Maha Shivaratri: జంగమయ్య జాగారణకు శ్రీకాళహస్తి ముస్తాబు.. అర్ధరాత్రి కీలక ఘట్టం లింగోధ్భవ దర్శనం

ఎండల తీవ్రతతో భక్తులకు ఇబ్బంది కలగకుండా జర్మన్ షేడ్స్ ను ఆలయం చుట్టూ ఏర్పాటు చేసింది. భక్తుల రద్దీకి తగ్గట్టుగా ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసింది. అర్ధరాత్రి 2.30 గంటలకు గోపూజ నిర్వహించి అనంతరం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నారు అర్చకులు. అనంతరం 3 గంటల నుంచే స్వామివారి దర్శనం భక్తులకు కల్పిస్తారు. శ్రీకాళహస్తీశ్వరుడికి ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం నారాయణస్వామి పట్టువస్త్రాలు సమర్పించగా కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చిన నారాయణ స్వామికి స్థానిక ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి ఆలయ అధికారులు స్వాగతం పలికారు

Maha Shivaratri: జంగమయ్య జాగారణకు శ్రీకాళహస్తి ముస్తాబు.. అర్ధరాత్రి కీలక ఘట్టం లింగోధ్భవ దర్శనం
Srikalahasti

Edited By: Surya Kala

Updated on: Mar 08, 2024 | 11:31 AM

శ్రీకాళహస్తిలోని ముక్కంటి క్షేత్రం సర్వం సిద్ధమైంది. శ్రీకాళహస్తి ఆలయంలో జరుగుతున్న మహా శివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో  కీలక ఘట్టం జరగనుంది. స్వామి అమ్మవార్ల దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన దేవస్థానం నాలుగు రకాలుగా క్యూ లైన్ లను ఏర్పాటు చేసింది. ఇక ప్రత్యేక పూలు పండ్లతో ఆలయాన్ని అలంకరించగా విద్యుత్తు దీప కాంతులతో అంతరాలయం వెలిగిపోతోంది.
నాలుగు మాడ వీధులలో స్వామివారి రథం ఊరేగింపు కు ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక ఆకర్షణగా స్వామీ అమ్మవార్ల లేజర్ లైటింగ్ షో ఆకట్టు కుంటుండగా ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనల కోసం ధూర్జటి కళా వేదిక ఏర్పాటు అయ్యింది.

కేదార్నాథ్ ఆలయం నమునాతో వేసిన సెట్టింగులు బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆలయానికి వచ్చే భక్తుల కోసం నాలుగు ద్వారాలు ఏర్పాటు చేసిన దేవస్థానం సామాన్య భక్తులకు పెద్ద పీట వేసింది. భక్తులకు అందుబాటులో రూ. 200 స్పెషల్ దర్శనం టికెట్లు జారీ చేయనుంది. వి.ఐ.పి. భక్తుల కోసం స్పెషల్ ఎంట్రన్స్ ఏర్పాటు చేసిన దేవస్థానం… ఎండల తీవ్రతతో భక్తులకు ఇబ్బంది కలగకుండా జర్మన్ షేడ్స్ ను ఆలయం చుట్టూ ఏర్పాటు చేసింది. భక్తుల రద్దీకి తగ్గట్టుగా ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసింది. అర్ధరాత్రి 2.30 గంటలకు గోపూజ నిర్వహించి అనంతరం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నారు అర్చకులు. అనంతరం 3 గంటల నుంచే స్వామివారి దర్శనం భక్తులకు కల్పిస్తారు.

ఇవి కూడా చదవండి

ఇక శ్రీకాళహస్తీశ్వరుడికి ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం నారాయణస్వామి పట్టువస్త్రాలు సమర్పించగా
కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చిన నారాయణ స్వామికి స్థానిక ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. మహాశివరాత్రి రోజున రాత్రి 9 గంటలకు స్వామి అమ్మవార్లు అత్యంత నంది వాహనంపై దర్శనం ఇవ్వనుండగా అర్ధరాత్రి కీలక ఘట్టం లింగోధ్భవ దర్శనం జరగనుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..