Mahashivratri 2024: శివుడిని పూజించి వరం పొందిన విష్ణువు.. శివ సహస్ర నామం పఠించడం వలన విశేష ఫలితాలు మీ సొంతం

శివుని సహస్రనామాన్ని పఠించడం వలన జీవితంలోని అన్ని కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. శివుడిని స్వయంభువుడి అని కూడా పిలుస్తారు. అంటే అతను మానవ శరీరం నుంచి జన్మ తీసుకోలేదు. శివుని ఉనికి ఆది అంతం లేనిదని విశ్వాసం. ప్రపంచంలో అణువణువులో శివుడు నిండి ఉంటాడని.. అందుకే అతడిని ఆది దేవుడు అని పిలుస్తారు. ఎవరైతే తెల్లవారుజామున నిద్రలేచి భక్తితో పరమశివుని సహస్ర  నామాన్ని జపిస్తారో వారికి సకల సిద్ధి కలుగుతుంది

Mahashivratri 2024: శివుడిని పూజించి వరం పొందిన విష్ణువు.. శివ సహస్ర నామం పఠించడం వలన విశేష ఫలితాలు మీ సొంతం
Chant Sahasranama Of Lord Shiva

Updated on: Feb 28, 2024 | 11:20 AM

హిందూ మతంలో శివుడు జలంతో అభిషేకించినా చాలు సంతోషించి భక్తులను అనుగ్రహిస్తాడని నమ్మకం. అదేవిధంగా ఎవరైతే శివుని ఆశీర్వాదం పొందుతారో వారి జీవితంలో కష్టాలు, భయాల నుండి విముక్తి లభిస్తుంది. శివ పురాణంలో పరమశివుని సహస్రనామానికి గల విశేష ప్రాధాన్యత, దాని వలన కలిగే ప్రయోజనకరమైన ఫలితాలు వివరించబడ్డాయి. పరమశివుని సహస్ర నామం జపించడం వల్ల కలిగే ఫలితాలు తెలుసుకుందాం.

శివ సహస్ర నామం పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు

శివుని సహస్రనామాన్ని పఠించడం వలన జీవితంలోని అన్ని కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. శివుడిని స్వయంభువుడి అని కూడా పిలుస్తారు. అంటే అతను మానవ శరీరం నుంచి జన్మ తీసుకోలేదు. శివుని ఉనికి ఆది అంతం లేనిదని విశ్వాసం. ప్రపంచంలో అణువణువులో శివుడు నిండి ఉంటాడని.. అందుకే అతడిని ఆది దేవుడు అని పిలుస్తారు. ఎవరైతే తెల్లవారుజామున నిద్రలేచి భక్తితో పరమశివుని సహస్ర  నామాన్ని జపిస్తారో వారికి సకల సిద్ధి కలుగుతుంది. ఈ గొప్ప నామం పఠించడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. దీనిని పఠించడం ద్వారా ఆనందం, శ్రేయస్సుతో పాటు మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు. అంతేకాదు అప మృత్యు దోషం నుంచి బయటపడడమే కాదు.. జీవితంలో మోక్షాన్ని పొందుతాడు. అంతే కాదు శివుని ఆశీస్సులు ఆ భక్తులపై ఎప్పుడూ ఉంటాయి.

శివ సహస్ర నామం జపించిన శ్రీ మహా విష్ణువు

శివ పురాణం ప్రకారం శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రీ మహా విష్ణువు.. శివ సహస్రనామాన్ని జపించాడు. ఇలా శివ సహస్ర నామాన్ని జపిస్తూ ఒకొక్క నామం చదువుతూ శివుడికి తామర పువ్వుని భక్తితో సమర్పించాడు విష్ణువు. ఇలా సహస్ర నామం మంత్రోచ్ఛారణ చేస్తూ.. ప్రతిరోజూ శివునికి తామర పువ్వును సమర్పించేవాడు. కానీ ఒక రోజు శివుడు లీలను ప్రదర్శించాడు. దీని కారణంగా విష్ణువు మంత్రం అనంతరం తామర పువ్వు  సమర్పిస్తుండగా ఆ పువ్వు కింద పడిపోయింది. అప్పుడు పూజకు ఆటంకం కలుగకుండా విష్ణువు తన కన్నుల్లో ఒకటి తీసి శివునికి తామరపువ్వుకు బదులుగా సమర్పించాడు. విష్ణువు భక్తికి, త్యాగానికి సంతోషించిన శివుడు అతనికి సుదర్శన చక్రాన్ని ప్రసాదించాడు. మీ భక్తికి, మెచ్చి ఇచ్చిన వరం సుదర్శన చక్రం అని శివుడు శ్రీ మహా విష్ణువుతో చెప్పాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు