చంద్రగ్రహణం 2022: ఈ సంవత్సరం నవంబర్ నెలలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది 2022 సంవత్సరంలో చంద్రునికి రెండవ గ్రహణం అవుతుంది. గ్రహణం పరిమాణం 1.36 ఉంటుంది. ఇది సంపూర్ణ గ్రహణం కాబట్టి, గరిష్ట గ్రహణం సమయంలో చంద్రుడు పూర్తిగా భూమి నీడలో మునిగిపోతాడు. భూమి నీడ లోపల చంద్రుని భాగం భూమి వాతావరణం ద్వారా వక్రీభవన సూర్యకాంతి, ఎర్రటి రంగు ద్వారా మాత్రమే ప్రకాశిస్తుంది. దీని మొత్తం కాల వ్యవధి 1 గంట 24 నిమిషాల 28 సెకన్లు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
చంద్రగ్రహణం 2022: తేదీ
ఈ ఏడాది కార్తీక పౌర్ణమి.. చంద్ర గ్రహణంతో కలిసి వచ్చింది. కార్తీక పౌర్ణమి నాడే చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ సంవత్సరంలో ఇది రెండో చంద్ర గ్రహణం. చంద్రగ్రహణం వచ్చే నెల రెండవ వారంలో నవంబర్ 8న సంభవిస్తుంది. చంద్రోదయంతోనే గ్రహణం ప్రారంభమవుతుంది. సాయంత్రం 05:32 గంటలకు మొదలైన చంద్రగ్రహణం సాయంత్రం 06:18గంటలకు ముగుస్తుంది. స్థానికంగా స్థానిక గ్రహణం వ్యవధి – 45 నిమిషాల 48 సెకన్లుగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇది పాక్షిక చంద్రగ్రహణం. ఇంత సుదీర్ఘకాల పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడటం 580 సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి.
ఇకపోపతే, భారతదేశంలో సంపూర్ణ చంద్ర గ్రహణం తూర్పు భాగాల నుండి మాత్రమే కనిపిస్తుంది. అయితే దేశంలోని మిగిలిన ప్రాంతాలు పాక్షిక గ్రహణాన్ని చూస్తాయి. కోల్‌కతా, సిలిగురి, పాట్నా, రాంచీ, గౌహతి, ఖాట్మండు, టోక్యో, మనీలా, బీజింగ్, సిడ్నీ, జకార్తా, మెల్‌బోర్న్, శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ DC, న్యూయార్క్ సిటీ, లాస్ ఏంజిల్స్ వంటి కొన్ని ప్రసిద్ధ నగరాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి