Lord Ganesha: బుధవారం ఈ పరిహారాలు చేసి చూడండి.. గణపయ్య అనుగ్రహంతో ఇంట్లో ధన ధాన్యాలకు లోటు ఉండదు..

హిందువులు శివపార్వతుల ముద్దుల తనయుడైన వినాయకుడు విఘ్నాధిపతిగా భావించి పూజిస్తారు. వారంలో బుధవారం గణపతికి అంకితం చేయబడిన రోజు కనుక ఈ రోజు గణేశుడిని క్రమం తప్పకుండా పూజించాలి. గణేశుడు అంకితభావంతో చేసే పూజలకు సంతోషిస్తాడు. భక్తులు కోరిన కోర్కెలు నేరవేరుస్తాడు. ఈ రోజున గణపయ్యకు దర్భ గడ్డితో చేసే పూజ మరింత ఫలవంతంగా ఉంటుంది. గౌరీపుత్రుని ఆశీస్సులు మీపై ఉండాలంటే కొన్ని పరిహారాలు చేసి చూడండి.

Lord Ganesha: బుధవారం ఈ పరిహారాలు చేసి చూడండి.. గణపయ్య అనుగ్రహంతో ఇంట్లో ధన ధాన్యాలకు లోటు ఉండదు..
Lord Ganesha

Updated on: May 14, 2025 | 7:00 AM

ఈరోజు 14వ తేదీ మే 2025, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వైశాఖ మాసం కృష్ణ పక్షం బహుళ విదియ బుధవారం. హిందూ మతంలో బుధవారం గణేశుడికి అంకితం చేయబడింది. విఘ్నాలకు అధిపతి గణపతి కి మొదట పూజ చేయాలనీ నమ్మకం. అందుకనే ఏ శుభ కార్యమైనా లేదా పూజ లోనైనా మొదట గణపతిని పూజిస్తారు. తర్వాత మాత్రమే ఇతర దేవుళ్లను, దేవతలను పూజిస్తారు. గణేశుడిని జ్ఞానానికి అధిపతిగా భావిస్తారు. విఘ్నాలను తొలగించే వాడు కనుక వినాయకుడు అయ్యాడు. మీరు చేపట్టిన పనిలో అడ్డంకులు ఎదురవుతుంటే బుధవారం రోజున ఖచ్చితంగా గణేశుడిని పూజించండి. జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్నా బుధవారం పూజ చేయడం చాలా మంచి పరిష్కారం. అంతేకాదు చిన్న చిన్న పరిహరాలతో గణేశుడి కృపతో ఇంటికి ఆనందం, శ్రేయస్సు, శుభం వస్తాయి. బుధవారం రోజున చేసే కొన్ని పరిహారాలు ప్రతి పనిలోనూ మనకు విజయాన్ని చేకూరుస్తాయి. ఈ రోజు ఆ పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం..

బుధవారం ఏ పరిహారాలు చేయడం ఫలవంతం అంటే

  1. బుధవారం గణపతి ఆలయానికి వెళ్లి గణేశుడికి బెల్లం సమర్పించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి, గణేశుడు కూడా సంతోషిస్తారు . ఇంట్లో డబ్బు, ఆహారానికి కొరత ఉండదు.
  2. బుధవారం గణేశుడికి 21 దర్భలను పూజ సమయంలో సమర్పించండి. ఇలా చేయడం వల్ల గణపతి అనుగ్రహం త్వరగా కలుగుతుంది.
  3. బుధవారం రోజున ఆవుకు పచ్చ గడ్డిని ఆహారంగా అందించండి. దీని వలన గణపతి ఆశీర్వాదాలు లభిస్తాయి. అలాగే ఆర్థిక పురోగతి, జీవితంలోని అన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
  4. బుధవారం దుర్గాదేవిని పూజించాలి. దీనితో పాటు బుధ గ్రహ దోషం తొలగిపోవడానికి.. ‘ఓం ఐం హ్రీం క్లీం చాముండయే విచ్చే’ అనే దుర్గా మాత మంత్రాన్ని క్రమం తప్పకుండా 108 సార్లు జపించాలి.
  5. ఈ రోజున గణేశుడికి కుడుములను నైవేద్యం సమర్పించండి. ఇలా చేయడం వలన చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం పొందుతారు.
  6. బుధవారం రోజున మీ చిటికెన వేలికి పచ్చ రత్నం ధరించండి. ఇలా చేయడం ద్వారా జాతకంలో బుధుని స్థానం బలహీనంగా ఉంటే అది బలంగా మారుతుంది. అయితే దీనిని ధరించే ముందు జ్యోతిష్యుడిని సంప్రదించండి.
  7. బుధవారం నాడు ‘ ఓం గణగణపతయే నమః ‘ లేదా ‘ శ్రీ గణేశాయ నమః ‘ అనే మంత్రాన్ని జపించండి. ఇది మీ జీవితంలోని అన్ని కష్టాలను తొలగిస్తుంది.
  8. మీ జాతకంలో బుధ గ్రహం బలహీనంగా ఉంటే బుధవారం నాడు పేదవారికి పెసలు లేదా పచ్చని రంగు వస్త్రాన్ని దానం చేయండి. ఈ పరిహారంతో బుధుడు బలపడతాడు. మీకు ప్రయోజనం చేకూరుస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు