హిందువుల పండగల్లో అతిపెద్ద పండుగ మకర సంక్రాంతి. మూడు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు అత్యంత ఘనంగా జరుపుకునే పండగను జనవరి 2023లో జరుపుకోవడానికి అందరూ రెడీ అవుతున్నారు. మకర సంక్రాంతి పండుగ హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. వేద జ్యోతిషశాస్త్రంలో సూర్యుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సూర్యుడు ప్రతి నెలా రాశిని మార్చుకుంటాడు. సూర్యుడు మకరరాశిలో సంచరించడాన్ని మకర సంక్రాంతి అంటారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో మకర సంక్రాంతిని అనేక పేర్లతో పిలుస్తారు. లోహ్రీ, బిహు, పొంగల్, సంక్రాంతి గా రకరకాల పేర్లతో జరుపుకుంటారు. మకర సంక్రాంతి నాడు స్నానం, దానం, పూజలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ఒక నెల పాటు కొనసాగే ఖర్మ కాలం ముగిసి.. వివాహాది శుభ కార్యాలు మళ్లీ ప్రారంభమవుతాయి.
మకర సంక్రాంతి ప్రాముఖ్యత
సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు. మత విశ్వాసాల ప్రకారం.. మకర సంక్రాంతి రోజున దేవతలు భూమిపైకి వస్తారని విశ్వాసం. మకర సంక్రాంతి పండుగ రోజున నువ్వులు, బెల్లం, బియ్యం, బట్టలు దానం చేయడం గంగాస్నానం చేసి సూర్యభగవానుని ఆరాధించడం ఉత్తమమని హిందువుల నమ్మకం. నువ్వులను దానం చేయడం ఈ రోజున ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. మకర సంక్రాంతి రోజున సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజు నుండి రాత్రి సమయం తగ్గడం మొదలవుతుంది.. పగల సమయం ఎక్కువ అవుతుంది. ఉత్తరాయణంలో శరీరాన్ని విడిచిపెట్టడం వల్ల మోక్షం లభిస్తుందని విశ్వాసం. భీష్మ పితామహుడు సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో తన ప్రాణాలను అర్పించాడు. మకర సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి పని సామర్థ్యం పెరుగుతుంది. మకర సంక్రాంతి రోజున చేసిన దానం ఆ వ్యక్తికీ ప్రతి ఫల రూపంలో వందరెట్లు తిరిగి వస్తుంది. మకర సంక్రాంతి రోజున సూర్యదేవుడు తన కుమారుడైన శనీశ్వరుడి రాశి.. మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.
2023 మకర సంక్రాంతి శుభ సమయం
హిందూ క్యాలెండర్ ప్రకారం.. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది సూర్యుడు జనవరి 14వ తేదీ రాత్రి 08.20 నిమిషాలకు మకర రాశిలోకి ప్రవేశించి ధనుస్సు రాశిలో తన ప్రయాణాన్ని నిలిపివేస్తాడు. 2023వ సంవత్సరంలో మకర సంక్రాంతి శుభ ముహూర్తం జనవరి 15న ఉదయం 06.48 గంటలకు ప్రారంభమై సాయంత్రం 05.41 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో, ఈసారి మకర సంక్రాంతిని ఉదయ తిథి ప్రకారం జనవరి 15 న జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి లోని మొదటి పండగ భోగి జనవరి 14వ తేదీన.. మూడో రోజున కనుమ పండగను జనవరి 16వ తేదీన జరుపుకోనున్నారు.
మకర సంక్రాంతి పూజా విధానం
మకర సంక్రాంతి రోజున సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. దక్షిణాయనం రాక్షసుల రోజు అయితే ఉత్తరాయణం దేవతల రోజు. మకర సంక్రాంతి నాడు సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ రోజున గంగానదిలో స్నానం చేసి.. సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పిస్తారు. దీనితో పాటు సూర్య భగవానుడికి సంబంధించిన మంత్రాలు జపిస్తారు. మకర సంక్రాంతి రోజున గంగాస్నానం చేయలేకపోయిన వారు తాము స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కల గంగాజలం కలిపి స్నానం చేయాలి. ఈ రోజు నువ్వులను దానం చేయాలి. అంతే కాకుండా ఈ రోజు పరమాన్నం చేయడం తినడం పెద్దలను స్మరించుకోవడం సాంప్రదాయంగా వస్తోంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)