Tirumala Ratha Saptami: ఈ ఏడాది తిరుమ‌ల‌లో ఏకాంతంగా రథసప్తమి వేడుకలు… ఆర్జిత సేవలు రద్దు..

|

Feb 05, 2022 | 7:31 PM

Tirumala Ratha Saptami 2022: ఆంధ్రపదేశ్(Andhrapradesh) లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి (Tirumala Tirupati) రథ సప్తమి( Ratha Saptami) వేడుకలకు ముస్తాబవుతుంది. కరోనా నిబంధనలను..

Tirumala Ratha Saptami: ఈ ఏడాది తిరుమ‌ల‌లో ఏకాంతంగా రథసప్తమి వేడుకలు... ఆర్జిత సేవలు రద్దు..
Tirupati Ratha Saptami 2022 Celebrations
Follow us on

Tirumala Ratha Saptami 2022: ఆంధ్రపదేశ్(Andhrapradesh) లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి (Tirumala Tirupati) రథ సప్తమి( Ratha Saptami) వేడుకలకు ముస్తాబవుతుంది. కరోనా నిబంధనలను పాటిస్తూ వేడుకలను నిర్నివహించడానికి టీటీడీ సిద్ధమవుతోంది. సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 8న తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో రథసప్తమి పర్వదినం ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఇలా ఏకాంతంగా రథ సప్తమి వేడుకలు నిర్వహించడం టిటిడీ చరిత్రలో ఇదే తొలిసారని తెలుస్తోంది. . కోవిడ్ – 19 నిబంధ‌న‌ల మేర‌కు ఫిబ్రవరి 8న రథ సప్తమి రోజు వాహన సేవలను శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నామని టిటిడీ అధికారులు ప్రకటించారు.

గత ఏడాది ఆలయం బయటే వాహన సేవలు ఊరేగింపు నిర్వహించిన టీటీడీ.. ఈ సారి ఏకాంతంగా స్వామివారికి వాహన సేవలను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 8వ తేదీన శ్రీవారు సప్తవాహనాల్లో మాడ వీధుల్లో ఊరేగనున్నారు. రథ సప్తమి వేడుకలలో భాగంగా స్వామివారి 6 గం.ల నుంచి 8.00 గం.ల వరకు సూర్యప్రభ వాహనంపై ఊరేగనున్నారు. అనంతరం ఉదయం 9.00 గం.ల నుంచి 10 .00 గం.ల వరకూ చిన్నశేష వాహన వేడుకలను నిర్వహించనున్నారు. ఉదయం 11.00 గం.ల నుంచి 12 .00 గం.ల వరకూ గరుడ వాహన సేవ, మధ్యాహ్నం 1.00 గం.ల నుంచి 2 .00 గం.ల వరకూ హనుమంత వాహన సేవ, నిర్వహించనున్నారు. సాయంత్రం 4.00 గం.ల నుంచి 5 .00 గం.ల వరకూ కల్పవృక్ష వాహన సేవ, 6.00 గం.ల నుంచి 7 .00 గం.ల వరకూ సర్వభూపాల వాహన సేవ, అనంతరం రాత్రి 8.00 గం.ల నుంచి 9 .00 గం.ల వరకూ చంద్రప్రభ వాహన సేవను నిర్వహించనున్నామని టిటిడీ అధికారులు తెలిపారు. రాత్రి జరిగే చంద్రప్రభ వాహనం ఉరేగింపుతో రథసప్తమి వేడుకలు ముగుస్తాయి. ఇక మధ్యాహ్నం 2.00 గం.ల నుంచి 3.00 గం.ల వరకు (రంగనాయకుల మండపంలో గంగాళంలో నిర్వ‌హిస్తారు ) చక్రస్నానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోన్న సంగతి తెలిసిందే.

ఆర్జిత సేవలు రద్దు :

రథ సప్తమి వేడుకల్లో భాగంగా ఈ పర్వదినం రోజున ఆలయంలో నిర్వహించే వ‌ర్చువ‌ల్ ఆర్జిత సేవ‌లైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

Also Read:

భార్యాభర్తల మధ్య ఈ విషయాల ప్రస్తావన రాకూడదు.. వచ్చిందంటే బంధం బలహీనం..?