మన దేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. అలాగే భారతీయ సంస్కృతిలో ఎందరో దేవతలు, దేవుళ్లకు సంబంధించిన కథల గురించి వినే ఉంటాం. కొన్ని ఆలయాలు… స్వయంగా దేవుళ్లే నిర్మిస్తే.. మరికొందరు భక్తులు.. మహర్షులు నిర్మించిన ఆలయాలు ఉన్నాయి. ఇక ఇప్పటికీ అటువంటి ఆలయాలను సందర్శిస్తూనే ఉంటాం. కొన్ని ఆలయాలు ఇప్పటికీ చేధించలేని రహాస్యాలు కూడా అనేకం ఉన్నాయి. అలాంటి ఆలయమే గడియాఘాట్ మాతాజీ మందిరం..
సాధారణంగా దేవుడి గుడిలో దీపాన్ని వెలిగించాలంటే.. నూనె లేదా నెయ్యి అవసరం.. కానీ ఆ ఆలయంలోని దీపాన్ని నీటితో వెలిగించవచ్చు. మధ్యప్రదేశ్ లోని సాజాపూర్ జిల్లా కాలీసింద్ నది ఒడ్డున గల గడియాఘాట్ మాతాజీ మందిరంలో అద్భుతాలు అనేకం. ఈ గుడిలోని దీపం నూనె, నెయ్యితో కాకుండా.. నీటితోనే వెలుగుతుంది. ఈ వింతను చూసేందుకు చుట్టు పక్కల జనాలు వేలాదిగా తరలివస్తుంటారు. దాదాపు ఐదేళ్ల నుంచి ఆ దీపం ఆరకుండా వెలుగుతూనే ఉంది. ఇక్కడి ప్రమిదలో నిత్యం నూనెకు బదులు నీటిని పోస్తున్నా కూడా దీపం నిరంతరం వెలుగుతూనే ఉంది. ఆ దీపం ముందు నూనెతోనే వెలిగెదని.. కానీ ఓ రోజు అమ్మవారు కలలోకి వచ్చి ఆ దీపాన్ని నీటితో వెలిగించాలని చెప్పారని.. అప్పటి నుంచి దీపంలో నూనెకు బదులుగా నీటిని ఉపయోగిస్తున్నట్లుగీ ఆలయ పూజారులు తెలిపారు. ఇదే కాకుండా… ఈ ఆలయం.. నదీ తీరంలో ఉండడం వలన వర్షకాలంలో పూర్తిగా మునిగిపోతుంది. మొత్తం వర్షకాలమంతా ఆలయం పూర్తిగా మూసి ఉంటుంది. మళ్లీ నవరాత్రులకే ఆలయాన్ని తెరుస్తారు. కానీ ఆ దీపం మాత్రం ఆరిపోదు.