Lunar Eclipse: ఈ ఏడాది మొదటి చంద్ర గ్రహణం మార్చిలో ఏర్పడనుంది.. తేదీ, సూత కాలం ఎప్పుడంటే

|

Feb 17, 2024 | 7:13 PM

ఈ సంవత్సరం 2024లో 2 చంద్రగ్రహణాలు సంభవించబోతున్నాయి. మొదటి చంద్రగ్రహణం మార్చిలో , రెండవది సెప్టెంబర్ నెలలో ఏర్పడుతుంది. సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున ఏర్పడుతుంది. చంద్రగ్రహణం సూతక కాలం 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. సూతక కాలం ప్రారంభమైనప్పుడు దేవాలయాలు మూసివేస్తారు. సూతకాలంలో భోజనం చేయడం, వంట చేయడం, నిద్రించడం, పూజలు చేయడం, శుభకార్యాలు వంటివి నిషేధించబడ్డాయి. గర్భిణీ స్త్రీలు, పిల్లలు , వృద్ధులు ఈ సమయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

Lunar Eclipse: ఈ ఏడాది మొదటి చంద్ర గ్రహణం మార్చిలో ఏర్పడనుంది.. తేదీ, సూత కాలం ఎప్పుడంటే
Lunar Eclipse 2024
Image Credit source: pixabay
Follow us on

జ్యోతిషశాస్త్రంలో గ్రహణం అనేది ఒక ఖగోళ సంఘటన.  ఇది సైన్స్  పరంగానే కాదు మతం పరంగా చాలా ముఖ్యమైనది. సూర్యుడు, భూమి, చంద్రుడు దాదాపు సరళ రేఖలో వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అంటే సూర్యుడు.. చంద్రుని మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. హిందూ మత పరమైన మరియు పౌరాణిక విశ్వాసాల ప్రకారం రాహు-కేతువులతో సంబంధం కలిగి ఉంటుంది. జ్యోతిషశాస్త్రంలో గ్రహణం ప్రజల జీవితాన్ని ప్రభావితం చేస్తుందని నమ్ముతారు. అంటే జీవితంపై మంచి లేదా చెడు ప్రభావాన్ని చూపుతుంది. అటువంటి పరిస్థితిలో జ్యోతిష్కులు 2024 సంవత్సరంలో సంభవించే చంద్రగ్రహణం గురించి చెప్పిన విషయాలను తెలుసుకుందాం..

ఈ సంవత్సరం 2024లో 2 చంద్రగ్రహణాలు సంభవించబోతున్నాయి. మొదటి చంద్రగ్రహణం మార్చిలో , రెండవది సెప్టెంబర్ నెలలో ఏర్పడుతుంది. సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున ఏర్పడుతుంది. చంద్రగ్రహణం సూతక కాలం 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. సూతక కాలం ప్రారంభమైనప్పుడు దేవాలయాలు మూసివేస్తారు. సూతకాలంలో భోజనం చేయడం, వంట చేయడం, నిద్రించడం, పూజలు చేయడం, శుభకార్యాలు వంటివి నిషేధించబడ్డాయి. గర్భిణీ స్త్రీలు, పిల్లలు , వృద్ధులు ఈ సమయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

2024 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం

కొత్త సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం మార్చి 25 సోమవారం ఏర్పడనుంది. ఈ రోజున పౌర్ణమి.  సాయంత్రం 06:45 గంటలకు చంద్రోదయం అవుతుంది. అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఈ చంద్రగ్రహణం మొదటి స్పర్శ ఉదయం 10:23 గంటలకు పెనుంబ్రాతో ఉంటుంది. పెనుంబ్రా నుండి చివరి స్పర్శ మధ్యాహ్నం 03:01 గంటలకు ఉంటుంది. పాక్షిక గ్రహణ మొత్తం వ్యవధి 4 గంటల 35 నిమిషాలు.

ఇవి కూడా చదవండి

మొదటి చంద్ర గ్రహణం 2024 సూత కాలం

భారతదేశంలో చంద్రగ్రహణం కనిపించని కారణంగా సూత కాలం చెల్లదు. సూత కాలం చెల్లుబాటు కానందున ఏ వ్యక్తిపైనా గణనీయమైన ప్రభావం ఉండదు. అటువంటి పరిస్థితిలో మార్చి 25న అంటే చంద్రగ్రహణం రోజున ఏదైనా శుభ కార్యాన్ని జరుపుకోవచ్చు.

2024 మొదటి చంద్రగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది?

ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఈ చంద్రగ్రహణం ఉత్తర, తూర్పు ఆసియా, యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆర్కిటిక్ , అంటార్కిటికాలోని చాలా ప్రాంతాలలో కనిపిస్తుంది.

గ్రహణం సమయం మత విశ్వాసం

గ్రహణం ఖగోళ దృగ్విషయం కాకుండా.. చంద్రగ్రహణం వెనుక మత విశ్వాసం కూడా ఉంది. ఒక పురాణం ప్రకారం, దేవతలు, రాక్షసులు కలిసి సముద్రాన్ని మథనం చేసినప్పుడు అమృతం వచ్చింది. ఆ సమయంలో మోహిని రూపంలో ఉన్న విష్ణువు మొదట దేవతలను అమృతాన్ని పంచాడు. అయితే ఆ సమయంలో ఒక రాక్షసుడు మోసంతో అమృతాన్ని తాగాడు. సూర్య, చంద్రులు ఈ విషయాన్ని మోహినీ దేవి రూపంలో ఉన్న విష్ణువుకు చెప్పగా..  అతను తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుడి తలను నరికివేశాడు. అమృతం ప్రభావం వల్ల ఆ రాక్షసుడు సజీవంగానే ఉన్నాడు. తరువాత ఆ రాక్షసుడు రాహువు , కేతువు అని పిలువబడ్డాడు.  అమావాస్య , పూర్ణిమ తిథుల్లో రాహు-కేతువులు సూర్యచంద్రులను మింగుతారని పురాణ కథనం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు