Janmashtami 2025: ఈ ఏడాది కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు? ఆగష్టు15నా? ఆగష్టు 16నా? బాల గోపాలుడిని పూజించే సమయం ఎప్పుడంటే

శ్రీ మహా విష్ణువు అవతారాల్లో ఒకటి శ్రీ కృష్ణ అవతారం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీ కృష్ణుడిగా అవతారం దాల్చాడు. ఆయన జన్మించిన రోజుని జన్మాష్టమి పండుగగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు రోజంతా ఉపవాసం ఉండి, నిషిత కాల సమయంలో రాత్రి బాల గోపాలుడి జన్మదినోత్సవాన్ని జరుపుకుంటారు. 2025 సంవత్సరంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి ఏ రోజున వచ్చిందో తెలుసుకుందాం..

Janmashtami 2025: ఈ ఏడాది కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు? ఆగష్టు15నా? ఆగష్టు 16నా? బాల గోపాలుడిని పూజించే సమయం ఎప్పుడంటే
Janmashtami 2025

Updated on: Jul 08, 2025 | 3:21 PM

హిందూ మతంలో ప్రతి పండుగకు దాని సొంత ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందువులు జరుపుకునే పండగలలో శ్రీ కృష్ణ జన్మాష్టమి ఒకటి. ఈ రోజున శ్రీ కృష్ణుడి పూజిస్తారు. ఉపవాసం పాటిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసం కృష్ణ పక్షం అష్టమి తిథి రోజున శ్రీ కృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు. ఈ రోజున నిషిత కాలంలో భగవంతుడిని పూజిస్తారు. పది అవతారాలలో విష్ణువు తొమ్మిదవ అవతారం శ్రీ కృష్ణుడు. ఈ రోజున శ్రీ కృష్ణుడి బాల రూపాన్ని పూజిస్తారు. 2025 సంవత్సరంలో కృష్ణ జన్మాష్టమి ,జన్మాష్టమి లేదా గోకులాష్టమి ఏ రోజున జరుపుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం..

హిందూ మతంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

జన్మాష్టమి 2025 తేదీ (జన్మాష్టమి 2025 తిథి)

ఇవి కూడా చదవండి

అష్టమి తిథి ఆగస్టు 15, 2025న రాత్రి 11:49 గంటలకు ప్రారంభమవుతుంది. అష్టమి తిథి ఆగస్టు 16, 2025న రాత్రి 9:34 గంటలకు ముగుస్తుంది. పగలు తిధిని పరిగణిస్తారు కనుక ఈ ఏడాది శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను ఆగష్టు 16వ తేదీన జరుపుకోవాల్సి ఉంటుంది.

అందుకే జన్మాష్టమి ఉపవాసం 2025 ఆగస్టు 16 శనివారం నాడు పాటిస్తారు.

ఈ రోజు నిషిత పూజ సమయం మధ్యాహ్నం 12:04 నుంచి 12:47 వరకు ఉంటుంది.

శ్రీ కృష్ణ జన్మాష్టమి ఉపవాసం ఆగస్టు 17న ఉదయం 5.51 గంటలకు ఆచరించవచ్చు.

శ్రీ కృష్ణ జన్మాష్టమి వ్రతం రోజున నిషిత కాలంలో అంటే రాత్రి సమయంలో శ్రీ బాలకృష్ణుడిని పూర్తి నియమ నిష్టలతో పూజించిన తర్వాత రోహిణి నక్షత్రం, అష్టమి తిథి ముగిసిన తర్వాత ఉపవాసం విరమించాలి. అష్టమి తిథి, రోహిణి నక్షత్రం ముగిసి.. సూర్యోదయం జరిగిన తర్వాత జన్మాష్టమి ఉపవాసాన్ని విరమించాలి.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.