ఆ ఆలయానికి వెళ్లే భక్తులకు వెండి, బంగారం నాణేలు ప్రసాదంగా ఇస్తారు.. మన దేశంలోనే

మన దేశంలో అనేక దేవాలయాలు.. ఆ ఆలయ నిర్వహణ వెనుక భిన్న పద్ధతులు, నమ్మకాలు ఉన్నాయి. సాధారణంగా భక్తులు గుడికి వెళ్లి మొక్కుబడులు తీర్చుకుంటారు. దర్శనం అనంతరం భక్తులకు , ప్రసాదం ఇస్తారు. అయితే మనదేశంలో ఆభరణాలు ప్రసాదంగా ఇచ్చే ఉందని మీకు తెలుసా..

ఆ ఆలయానికి వెళ్లే భక్తులకు వెండి, బంగారం నాణేలు ప్రసాదంగా ఇస్తారు.. మన దేశంలోనే
Mahalaxmi Temple In Ratlam

Updated on: May 20, 2022 | 12:36 PM

Ratlam Mahalaxmi Temple: భారతదేశం(Bharath) ఆధ్యాత్మికతకు నెలవు. అనేక అద్భుతమైన దేవాలయాలతో నిండి ఉంది.  అద్భుత ధార్మిక ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఈ ఆలయాలకు సంబంధించిన రహస్యాలు సైన్స్ కు సవాల్ విసురుతూ ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్నాయి. మన దేశంలో అనేక దేవాలయాలు.. ఆ ఆలయ నిర్వహణ వెనుక భిన్న పద్ధతులు, నమ్మకాలు ఉన్నాయి. సాధారణంగా భక్తులు గుడికి వెళ్లి మొక్కుబడులు తీర్చుకుంటారు. దర్శనం అనంతరం భక్తులకు , ప్రసాదం ఇస్తారు. అయితే మనదేశంలో ఆభరణాలు, డబ్బుని ( jewellery and currency) ప్రసాదంగా ఇచ్చే ఆలయం ఒకటి ఉందని మీకు తెలుసా..! ఈ ఆలయానికి వచ్చే భక్తులు బంగారు, వెండి నాణేలతో ఇంటికి వెళ్తారు. ఆ ఆలయం గురించి వివరాలను ఈరోజు తెలుసుకుందాం..

మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లోని ప్రత్యేకమైన మహాలక్ష్మి ఆలయం ఏడాది పొడవునా భక్తులతో రద్దీగా ఉంటుంది. భక్తులు మహాలక్ష్మి అమ్మవారి పాదాల చెంత కోట్లాది రూపాయల నగలు, నగదు సమర్పించుకుంటారు. దీపావళికి ముందు భక్తులు ఆభరణాలు, నగదు సమర్పించే దేశంలోని ఏకైక ఆలయం ఇదే. కొందరు నోట్ల కట్టలు, మరికొందరు బంగారు, వెండి ఆభరణాలు సమర్పిస్తారు. ఈ ఆలయం కుబేరుని నిధిగా ప్రసిద్ధి చెందింది.

భక్తులకు ప్రసాదంగా ఆభరణాలు: 
దీపావళి సందర్భంగా.. ఈ ఆలయంలో దంతేరస్ నుండి ఐదు రోజుల పాటు దీపోత్సవం నిర్వహిస్తారు. ఈ సమయంలో, ఆలయాన్ని పూలతో కాకుండా భక్తులు సమర్పించే ఆభరణాలు, డబ్బుతో అలంకరిస్తారు. ఈ ఆలయంలో ధన్ తేరాస్  రోజున మహిళా భక్తులు కుబేరుడికి తమ మొక్కుబడులను చెల్లించుకుంటారు. అయితే ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు ఎవరూ తిరిగి ఖాళీ చేతులతో వెళ్ళరు. భక్తులకు బంగారం, వెండి, డబ్బులు ఇలా ఏదో ఒక రూపంలో ప్రసాదం ఇస్తారు.

ఇవి కూడా చదవండి

ధన్‌తేరస్ నుండి దీపావళి వరకు మహాలక్ష్మి అమ్మవారికి ఏమి సమర్పించినా అది రెట్టింపు అవుతుందని  భక్తుల  నమ్మకం. అందుకే భక్తులు తమ శక్తి కొలదీ బంగారం, వెండితో అమ్మవారి చెంతకు చేరుకుని అమ్మవారి పాదాల వద్ద సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల ఏడాది పొడవునా తమ కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయని విశ్వాసం. వారం రోజుల తర్వాత భక్తులు అమ్మవారికి సమర్పించిన బంగారం, వెండి తిరిగి అందజేస్తారు. ఇందుకోసం భక్తులు తమ  గుర్తింపు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి