Tirumala: తిరుమల శ్రీవారికి స్వర్ణాభరణాలు విరాళం.. మూడు రకాల స్వర్ణాభరణాలను అందించిన దాత

|

Dec 29, 2022 | 4:14 PM

చిత్తూరులోని కేవీ ఆర్‌ జ్యూవెలర్స్‌ వ్యవస్థాపకులు కెఆర్‌.నారాయణమూర్తి, కెఎన్‌.స్వర్ణగౌరి దంపతులు ఇతర కుటుంబ సభ్యులు కలిసి గురువారం తిరుమల శ్రీవారికి మూడు రకాల స్వర్ణాభరణాలను విరాళంగా అందించారు.

Tirumala: తిరుమల శ్రీవారికి స్వర్ణాభరణాలు విరాళం.. మూడు రకాల స్వర్ణాభరణాలను అందించిన దాత
Tirumala Tirupati
Follow us on

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ఆపదమొక్కుల వాడిని దర్శించుకునేందుకు సెలబ్రెటీలు, రాజకీయనేతల నుంచి సామాన్యులు భారీగా తరలివస్తున్నారు. దీంతో వడ్డీ కాసుల వాడి హుండీ ఆదాయం కోట్లలో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా.. ఓ భక్తుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం అందజేశాడు.

చిత్తూరులోని కేవీ ఆర్‌ జ్యూవెలర్స్‌ వ్యవస్థాపకులు కెఆర్‌.నారాయణమూర్తి, కెఎన్‌.స్వర్ణగౌరి దంపతులు ఇతర కుటుంబ సభ్యులు కలిసి గురువారం తిరుమల శ్రీవారికి మూడు రకాల స్వర్ణాభరణాలను విరాళంగా అందించారు. ఈ ఆభరణాలను శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో(ఎఫ్‌ఏసి) అనిల్‌ కుమార్‌ సింఘాల్‌కు అందించారు.

ఈ ఆభరణాలు సుమారు 1756 గ్రాములు బరువు ఉంటాయని.. వీటి విలువ దాదాపు రూ.1.30 కోట్లు ఉంటాయని దాత కెఆర్‌.నారాయణమూర్తి తెలిపారు.  వీటిలో మూలవిరాట్‌ కోసం ఒక జత కర్ణాభరణాలు, మలయప్ప స్వామివారికి యజ్ఞోపవీతం, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి విలువైన రాళ్లు పొదిగిన మూడు పతకాలు ఉన్నాయి. అయితే ఇదే దాత కెఆర్‌.నారాయణమూర్తి.. గతేడాది డిసెంబరు( 2022)లో సుమారు రూ.3 కోట్లు విలువైన కటి, వరద హస్తాలను శ్రీవారికి కానుకగా అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..