నవంబర్ 8న మరో గ్రహణం.. 15 రోజుల్లో రెండు గ్రహణాలు శుభమా..? అశుభమా..?

దాదాపు గంటన్నర పాటు కొనసాగనున్న ఈ గ్రహణం భారత్‌తో పాటు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, ఉత్తర పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రంలో కనిపించనుంది.

నవంబర్ 8న మరో గ్రహణం.. 15 రోజుల్లో రెండు గ్రహణాలు శుభమా..? అశుభమా..?
Lunar Eclipse

Updated on: Oct 25, 2022 | 8:55 PM

చంద్ర గ్రహణం 2022: దీపావళి తర్వాతి రోజున సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం సంభవించింది. కానీ, ఇది జరిగిన సరిగ్గా 15 రోజుల తర్వాత అంటే, నవంబర్ 8న ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం కూడా ఏర్పడుతోంది. అంటే హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసం పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం అవుతుంది. ఇది భారతదేశంలో కూడా కనిపిస్తుంది. అయితే భారతదేశంలో సంపూర్ణ చంద్రగ్రహణం 5.30 గంటలకు ప్రారంభమై 6.19 వరకు ఉంటుంది. దాదాపు గంటన్నర పాటు కొనసాగనున్న ఈ గ్రహణం భారత్‌తో పాటు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, ఉత్తర పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రంలో కనిపించనుంది.

ఇదిలా ఉంటే, జ్యోతిష్యుల ప్రకారం 15 రోజుల్లో రెండు గ్రహణాలు సంభవించడం అశుభ ఫలితాలను తెస్తుంది. అంటే 15 రోజుల వ్యవధిలో వచ్చే రెండు గ్రహణాలు ప్రపంచంపై ప్రభావం చూపుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించవచ్చని అంటున్నారు. లేదంటే.. వాతావరణంలో ఆకస్మిక మార్పులు సంభవించవచ్చని చెబుతున్నారు. దీంతో దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందంటున్నారు.. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు తలెత్తవచ్చు, అభివృద్ధి వేగం మందగిస్తుంది. వ్యాపార తరగతి ప్రజలలో ఆందోళన పెరుగుతుందని జ్యోతిశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

హిందూ విశ్వాసం ప్రకారం, గ్రహణం అనేది మన జీవితాన్ని చాలా ప్రతికూలంగా ప్రభావితం చేసే ఒక సంఘటన. అందువల్ల గ్రహణం యొక్క చెడు ప్రభావాలను నివారించడానికి అనేక నివారణలు సూచించబడ్డాయి. గ్రహణం సమయంలో ఎటువంటి పూజలు నిర్వహించబడవు లేదా ఆలయాలు తెరవబడవు. గ్రహణ సమయంలో భోజనం చేయకూడదు. అలాగే గ్రహణానికి ముందు తయారుచేసిన ఆహారాన్ని కూడా తినకూడదు. చంద్రగ్రహణం తర్వాత ముందుగా స్నానం చేసి ఇంట్లో గంగాజలం చల్లుకోవాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి