
దేశవ్యాప్తంగా మహాశివరాత్రి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మహాశివరాత్రి రోజున శివుడిని పూజించడం అత్యంత ఫలప్రదంగా భావిస్తారు. మహాశివరాత్రి రోజున శివుడు విశ్వంలో శివలింగ రూపంలో ఉద్భవించాడని.. శివ పార్వతిల వివాహం జరిగిన రోజు అని హిందువుల విశ్వాసం. మహాశివరాత్రి సందర్భంగా శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. బిల్వ పత్రం, గంగ జలం, వంటి వాటితో పూజను చేస్తారు. శివలింగానికి పాలు, పెరుగు, నెయ్యి, గంగాజలం, చెరకు రసంతో అభిషేకం చేస్తారు.
ఈ శివరాత్రి వెరీ వెరీ స్పెషల్..
ఈ సంవత్సరం, మహాశివరాత్రి నాడు చాలా అరుదైనది. 144 ఏళ్లకు మాత్రమే ఇలా వస్తుందని చెప్పడంతో.. ఈ ఏడాది మహాశివరాత్రి ప్రాముఖ్యత చాలా పెరిగింది. ఈ రోజు కుంభరాశిలో శని, సూర్యుడు, చంద్రుడు కలవనున్నారు. దీంతో త్రిగ్రాహి యోగం ఏర్పడబోతోంది. అంతేకాదు మహాశివరాత్రి రోజున శని త్రయోదశి కూడా వచ్చింది. కనుక ఈ ఏడాది మహాశివరాత్రి రోజున శివుడిని పూజించడం చాలా ఫలవంతంగా పండితులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో.. ఈ రోజున కొన్ని జ్యోతిష్య పరిహారాలను చేయడం ద్వారా.. అన్ని రకాల దోషాల నుండి విముక్తి పొందుతారు.
దోష నివారణ కోసం మహా శివరాత్రి చేయాల్సిన పూజలు
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)