Maha Kumbha Mela: మహా కుంభమేళాలో రెండో రాజ స్నానం ఎప్పుడు? ప్రాముఖ్యత? చేయాల్సిన దానాలు ఏమిటంటే

|

Dec 20, 2024 | 3:55 PM

మహా కుంభ మేళా హిందూ మతంలో జరిగే అతిపెద్ద, పవిత్రమైన జాతర. అర్ధ కుంభ మేళా, కుంభ మేళా, మహా కుంభ మేళా ఇలా ఎప్పుడు ఏ జాతర నిర్వహించినా ప్రతిసారీ లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అయితే ఈ సమయంలో 'షాహి స్నాన్' అంటే రాజ స్నానం అని పిలవబడే స్నానాలు అతి ముఖ్యమైనవిగా హిందువుల నమ్మకం. ఈ నేపధ్యంలో కొత్త సంవత్సరంలో జరగనున్న మహా కుంభ మేళా లో రెండో రాజ స్నానం ఎప్పుడు? ప్రాముఖ్యత, ఏ దానం చేయడం మంచిదో తెలుసుకుందాం..

Maha Kumbha Mela: మహా కుంభమేళాలో రెండో రాజ స్నానం ఎప్పుడు? ప్రాముఖ్యత? చేయాల్సిన దానాలు ఏమిటంటే
Maha Kumbha Mela 2025
Follow us on

మహా కుంభ మేళా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమం. కొత్త సంవత్సరం 2025 జనవరి 13 నుంచి ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళా జాతర ప్రారంభం కానుంది. మహా కుంభ మేళాను జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు నిర్వహించనున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులతో పాటు వివిధ అఖారాల సాధువులు కూడా వస్తారు. ఈ మహా కుంభ మేళాలో మొత్తం ఆరు రాజ స్నానాలు చేస్తారు. పుష్య మాసంలోని పౌర్ణమి రోజున అంటే జనవరి 13 నుంచి మహా కుంభ మేళా స్నానాలు ప్రారంభమవుతాయి. ఇది మొదటి రాజ స్నానం కాగా.. రెండో రాజ స్నానం మకర సంక్రాంతి రోజున చేయనున్నారు. ఈ రోజు రెండో రాజ స్నానం చేయాల్సిన సమయం, దానాలు ఏమిటో తెలుసుకుందాం..

మకర సంక్రాంతి రోజున స్నానం చేయడానికి అనుకూలమైన సమయం

మహా కుంభ మేళా రెండవ రాజ స్నానం సంవత్సరం.. ఏడాదిలో మొదటి పండుగ అయిన మకర సంక్రాంతి రోజున చేయాల్సి ఉంటుంది. అంటే 2025లో జనవరి 14న మకర సంక్రాంతి పండగ వచ్చిన నేపధ్యంలో రెండో రాజ స్నానం మకర సంక్రాంతి రోజున చేయాల్సి ఉంది. ఈ రోజున చేసే స్నానం, దానం వల్ల గొప్ప పుణ్యం లభిస్తుంది. నమ్మకం ప్రకారం ఈ రోజున స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. మకర సంక్రాంతి రోజున స్నానమాచరించే శుభ ముహర్తం పంచాంగం ప్రకారం బ్రహ్మ ముహూర్తం సాయంత్రం 5.27 నుంచి 6.21 వరకు ఉంది.

మకర సంక్రాంతి రోజున చేసే స్నానం ప్రాముఖ్యత

మకర సంక్రాంతి రోజున కుంభమేళా సమయంలో చేసే స్నానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున గంగా స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని హిందూ గ్రంధాలలో కూడా పేర్కొనబడింది. మకర సంక్రాంతి రోజున స్నానం చేసిన వారికి ఇహ పర సుఖాలను పొందుతారని నమ్ముతారు. ఈ రోజు గంగాస్నానం చేసిన వ్యక్తికి 10 అశ్వమేధ యాగాలు, 1,000 గోవులను దానం చేసినంత పుణ్యం లభిస్తుంది. మకర సంక్రాంతి రోజున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం చాలా ఫలవంతంగా పరిగణించబడుతుంది.

ఇవి కూడా చదవండి

దానం చేయడం శుభప్రదం

మకర సంక్రాంతి రోజున స్నానంతో పాటు దానాలు కూడా చేస్తారు. హిందూ విశ్వాసాల ప్రకారం ఈ రోజున దానం చేయడం వల్ల జీవితంలోని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ రోజున బియ్యం, నెయ్యి, బెల్లం, ఉన్ని దుస్తులు, నల్ల నువ్వులు దానం చేయడం వలన విశేష ఫలితాలు లభిస్తాయని నమ్మకం.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.