makar sankranti 2025: మకర సంక్రాంతి రోజున పొరపాటున కూడా ఈ వస్తువులు దానం చేయవద్దు.. ఎందుకంటే..

|

Jan 08, 2025 | 4:47 PM

మకర సంక్రాంతి రోజున స్నానం చేసి దానం చేసే సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. మకర సంక్రాంతి రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం, దానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. ఈ రోజు చేసే దానాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే మకర సంక్రాంతి రోజున పొరపాటున కూడా దానం చేయకూడని కొన్ని వస్తువులున్నాయని మీకు తెలుసా.. మకర సంక్రాంతి రోజున వీటిని దానం చేస్తే ఎటువంటి అశుభ ఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాం..

makar sankranti 2025: మకర సంక్రాంతి రోజున పొరపాటున కూడా ఈ వస్తువులు దానం చేయవద్దు.. ఎందుకంటే..
Makara Sankranti 2025
Follow us on

మకర సంక్రాంతి హిందూ మతంలో ప్రధాన పండుగ. మకర సంక్రాంతి కొత్త సంవత్సరంలో జరుపుకునే హిందూ మతానికి సంబంధించిన మొదటి పండుగ. సూర్య భగవానుడు మకరరాశిలోకి ప్రవేశించిన తర్వాత మకర సంక్రాంతి జరుపుకుంటారు. సూర్యభగవానుడిని మకర సంక్రాంతి రోజున పూజిస్తారు. ఈ రోజు ఆయనకు నువ్వుల లడ్డూలను నైవేద్యంగా సమర్పిస్తారు. పంచాంగం ప్రకారం ఈ ఏడాది మకర సంక్రాంతిని జనవరి 14 జరుపుకోనున్నారు. ఈ రోజు సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. జనవరి 14వ తేదీ ఉదయం 9.03 గంటలకు మకర రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. మకర సంక్రాంతి రోజున పుణ్యనదులలో స్నానాలు చేసి, దానాలు చేస్తారు. ఈ రోజున పవిత్ర నదులలో స్నానం చేసిన తర్వాత దానం చేయడం వల్ల పుణ్యఫలితాలు లభిస్తాయి. అయితే ఈ రోజు పొరపాటున కూడా దానం చేయకూడనివి కొన్ని ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం.

నలుపు రంగు బట్టలు

హిందూ మతంలో నలుపు రంగు శ్రేయస్కరం కాదని నమ్ముతారు. నలుపు రంగు ప్రతికూల శక్తి ప్రవాహానికి కారణమవుతుందని నమ్ముతారు. మకర సంక్రాంతి రోజున నలుపు రంగు దుస్తులు దానం చేయడం వల్ల అశుభ ఫలితాలు వస్తాయి. నలుపు రంగు బట్టలు దానం చేయడం వల్ల గ్రహాల అశుభాలను కలుగజేస్తాయని నమ్మకం. కనుక మకర సంక్రాంతి రోజున పొరపాటున కూడా నలుపు రంగు బట్టలు దానం చేయవద్దు. అయితే మకర సంక్రాంతి రోజున సుపు రంగు బట్టలు దానం చేయడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది.

నూనె

మకర సంక్రాంతి రోజు పొరపాటున కూడా నూనె దానం చేయకూడదు. ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. ఈ రోజున నూనెను దానం చేస్తే ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. మకర సంక్రాంతి రోజున నూనెను దానం చేయడం వల్ల మనిషి చేసే పనులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ కారణంగా మకర సంక్రాంతి రోజున నూనెను దానం చేయవద్దు

ఇవి కూడా చదవండి

కత్తులు, కత్తెర

మకర సంక్రాంతి రోజున పదునైన వస్తువులను దానం చేయడం శ్రేయస్కరం కాదు. అటువంటి పరిస్థితిలో ఈ రోజున కత్తులు, కత్తెరలు లేదా కొన్ని రకాల వస్తువులు దానం చేయవద్దు. పదునైన వస్తువులను దానం చేయడం వల్ల ప్రతికూల శక్తి ప్రవాహం పెరుగుతుందని హిందూ మత గ్రంధాలలో పేర్కొన్నారు. ఇంట్లో గొడవలు రావచ్చు. అటువంటి పరిస్థితిలో మకర సంక్రాంతి రోజున పదునైన వస్తువులను దానం చేయవద్దు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.