Krodhi Naama Ugadi: క్రోధి నామ సంవత్సరం ఉగాది రోజున చేయాల్సిన పూజా విధానం మీ కోసం..

|

Apr 09, 2024 | 7:53 AM

వివిధ పేర్లతో దేశంలో వివిధ ప్రాంతాల్లో జరుపుకునే ఈ పండగను మాత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణటక రాష్ట్రాల్లో మాత్రం ఉగాదిగానే పిలుస్తారు. దాదాపు ఒకే సాంప్రదాయ పద్దతిలో పండగను జరుపుకుంటారు. ఆకులు రాల్చిన చెట్లు చిగుళ్ళు, కోయిల కువకువలతో వసంత ఋతువు ఆగమనాన్ని సంతోషంగా జరుపుకునే తోలి ఉత్సవం ఉగాది. సంప్రదాయాలు, ఆచార, వ్యవహారాలతో పాటు ఆరోగ్య రహస్యాలు, మానవ జీవిన విలువలను మేళవించిన పండగ ఉగాది. ఉగాది అనే పదం యుగాది నుంచి పుట్టిందని.. యుగాది అంటే సృష్టి ప్రారంభమైన రోజుని విశ్వాసం.

Krodhi Naama Ugadi: క్రోధి నామ సంవత్సరం ఉగాది రోజున చేయాల్సిన పూజా విధానం మీ కోసం..
Krodhi Naama Ugadi Pooja
Follow us on

ఉగాది సంబరాలు తెలుగు రాష్ట్రాలలో మొదలయ్యాయి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజు నుంచి తెలుగు సంవత్సరం మొదలు కానున్న నేపధ్యంలో ఉగాది రోజున కొత్త పనులను ప్రారంభిస్తారు. అంతేకాదు నేటి నుంచి వసంత ఋతువు మొదలఅవుతుంది. కొత్త సంవత్సరానికి.. కొత్త జీవితానికి స్వాగతం పలుకుతూ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా జరుపుకునే అసలు సిసలు పండగ ఉగాది. వివిధ పేర్లతో దేశంలో వివిధ ప్రాంతాల్లో జరుపుకునే ఈ పండగను మాత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణటక రాష్ట్రాల్లో మాత్రం ఉగాదిగానే పిలుస్తారు. దాదాపు ఒకే సాంప్రదాయ పద్దతిలో పండగను జరుపుకుంటారు.

ఆకులు రాల్చిన చెట్లు చిగుళ్ళు, కోయిల కువకువలతో వసంత ఋతువు ఆగమనాన్ని సంతోషంగా జరుపుకునే తోలి ఉత్సవం ఉగాది. సంప్రదాయాలు, ఆచార, వ్యవహారాలతో పాటు ఆరోగ్య రహస్యాలు, మానవ జీవిన విలువలను మేళవించిన పండగ ఉగాది. ఉగాది అనే పదం యుగాది నుంచి పుట్టిందని.. యుగాది అంటే సృష్టి ప్రారంభమైన రోజుని విశ్వాసం.

ఉగ అంటే నక్షత్ర గమనం. ఈ నక్షత్ర గమనానికి ఆది ఉగాది. చైత్రశుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టి ప్రారంభించాడని, వేదాలను అపహరించిన సోమకుని శ్రీ మహా విష్ణువు మత్య్సవతారంలో సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించిన రోజుని ఉగాది పండగగా జరుపుకుంటారని పురాణాల కథనం.

ఇవి కూడా చదవండి

తెలుగు నెలలు 60. నారదుడి పిల్లల పేర్ల మీదుగా తెలుగు నెలలు ఏర్పడ్డాయి. ఈ రోజు నుంచి క్రోధి నామ సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ సంవత్సరం 60 నెలల్లో 38వది.

ఈ రోజున ఇంటిని అలంకరించి మామిడి తోరణాలు, పువ్వులతో అందంగా కట్టాలి. ఇంటి ముందు ముగ్గులను రంగులతో అలంకరించాలి. ఉదయమే నువ్వుల నూనెతో అభ్యంగ స్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి.

ఈ రోజు ఏ దేవుడికి చెందిన రోజు కాదు.. కాలమే దైవం కనుక ఇష్ట దైవాన్ని, ఇంటి ఇలావేల్పుని పూజించాలి. ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడికి నైవేద్యం సమర్పించాలి.

వేప పువ్వుతో చేసిన పచ్చడిని దేవుడికి నైవేద్యంగా సమర్పించి ఆ ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించాలి. కుటుంబంలోని సభ్యులకు ఉగాది పచ్చడిని పంచాలి.

ఈ రోజు ఏ పని ప్రారంభించాలన్నా, కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా ఎటువంటి ముహర్తం చూడరు. ప్రతి క్షణం శుభముహార్తంగానే భావిస్తారు. పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి. ఆలయానికి వెళ్లి దైవాన్ని దర్శించుకోవాలి. ఆలయంలో జరిగే పంచాంగ శ్రవణాన్ని వినాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..