తెలుగు రాష్ట్రాలలో ఇది ప్రసిద్ధ శైవ క్షేత్రం. హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ నల్లమల అడవులలో కొండగుట్టలమధ్య గల శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయం పవిత్ర క్షేత్రం. మెలికలు తిరుగుతూ, లోయలు దాటుతూ దట్టమైన అరణ్యాల మధ్య భక్తజనులను బ్రోచేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి.
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ శైలం. ఈ క్షేత్రంలో స్వామివారు మల్లికార్జునుడిగా… అమ్మవారు భ్రమరంభ దేవిగా భక్తులతో పూజలను అందుకుంటున్నారు. దట్టమైన నల్లమల అడవుల్లో ఉన్న ఈ క్షేత్రానికి వెళ్ళడానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. నల్లమల అడవులలో కొండ గుట్టల మధ్య గల శ్రీ గిరిని అధిరోహించి స్వామివారు, అమ్మవార్లను దర్శించుకోవాలంటే దట్టమైన నల్లమల అరణ్యం మధ్య లోయలు, మెలికలు తిరుగుతూ ఉండే రహదారిమీద ప్రయాణించాల్సిందే. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా హరహర మహదేవ శంభో శంకరా అంటూ మల్లన్న దర్శనం కోసం వెళ్లే భక్తులకు గుడ్ న్యు చెప్పారు అటవీ శాఖ అధికారులు.
శ్రీశైల మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాత్రి సమయంలో కూడా అడవిలో వాహనాలు ప్రయాణించడానికి అనుమతిని ఇస్తున్నట్లు డోర్నాల అటవీ శాఖ అధికారి తెలిపారు. మార్చి 1 వ తేదీ నుంచి 11వ తేదీ వరకు భక్తులు రాత్రి వేళల్లో ప్రయాణించి శ్రీశైలం క్షేత్రాన్ని చేరుకోవచ్చు అని చెప్పారు. మహా శివరాత్రి పర్వదినంతో పాటు.. మల్లన్న బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు వెళ్లే భక్తులకు ఈ సడలింపు ఎంతో ఊరటనిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏకైక ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీ శైలం. పెద్దదోర్నాల శ్రీశైలం నల్లమల రహదారి పులుల అభయారణ్యం పరిధిలో ఉంది. కనుక ఈ క్షేత్రానికి వెళ్లే భక్తులకు రాకపోకల విషయంలో కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ అటవీ ప్రాంతంలో ఉన్న ఈ రోడ్డుని క్లోజ్ చేస్తారు. రహదారిపై వాహనాల రాకపోకలను పెద్దదోర్నాల అటవీ శాఖ చెక్‌పోస్ట్ వద్దే నిలిపివేస్తారు. అయితే బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా రాత్రి కూడా ఈ రహదారిపై ప్రయాణించే అవకాశాన్ని కల్పించారు. ఈ నిబంధనకు తాత్కాలిక సడలింపు ఇచ్చారు. అయితే వాహనదారులు తప్పనిసరిగా ప్రయాణించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.. వన్యప్రాణులకు ఎటువంటి హాని కలగకుండా, నిదానంగా వాహనాలను నడపాలన్నారు. ఎవరినా సరే ఈ నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..