Moral Story In Ramayana: భారత దేశం ఆధ్యాత్మిక ప్రదేశం. వేద భూమి.. రామాయణం ఆచంద్రతారార్కం. ఆచరణీయమైన గ్రంథం.. అవును మనిషి తన నడవడికతో దేవుడిగా పూజింపబడతాడు అని తెలియజెప్పిన సజీవ సాక్ష్యం రామాయణం. ఇందులోని రామ కథ మానవ హృదయ వీణా తంత్రులను మీటి . కరుణ, విషాదం, ఆనందం, ఆరాధన, పారవశ్యం, శరణాగతి వంటి రసావేశాలు కలిగించి. . జంతుత్వం, మానవత్వంలో నిగూఢంగా ఉన్న వ్యత్యాసాన్ని వికసింప జేస్తుంది. మానవత్వం ఎలా ఉండాలో.. రామాయణం అడుగడుగునా వివరిస్తుంది. మానవజాతి మనుగడ కోసం.. సుఖ సంతోషాల కోసం ఎలా జీవించాలో తెలియజేస్తుంది. ఒకరినొకరు దోచుకోవడం కాదు.. ఆనందంగా పంచుకోవాలని వివరిస్తుంది.
శ్రీరాముడికి పట్టాభిషేకం సమయంలో దశరథుడిని కైకేయి వరం కోరుతూ.. పాలన భరతుడికి ఇవ్వమని కోరుతుంది. దీంతో శ్రీరాముడు తల్లి వంటి కైకేయితో మాట్లాడుతూ.. ఇందులో ఇంతగా ఆలోచించాల్సిన పని ఏముంది.. రామా తమ్ముడికి రాజ్య పాలనా అప్పగించు.. నువ్వు అడవికి వేళ్ళు అని ఒక్కమాట చెబితే చాలదా.. సంతోషంగా వెళ్తాను అని అన్నాడు.
ఇక వనవాసంలో ఉన్న శ్రీరాముడిని వెదుకుతూ భరతుడు తన సైన్యంతో చిత్ర కుటం వచ్చాడు. ఒక్కసారిగా వేలాది మంది సైన్యం రావడంతో అడవిలోని జంతువులు, పక్షులు చెల్లాచెదురు అయ్యాయి. ఇది గమనించిన రాముడు .. ఎవరైనా వేట కోసం అడవికి వచ్చారా.. ఏదైనా యాత్ర జరుగుతుందా ఒక్కసారి తెలుసుకో అంటూ తమ్ముడి లక్ష్మణుడికి చెప్పాడు. అప్పుడు లక్ష్మణుడు సమీపంలోని ఎత్తైన చెట్టు ఎక్కి చూశాడు.. భరతుడు తన సైన్యంతో రావడం లక్ష్మణుడికి కనిపించింది. అయితే ఈ విషయాన్నీ తప్పుగా అర్ధం చేసుకున్న లక్ష్మణుడు వనవాసం ముగిసిన అనంతరం రాజ్యాన్ని అప్పగించడం ఇష్టం లేక భరతుడు తమపైకి దండెత్తి వస్తున్నాడని భావించాడు. వెంటనే అన్న రాముడిని ధనస్సును సిద్దం చేసుకోమని.. సీతమ్మను దాచిపెట్టు అని కేకలు వేశాడు.
తమ్ముడు భయం విన్న రాముడు భయం ఎందుకు లక్ష్మణా.. ఒక వస్తువుపై అత్యాశ పెంచుకున్నప్పుడు.. దానిని దూరం చేస్తారేమోనని భయపడాలి.. అసలు ఏ విషయంపై వస్తువుపై అత్యాశ లేనప్పుడు ఇక భయం ఎక్కడ ఉంటుంది.. అంటూ లక్ష్మణుడికి చెప్పాడు. అంతేకాదు భరతుని గురించి నాకు తెలుసు అన్నాడు రాముడు..
భరతుడికి కనుక రాజ్యంపై కాంక్ష ఉందని నువ్వు అనుకుంటే.. తనని కూడా నాతోపాటు వనవాసానికి రమ్మంటా… నువ్వు వెళ్లి రాజ్యాన్ని పాలించి అని చెప్పాడు లక్ష్మణుడికి శ్రీరాముడు.. దీంతో అన్న మాటలను విన్న తమ్ముడు తన ఆలోచనలకు కొంచెం సిగ్గుతో తలవంచుకున్నాడు. భరతుడి గురించి తప్పుగా ఆలోచించినందుకు పశ్చాత్తాపడ్డాడు. నిజానికి ఇక్కడ లక్ష్మణుడికి రాజ్య పాలనపై ఆశలేదు.. తన అన్న రాముడిపై ఉన్న ప్రేమ మాత్రమే ఇలా ఆలోచించేలా చేసింది. రామాయణం ఎదుటివారిని ఎలా ప్రేమించాలో తెలిపింది.. కనుకనే ‘ఇతిహాస శ్రేష్టం’ గా ఖ్యాతిగాంచింది.
Also Read: Horoscope Today: ఈ రోజు ఏ రాశివారికి అనుకూలంగా ఉంది.. ఏ రాశివారికి పనులలో జాప్యం జరుగుతుంది… తెలుసుకుందాం