Telugu News Spiritual Know These Abhishekas as per zodiac signs offer to lord Shiva On the day of Maha Shivaratri
Maha Shivaratri 2022: మహా శివరాత్రి నాడు ఏ రాశి వారు శివయ్యను ఎలా పూజించాలి.. అలా చేస్తే అన్ని శుభాలే..
పరమశివుడు భోళాశంకరుడిగా, భక్తవశంకరుడుగాను జగత్ ప్రసిద్ధి. నిండు మనస్సుతో పూజిస్తే సకలం అనుగ్రహించే దైవం శివుడు మాత్రమే. త్రిమూర్తులలోనే కాదు, సమస్త దేవతల్లోనూ శివుడు మాత్రమే భక్త సులభుడని భక్తుల నమ్మకం. అంతటి భక్తవరదుడికి..
Shiva Abhishekam
Follow us on
Maha Shivaratri: అనంత కోటి జీవ ప్రాణులలో ఉండే తత్త్వమే దైవం(God).. జగమంత శివోహం శివమయం. పరమశివుడు భోళాశంకరుడిగా, భక్తవశంకరుడుగాను జగత్ ప్రసిద్ధి. నిండు మనస్సుతో పూజిస్తే సకలం అనుగ్రహించే దైవం శివుడు మాత్రమే. త్రిమూర్తులలోనే కాదు, సమస్త దేవతల్లోనూ శివుడు మాత్రమే భక్త సులభుడని భక్తుల నమ్మకం. అంతటి భక్తవరదుడికి ఎలా పూజించాలో తెలుసుకుంటే మంచిది. అయితే శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసిన, సంతోషంతో పొంగిపోతాడు. శివరాత్రి నాడు శివుడిని అర్చించడం వలన, అభిషేకించడం వలన సదాశీవుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది. మహాశివుడిని ఈ అభిషేకాలతో సంతృప్తి పరచడం వలన అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు.. ధనధాన్యాలు ప్రాప్తిస్తాయి. ఆ కుటుంబాలు తరతరాలపాటు సకల శుభాలతో అలరారుతుంటాయి. అంతే కాకుండా, మోక్షానికి అవసరమైన అర్హతను ప్రసాదిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అయితే మీ రాశి ప్రకారం.. మీరు శివదేవుడిని ఆరాధిస్తే.. శివున్ని ప్రసన్నం చేసుకోవచ్చు
మేషం: ఈ రాశి వారు మహాశివరాత్రి రోజు శివుడిని బెల్లంతో, ఎర్రటి పువ్వులతో, ఎర్ర చందనంతో పూజించాలటం మంచిది.
వృషభం: మహాశివరాత్రి నాడు వృషభరాశి వారు శివుని దేశీ ఆవు పాలు కలిపిన నీటితో అభిషేకం చేయాలి.. అనంతరం మల్లెపూలు సమర్పించి.. శివ నామస్మరణ చేయాలి.
మిథునం: ఈ రాశి వారు మహాశివరాత్రి రోజున శివ లింగానికి ఉమ్మెత్త పువ్వులతో (దాతురా) , పెరుగు కలిపిన నీటిని సమర్పించాలటం ఉత్తమం. దీనితో పాటు పంచాక్షర మంత్రం “ఓం నమః శివాయ” జపం చేయాలి.
కర్కాటకం: మహాశివరాత్రి రోజు కర్కాటక రాశి వారు శివునికి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించి చందన పరిమళాన్ని కూడా సమర్పించాలనుకుంటున్నారు.
సింహం: ఈ రాశి వారు ఎర్రటి పూలతో పూజించాలి. వారికి నెయ్యి దీపం వెలిగించి.. శివ చాలీసా పఠించండం ఉత్తమం అని శాస్త్రం చెబుతోంది.
కన్య: ఈ రాశి వారు శివునికి బిల్వపత్రం, ఉమ్మెత్త, నల్లని నువ్వులు, గంగాజలంతో పూజించాలి. “ఓం నమః శివాయ” అంటూ శివుడికి స్మరించడం వల్ల శుభాలు కలుగుతాయి.
తుల: మహాశివరాత్రి రోజు ఆవు పాలలో చక్కెరను కలిపి శివునికి అభిషేకం చేయండి. నీటిలో విభూది వేసి శివునికి అభిషేకం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల అనేక ప్రయోజనం లభిస్తాయి.
వృశ్చికం: వృశ్చిక రాశి వారు మహాశివరాత్రి రోజు శివునికి బిల్వపత్రం, ఎర్ర గులాబీలు సమర్పించి పూజించాలి. శివ రుద్రాష్టకం పఠించడం మరీ మంచిది.
ధనుస్సు: ఈ రాశి వారు మహాశివరాత్రి నాడు పసుపు, గులాల్ మొదలైన వాటితో మహాదేవుని పూజించాలి.
మకరం: మహాశివరాత్రి రోజు ఈ రాశివారు ఉమ్మెత్త పూలతో శివుని పూజించాలి.
కుంభం: ఈ రాశి వారు శివునికి పూలు, చెరుకు రసం సమర్పిస్తే ఆదాయం పెరుగుతుంది.
మీనం: మీన రాశి వారు శివునికి చెరుకు రసం, కుంకుమ, పసుపు, పంచామృతాలతో పూజించాలి. జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి.