Motivational Thoughts: వివేకం, విచక్షణ .. మనిషి జీవితంలో వీటి ప్రాముఖ్యత.. సక్సెస్ లో వీటి పాత్ర ఏమిటో తెలుసా..

|

Nov 24, 2022 | 9:00 AM

వివేకం, విచక్షణ కలిగిన వ్యక్తి .. ఇతరులు తనను రెచ్చగొట్టినా ఎప్పుడూ కోపం తెచ్చుకోడు. ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచించడు. ఆత్మజ్ఞానం, ఆత్మనిగ్రహం, భక్తి మొదలైన వాటి ద్వారానే మనిషి పరమాత్మను దర్శించగలడు.

Motivational Thoughts: వివేకం, విచక్షణ .. మనిషి జీవితంలో వీటి ప్రాముఖ్యత.. సక్సెస్ లో వీటి పాత్ర ఏమిటో తెలుసా..
motivational thoughts Discretion
Follow us on

వివేకం అనేది.. రుచులలో ఉప్పు వంటిది. ఊహ దాని మాధుర్యం. ప్రతి మనిషి వివేకం, విచక్షణ కలిగి ఉండాలి. విచక్షణ అనేది జీవితంతో ముడిపడి ఉన్న గొప్ప నాణ్యత. దీని అవసరం ప్రతి వ్యక్తికి జీవితాంతం ఉంటుంది. మనస్సాక్షి అనే గుణం లేని వ్యక్తి జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండలేడు. విచక్షణ  అతిపెద్ద గుర్తింపు ఏమిటంటే..  వివేకం గల వ్యక్తి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడు. వివేకం, విచక్షణ కలిగిన వ్యక్తి .. ఇతరులు తనను రెచ్చగొట్టినా ఎప్పుడూ కోపం తెచ్చుకోడు. ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచించడు. ఆత్మజ్ఞానం, ఆత్మనిగ్రహం, భక్తి మొదలైన వాటి ద్వారానే మనిషి పరమాత్మను దర్శించగలడు. మానవ జీవితంలో విచక్షణ ప్రాముఖ్యత..  సక్సెస్ సూత్రాల గురించి ఈరోజు తెలుసుకుందాం..

  1. ఆరాధనతో  జ్ఞానం ఉద్భవిస్తుంది. వివేకం ఉన్న వ్యక్తికి క్షణికావేశంలో దుఃఖం, సంతోషం ఏర్పడవు.
  2. వివేకం వ్యక్తి ప్రకాశిస్తూ ఉంటాడు. ఏ విధంగా అంటే.. బంగారంతో పొదిగిన రత్నం ఎంత అందంగా ఉంటుందో అదే విధంగా .. వివేకం, విచక్షణ వంటి  సద్గుణాలు ఉన్న వ్యక్తి ప్రకాశిస్తూ ఉంటాడు.
  3. కోపం మనిషి జీవిత ప్రయాణంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కనుక మనిషి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే మనస్సాక్షి నాశనం అయినప్పుడు.. మనిషి జీవితంపై తీవ్ర ప్రభావము చూపిస్తుంది.
  4. విచక్షణకు సంబంధించిన నియమాలను నేర్చుకున్నా.. వాటిని జీవితంలో అమల్లో పెట్టని వ్యక్తి.. తన పొలాన్ని దున్ని.. నీరు పట్టి.. పంటకు అనుకూల పరిస్థితిలు ఏర్పరచి.. ఆ పొలంలో విత్తనాలు వేయని రైతు వంటి వ్యక్తి..
  5. ఇవి కూడా చదవండి
  6. అంధుడికి అద్దంఏ విధంగా పని చేయదో.. అదే విధంగా విచక్షణ లేని వ్యక్తి ఎన్ని రకాల పుస్తకాలు చదివినా,, జ్ఞానాన్ని సంపాదించినా అది నిరర్ధకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)