ఆదివారం సూర్యుడి అనుగ్రహం పొందాలంటే ఇలా చేయండి.. అదృష్టం మీ వెంటే ఉంటుంది..

|

Dec 19, 2021 | 2:05 PM

Sun Blessing: జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యక్ష దైవంగా కొలిచే సూర్యుడు అన్ని గ్రహాలకు అధిపతిగా పరిగణిస్తారు. సూర్యుడు ఆత్మ, ప్రాణశక్తి, శక్తి, గౌరవం, కీ

ఆదివారం సూర్యుడి అనుగ్రహం పొందాలంటే ఇలా చేయండి.. అదృష్టం మీ వెంటే ఉంటుంది..
Sun
Follow us on

Sun Blessing: జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యక్ష దైవంగా కొలిచే సూర్యుడు అన్ని గ్రహాలకు అధిపతిగా పరిగణిస్తారు. సూర్యుడు ఆత్మ, ప్రాణశక్తి, శక్తి, గౌరవం, కీర్తి, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు. సూర్యభగవానుడి శక్తి వల్ల భూమిపై జీవనం సాధ్యమవుతుంది. ఆయన అనుగ్రహం వల్ల సుఖం, ఐశ్వర్యం, సౌభాగ్యం, మంచి ఆరోగ్యం లభిస్తాయి. సనాతన సంప్రదాయంలో సూర్యుని ఆరాధన ద్వారా అన్ని రకాల వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చు. సూర్య భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి సులభమైన ప్రభావవంతమైన పద్దతుల గురించి తెలుసుకుందాం.

సూర్యుడి అనుగ్రహం పొందడానికి వాస్తు 
సూర్యుడి అనుగ్రహాన్ని పొందడానికి వాస్తులో అనేక చర్యల గురించి వివరించారు. వాస్తు ప్రకారం సూర్యభగవానుడి అనుగ్రహం పొందడానికి ప్రతిరోజూ సూర్యోదయం సమయంలో ఇంటి తలుపులు, కిటికీలు తెరవాలి. తూర్పున సూర్యుడు ఉన్న ఇంట్లో ఏడు గుర్రాల బొమ్మను ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. అదేవిధంగా ఒక వ్యక్తి ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతుంటే అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటే గదిలో సూర్యదేవుని విగ్రహాన్ని ఉంచడం వల్ల సానుకూల ఫలితాలు పొందుతారు. ఆరోగ్య పరంగా సూర్యోదయ కిరణాలు ఉత్తమమైనవి. వాస్తు ప్రకారం ఇంట్లో వంటగది, బాత్‌రూమ్‌లను నిర్మించేటప్పుడు సూర్యరశ్మి దానిలోకి చేరేలా జాగ్రత్త వహించాలి.

సూర్యుడి అనుగ్రహం పొందాలంటే..?
సనాతన సంప్రదాయంలో సూర్యుడి అనుగ్రహాన్ని పొందడానికి అనేక సులభమైన, సమర్థవంతమైన పద్దతులను తెలిపారు. ప్రతిరోజూ ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం, అతనికి నమస్కరించడం ద్వారా సూర్యభగవానుడు సంతోషిస్తాడు. అదేవిధంగా అన్ని దోషాలను తొలగించడానికి ఆదివారం ఉపవాసం గొప్ప పరిహారం. సూర్య భగవానుడికి ఉపవాసం పాటించడం ద్వారా శరీరం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఉంటుందని నమ్ముతారు. అయితే ఉపవాసం చేసేటప్పుడు ఉప్పును ముట్టుకోవద్దు. అదేవిధంగా ఐశ్వర్యాన్ని పొందడానికి ఆదివారాలలో రాగి వస్తువులను కొనవద్దు విక్రయించవద్దు. సూర్య భగవానుని అనుగ్రహాన్ని పొందడానికి ప్రతిరోజూ సూర్యదేవుని మంత్రాన్ని జపించి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి.

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాల ఆధారంగా రాయడం జరిగింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవని గుర్తించండి. సాధారణ పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని రాయడం జరిగింది.

cricket news: తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో జట్టుని గెలిపించాడు.. 30 నిమిషాల్లో మ్యాచ్‌ ముగించేశాడు..

పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం..! ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి జాబ్ నోటిఫికేషన్..

Aadhaar: ఆధార్‌ కార్డు లేకుంటే మీ జీవితం అసంపూర్ణమే..! ముఖ్యమైన ఈ పనులకు కచ్చితంగా అవసరం..