అక్టోబర్ 28వ తేదీన పాక్షిక చంద్రగ్రహణం కారణంగా గ్రహణం సమయానికంటే 8 గంటల ముందు నుంచి సూతకాలంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లోని దర్శనాలను అక్టోబర్ 28న రాత్రి 7.05 గంటలనుంచి నిలివేయనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీవారి ఆలయ తలుపులు ఈ నెల 28వ తేదీ రాత్రి 7 గంటలకు మూసివేసి మర్నాడు అంటే 29వ తేదీ తెల్లవారుజామున 3.15 గంటలకు తెరుస్తారు. దాదాపు ఎనిమిది గంటల పాటు ఆలయ తలుపులు మూసివేయనున్నారు. 29న తెల్లవారుజామున 1.05 నుండి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుంది. ఈ కారణంగా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని అక్టోబరు 28న సాయంత్రం 6 గంటలకు మూసివేసి అక్టోబరు 29న ఉదయం 9 గంటలకు తెరుస్తారు. ఈ సమయంలో అన్నప్రసాదాల పంపిణీ ఉండదు. అదేవిధంగా అక్టోబర్ 28న సహస్ర దీపాలంకార సేవ, వికలాంగులు, వయోవృద్ధుల దర్శనాన్ని టీటీడీ రద్దు చేసింది. భక్తులకు ఈ మేరకు భక్తులు అసౌకర్యానికి గురికాకుండా తిరుమల యాత్రకు ప్రణాళిక రూపొందించు కోవాలని టిటిడి కోరుతోంది.
పాక్షిక చంద్రగ్రహణం కారణంగా అక్టోబరు 28న టీటీడీ స్థానిక ఆలయాల మూత పడనున్నాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అక్టోబరు 28న సాయంత్రం 5 గంటలకు ఆలయ తలుపులు మూసివేస్తారు. తిరిగి అక్టోబరు 29న తెల్లవారుజామున 4.30 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. శుద్ధి అనంతరం ఉదయం 7 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో అక్టోబరు 28న రాత్రి 7 గంటలకు ఆలయ తలుపులు మూసివేస్తారు. శుద్ధి అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.
శ్రీశైలం మల్లన్న ఆలయం ఈ నెల 28వ తేదీన పాక్షిక చంద్రగ్రహణం కారణంగా 28 వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి మరుసటి రోజు అనగా 29 న ఉదయం 5 వరకు ఆలయద్వారాలను మూసివేయనున్నారు. ఈ మేరకు ఆలయ ఈవో పెద్దిరాజు ఓ ప్రకటన విడుదల చేశారు. 29 ఉదయం 5 గంటలకు ఆలయద్వారాలు తెరచి ఆలయశుద్ధి. సంప్రోక్షణ, ప్రాతఃకాల పూజల అనంతరం 7 గంటల నుండి భక్తులను దర్శనాలు, ఆర్జిత అభిషేకాలు, ఇతర ఆర్జితసేవలు అనుమతిస్తామన్నారు.
చంద్రగ్రహణం రోజైన 28న మధ్యాహ్నం 3,30ల వరకు మాత్రమే భక్తులకు సర్వదర్శనం అనుమతిస్తామని అలానే 28 న మధ్యాహ్నం 12.30 వరకు మాత్రమే గర్భాలయ ఆర్జిత అభిషేకాలకు అవకాశం కల్పిస్తూ సామూహిక అభిషేకాలు,స్పర్శ దర్శనాలు (సర్వ కాదు)కూడా ఉదయం మాత్రమే ఉంటుందని చెప్పారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..