నుదుట బొట్టు పెట్టుకుంటే ఎన్ని లాభాలో తెలుసా..? ఆడవాళ్లే కాదు.. మగవాళ్లకు కూడా..!

|

Apr 26, 2023 | 6:30 PM

రోజుకు చాలా సార్లు బొట్టు ప్రదేశంలో ప్రెస్‌ చేయటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందగలుగుతారు. అందువల్ల బొట్టు పెట్టుకోవటం కేవలం మహిళలకే కాదు, మగవారికి కూడా ప్రయోజనకరం. పురుషులు బిందీ ధరించనప్పటికీ వారు ప్రతిరోజూ ఆజ్ఞ చక్రంపై కుంకుమ తిలకం పెట్టుకోవచ్చు.

నుదుట బొట్టు పెట్టుకుంటే ఎన్ని లాభాలో తెలుసా..? ఆడవాళ్లే కాదు.. మగవాళ్లకు కూడా..!
Wearing Bindi
Follow us on

భారతీయ మహిళలు శతాబ్దాలుగా తమ నుదిటిపై సింధూరం అంటే బొట్టు పెట్టుకోవటం ఆనవాయితీ. అయితే, చాలా మంది దీనిని ఫ్యాషన్‌లో భాగంగా భావిస్తారు. కానీ బొట్టు పెట్టుకోవటం వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయని మీకు తెలుసా..? నుదిటిపై బొట్టుపెట్టుకోవటం వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. అంతేకాదు, మగవారికి కూడా బొట్టు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. నిపుణులు అభిప్రాయం ప్రకారం స్త్రీలు బొట్టు పెట్టుకునే ప్రదేశాన్ని అజ్ఞా చక్రం అంటారు. ఆజ్ఞా చక్రం మానవ శరీరం ఆరవ, అత్యంత శక్తివంతమైన చక్రంగా పరిగణిస్తారు. ఈ మూలకాన్ని రోజులో చాలాసార్లు నొక్కడం వల్ల ఆరోగ్యానికి, చర్మానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మనం సూచించినప్పుడు ఆ స్థలం ప్రెస్ అవుతుంది.

ప్రతిరోజూ బొట్టుపెట్టుకోవటం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఆయుర్వేద నిపుణులు ఒకరు సోషల్ మీడియా వేదికగా ప్రజలకు వివరించారు. ప్రతిరోజూ బొట్టు పెట్టుకోవటం వల్ల నుదిటి మధ్య భాగాన్ని నొక్కుతాము. ఇది తల, కళ్ళు, మెదడు, పీనియల్ గ్రంథి, పిట్యూటరీ గ్రంధిని ప్రేరేపితం చేస్తుంది. రోజుకు చాలా సార్లు బొట్టు ప్రదేశంలో ప్రెస్‌ చేయటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందగలుగుతారు. అందువల్ల బొట్టు పెట్టుకోవటం కేవలం మహిళలకే కాదు, మగవారికి కూడా ప్రయోజనకరం. పురుషులు బిందీ ధరించనప్పటికీ వారు ప్రతిరోజూ ఆజ్ఞ చక్రంపై కుంకుమ తిలకం పెట్టుకోవచ్చు.

బొట్టు పెట్టుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలు..

నొసటి మీద వలయాకారంలో బొట్టు పెట్టుకోవడం వల్ల అక్కడ ఉన్న నాడులన్నీ చక్కగా పనిచేసి ఏకాగ్రతను పెరిగేలా చేస్తాయి. బొట్టు పెట్టుకుంటే మానసికంగానూ చాలా ఉత్సాహంగా ఉంటుంది. తలనొప్పి తగ్గిపోతుంది. సైనస్ సమస్య తొలగిపోతుంది. దృష్టి, ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మం యవ్వనంగా ఉంటుంది. డిప్రెషన్ నుండి దూరంగా ఉంచుతుంది. వినికిడి మెరుగ్గా ఉంటుంది. జ్ఞాపకశక్తి బాగుంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది. మైగ్రేన్‌ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..