సాధన చేయడం ద్వారా అద్భుతమైన శక్తులను పొందవచ్చు.

చౌసత్ యోగిని ఆలయంలో ఒక ప్రత్యేక రకమైన ఆధ్యాత్మిక శక్తి ఉందని నమ్మకం. ఈ ఆధ్యాత్మిక శక్తి సాధకులకు ధ్యానం, సాధనలో సహాయపడుతుంది. ఇక్కడి స్థానిక ప్రజల ప్రకారం ఈ ఆలయం ఇప్పటికీ శివుని తంత్ర సాధన కవచంతో కప్పబడి ఉంది. రాత్రి సమయంలో ఈ ఆలయంలో లేదా సమీపంలో ఉండటానికి అనుమతి లేదు. ఎవరైనా నిబంధనను అతిక్రమించి ఈ ఆలయం వద్ద సాయంత్రం దాటిన తర్వాత ఉంటేవ వారు తమ జీవితాన్ని కోల్పోవలసి  ఉంటుందని చెబుతున్నారు. దీని కారణం ఈ ఆలయంలో శివుని యోగినిలు రాత్రి సమయంలో మేల్కొంటారని నమ్మకం. ఈ ఆలయంలో ప్రత్యేక తాంత్రిక విద్యలను అభ్యసించే సమయంలో మంత్రాల పఠనం, యంత్రాల స్థాపన, హవనం నిర్వహించేవారు. యోగినిలను ప్రత్యేక మంత్రాలతో పూజించారు. ఈ సాధనల ద్వారా భక్తుడు అద్భుతమైన శక్తులను పొందేవారని చెబుతారు.

ఈ ఆలయం కాళీమాతకి సంబంధించినదని నమ్మకం
హిందూ మత విశ్వాసాల ప్రకారం, ఈ ఆలయం కాళీ మాతకు సంబంధించినది. ఇక్కడ స్థాపించబడిన చౌసత్ యోగిని కాళీకా దేవి అవతారం. పురాణ మత గ్రంథాల ప్రకారం ఘోర అనే రాక్షసుడిని సంహరించడానికి కాళికా దేవి యోగిని అవతారం దాల్చినట్లు తెలుస్తోంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు