Lucky Signs in Foot: సాముద్రిక, హస్త రేఖా శాస్త్రం ప్రకారం పాదంలో ఏ విధంగా రేఖలు ఉంటే అదృష్ట సంకేతాలో తెలుసా..!

|

Jul 01, 2022 | 10:20 AM

అదృష్టం అనేది చేతుల రేఖలలో మాత్రమే కాదు పాదాలు కూడా మీ విధిని తెలియజేస్తాయి

Lucky Signs in Foot:  సాముద్రిక, హస్త రేఖా శాస్త్రం ప్రకారం పాదంలో ఏ విధంగా రేఖలు ఉంటే అదృష్ట సంకేతాలో తెలుసా..!
Lucky Signs In Foot
Follow us on

Lucky Signs in Foot: ఒక వ్యక్తి  విధి అతని చేతుల రేఖలలో దాగి ఉందని చాలామంది నమ్మకం. ఈ రేఖలను చూసి.. ఏ జ్యోతిష్కుడు అయినా మీ గతం నుండి భవిష్యత్తు వరకు మొత్తం సమాచారాన్ని అందించవచ్చు. అయితే  హస్తసాముద్రికం, సాముద్ర శాస్త్రంలో.. అరికాళ్ళపై ఉన్న గీతాలకు కూడా అర్ధాలను మనిషి జీవిత విధాన్ని పేర్కొన్నాయి.  హస్తసాముద్రికం, సాముద్ర శాస్త్రంలో విష్ణువు పాదాలలో ఉన్న రేఖలు, సంకేతాలను సూచిస్తూ అరికాళ్లలోని రేఖలు చాలా  పవిత్రమైనవిగా వర్ణించబడ్డాయి. ఒక వ్యక్తి  అరికాలిలో కొన్ని రేఖలు అతడిని అదృష్టవంతుడిని చేస్తుందని నమ్ముతారు. ఈరోజు అరికాలిలోని రేఖలు, శుభసంకేతాల గురించి తెలుసుకుందాం..

  1. పాదాలలో ఉన్న శుభ సంకేతాలు, రేఖలు 
    ఎవరికైనా పాదాలలో త్రిశూలం ఉంటే.. అతను చాలా అదృష్టవంతుడు. త్రిశూలం శివుని ఆయుధం. ఇలాంటి వాళ్లు ప్రభుత్వ రంగంలోనో, ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఏరియాలోనో పెద్ద ఆఫీసర్ అవుతారని నమ్మకం. ఎక్కడ నివసించినా.. వైభవంగా జీవిస్తారు. జీవితంలోని అన్ని ఆనందాలను పొందుతారు.
  2. అరికాళ్ల మధ్య నుంచి మధ్య వేలు వరకు రేఖ వెళుతూ కనిపిస్తే.. అలాంటి వారి జీవితం చాలా ఆనందంగా గడుస్తుంది.  ప్రతిదీ చాలా సులభంగా పొందుతారు.
  3. మడమ మధ్య నుండి అరికాళ్ళ అంచు వరకు చంద్రవంక తరహాలో రేఖలుంటే.. అలాంటి వ్యక్తి స్వతహాగా సాధుస్వభావం కలవారు. ధనము, గౌరవము, పలుకుబడి వున్నా ఎవరి జోలికి పోరు. దేవుణ్ణి చాలా నమ్ముతారు.
  4. అరికాళ్లపై స్వస్తిక , జెండా వంటి రేఖలున్న వ్యక్తులు రాజులాంటి జీవితాన్ని అనుభవిస్తారు. మహాపురుషులు, పరోపకారి. ఆధ్యాత్మికంగా జీవించడానికి ఇష్టపడతారు. జీవితంలో చాలాసార్లు పరిపూర్ణ పురుషులవుతారు.
  5. ఇంగ్లిష్ అక్షరం T  ఆకారం మడమ పైన కొద్దిగా కనిపిస్తే.. ఇటువంటి వ్యక్తులు వ్యాపారవేత్తగా ఎదిగే అవకాశం ఉందని అర్ధం. ఈ వ్యక్తులు వ్యాపారం ప్రారంభిస్తే.. విజయం సాధించకుండా ఎవరూ ఆపలేరు. చాలా డబ్బు, గౌరవాన్ని సంపాదిస్తారు.
  6. అరికాళ్ల మధ్యలో గుండ్రని ఆకారంలో రేఖలుంటే.. ఈ రేఖలను అక్షయ్ ధన్ రేఖ అంటారు. ఈ వ్యక్తులు డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడాలి. కష్టపడకుండా వారికి ఏమీ లభించదు. అయితే కష్టపడి పని చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో.. ఈ వ్యక్తులు కష్టపడి తమ విధిని తామే మార్చుకోవచ్చని చెప్పవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకం పై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)