AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా..? అయితే, ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకోవడం వల్ల అదృష్టం, సంపద, సానుకూల శక్తి పెరుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ మొక్కను ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈశాన్య దిశలో మనీ ప్లాంట్ ఉంచితే వాస్తు దోషాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు రావచ్చని సూచిస్తున్నారు.

మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా..? అయితే, ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
Money Plant Vastu
Shaik Madar Saheb
|

Updated on: May 25, 2026 | 11:17 AM

Share

మనలో చాలామంది ఇళ్లలో మనీ ప్లాంట్‌ను పెంచుకోవడం సాధారణం. ఈ మొక్క ఆర్థిక ఇబ్బందులను తొలగించి, అదృష్టాన్ని చేకూరుస్తుందని బలమైన నమ్మకం. వాస్తు నిపుణులు కూడా మనీ ప్లాంట్‌ను పెంచడం శ్రేయస్కరమని సూచిస్తారు. ఇంటిలో మనీ ప్లాంట్ ఉండటం వల్ల అదృష్టం కలగడమే కాకుండా, సానుకూల శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా, ఇది ఇంటిలోని గాలిని సైతం శుద్ధి చేస్తుంది. మనీ ప్లాంట్ సున్నితమైన తీగలతో చాలా వేగంగా విస్తరిస్తుంది. దీనిని కుండీలలో లేదా సీసాలలో సులభంగా పెంచుకోవచ్చు.. అయితే.. దీనికి ప్రతిరోజూ నీటిని అందించాలి.

అయితే, వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మనీ ప్లాంట్‌ను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెంచకూడదు. సరైన ప్రదేశంలో ఉంచినప్పుడు మాత్రమే ఆశించిన శుభ ఫలితాలు కలుగుతాయి. మొక్క ఎల్లప్పుడూ ఆకుపచ్చగా, నిగనిగలాడుతూ ఉండటం ముఖ్యం. ఏవైనా ఆకులు ఎండినా లేదా పసుపు రంగులోకి మారినా వాటిని వెంటనే తొలగించాలి. అలా చేయని పక్షంలో వాస్తు దోషం ఏర్పడుతుందని చెబుతారు.

మనీ ప్లాంట్‌ను ఇంటి ఈశాన్య మూలలో ఉంచకూడదని వాస్తు శాస్త్రం సూచిస్తుంది. ఈ దిశలో ఉంచితే అనారోగ్య సమస్యలు, ధననష్టం సంభవించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి విరుద్ధంగా, మనీ ప్లాంట్‌ను ఆగ్నేయ దిశలో (దక్షిణ-తూర్పు) ఉంచడం వలన సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. ఆగ్నేయ మూల వినాయకునికి ఆధిస్థానం కావడం వలన అక్కడ పెట్టడం వలన ఇంట్లో శాంతి, ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇది సమస్యలను దూరం చేసి, సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది.. ఇంకా, దురదృష్టాన్ని తొలగించి మంచి అదృష్టం, సంపదలను అందిస్తుంది.

మనీ ప్లాంట్ కేవలం వాస్తుపరమైన లాభాలనే కాకుండా, ఆరోగ్యపరంగా కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది గాలిని శుద్ధి చేసి, ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచుతుంది. తద్వారా ఆందోళన, ఒత్తిడిని తగ్గించి, మంచి నిద్ర పట్టడానికి సహాయపడుతుంది. ఇంటి బయట కన్నా లోపల పెంచినప్పుడే మనీ ప్లాంట్ ఎక్కువ ప్రయోజనాలను చేకూరుస్తుంది. గాలిలో ఉండే బెంజీన్, ఫార్మాల్డిహైడ్, కార్బన్ మోనాక్సైడ్, జిలీన్ వంటి హానికరమైన కాలుష్య కారకాలను తొలగించడంలో ఇది అద్భుతంగా తోడ్పడుతుంది.

అంతేకాకుండా, మనీ ప్లాంట్ కంప్యూటర్, లాప్‌టాప్, మొబైల్ ఫోన్‌ల నుండి వెలువడే రేడియేషన్‌ను తగ్గించి, యాంటీ-రేడియేటర్‌గా పనిచేస్తుంది. ఇది పని ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడి, కంప్యూటర్ స్క్రీన్‌పై నిరంతరం చూడటం వల్ల కలిగే ప్రభావాల నుండి కళ్ళను రక్షిస్తుంది. ఇంట్లోని ఎలక్ట్రికల్ పరికరాల నుండి వచ్చే హానికరమైన రేడియేషన్‌ను కూడా తగ్గిస్తుంది. మనీ ప్లాంట్ దాని పేరుకు తగ్గట్టుగానే డబ్బు, సంపదను ఇంటికి తీసుకురావడమే కాకుండా, ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది.

అందుకే మనీ ప్లాంట్ అదృష్టాన్ని ఇచ్చే మొక్కలలో ఐదవ స్థానంలో నిలిచింది. వ్యక్తిగతంగాను, వృత్తిపరంగాను ఈ మొక్కను పెంచుకోవడం చాలా సహాయకారిగా ఉంటుంది. మనీ ప్లాంట్ గుండె ఆకారంలో ఉన్న ఆకుల వల్ల దీర్ఘకాలిక స్నేహాన్ని పెంచుతుందని నమ్ముతారు. అందుకే చాలామంది దీనిని స్నేహితులకు, బంధువులకు బహుమతిగా ఇస్తుంటారు. ముఖ్యంగా, మనీ ప్లాంట్‌ను వాస్తు రీత్యా సరైన ప్రదేశంలో, ముఖ్యంగా ఈశాన్య దిక్కులో కాకుండా, జాగ్రత్తగా ఉంచడం చాలా ముఖ్యం..

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టీమిండియాలోకి తొలిసారి ఎంట్రీ ఇచ్చిన యంగ్ స్టార్!
టీమిండియాలోకి తొలిసారి ఎంట్రీ ఇచ్చిన యంగ్ స్టార్!
తండ్రి జీవించి ఉండగానే ఆస్తిలో కూతురు వాటా అడగొచ్చా..?
తండ్రి జీవించి ఉండగానే ఆస్తిలో కూతురు వాటా అడగొచ్చా..?
రష్యాపై అమెరికా కొత్త ఆంక్షలు.. భారత్‌పై 100% టారిఫ్ ముప్పు!
రష్యాపై అమెరికా కొత్త ఆంక్షలు.. భారత్‌పై 100% టారిఫ్ ముప్పు!
తెలుగులో ఆ రెండు సినిమాలు నా ఆల్‌టైమ్ ఫేవరెట్స్: జేసన్ సంజయ్
తెలుగులో ఆ రెండు సినిమాలు నా ఆల్‌టైమ్ ఫేవరెట్స్: జేసన్ సంజయ్
ఈ రోజు తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
ఈ రోజు తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
ఆఖరి టీ20లోనూ వైభవ్‌కి నిరాశేనా.. శాంసన్ మాటలతో ఫుల్ క్లారిటీ..?
ఆఖరి టీ20లోనూ వైభవ్‌కి నిరాశేనా.. శాంసన్ మాటలతో ఫుల్ క్లారిటీ..?
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఒకేసారి రూ.25 లక్షలు..!
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఒకేసారి రూ.25 లక్షలు..!
రైల్వే ఉద్యోగార్థులకు అలర్ట్.. రైల్వే JE పరీక్ష తేదీలు వచ్చేశాయ్!
రైల్వే ఉద్యోగార్థులకు అలర్ట్.. రైల్వే JE పరీక్ష తేదీలు వచ్చేశాయ్!
నాని 'ది ప్యారడైజ్' సెన్సార్ రివ్యూ వచ్చేసింది..
నాని 'ది ప్యారడైజ్' సెన్సార్ రివ్యూ వచ్చేసింది..
TG SET 2026 పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసిందోచ్‌.. ఇంతకీ ఎప్పుడంటే?
TG SET 2026 పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసిందోచ్‌.. ఇంతకీ ఎప్పుడంటే?