Vastu Rules: నీరు ప్రాణకోటి జీవనాధారం. ఇది లేకుండా భూమిపై దాదాపుగా ఏ జీవి బతకదు. అంతేకాదు నీరు లేకుండా ఏ శుభకార్యం జరగదు. అందుకే నీటికి కూడా వాస్తు తప్పనిసరి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు నిర్మించేటప్పుడు నీటికి సంబంధించిన వాస్తు నియమాలు విస్మరిస్తారు. అందుకే ఎల్లప్పుడు అక్కడ ఏదో ఒక సమస్య ఉంటుంది. నీటికి సంబంధించిన వాస్తు దోషాల వల్ల ధనవంతులు పేదలుగా మారుతారు. ఇంటి గృహిణులు ఎల్లప్పుడూ అనారోగ్యంతో ఉంటారు. డబ్బు నీరులా ఖర్చవుతుంది. అందుకే నీటికి సంబంధించి ఈ నియమాలు తెలుసుకోవడం అవసరం.
1. వాస్తు ప్రకారం.. బావులు, గొట్టపు బావులు, ఈత కొలనులు ఎల్లప్పుడూ ఈశాన్యంలో ఉండాలి.
2. వాస్తు నియమాల ప్రకారం.. ఈశాన్యంలో బావిని తవ్వడం చాలా శ్రేయస్కరం. అన్ని రకాల సంపద పెరుగుతుంది.
3. వాస్తు శాస్త్రం ప్రకారం.. దక్షిణ దిశలో బావి లేదా గొట్టపు బావిని నిర్మిస్తే ఇంటి స్త్రీ బాధపడుతుంది.
4. వాస్తు ప్రకారం.. నైరుతి దిశలో బావి లేదా బోరింగ్ మొదలైనవి ఉండటం ఇంటి అధిపతికి చాలా హానికరం.
5. వాస్తు శాస్త్రం ప్రకారం.. పశ్చిమ దిశలో బావి లేదా బోరింగ్ మొదలైనవి ఉండటం వల్ల శత్రువుల భయం పెరుగుతుంది.
6. వాస్తు శాస్త్రం ప్రకారం.. మీరు ఇంట్లో నీటి ట్యాంక్‌ను ఏర్పాటు చేయాలనుకుంటే వాయవ్య, నైరుతి, ఆగ్నేయ, దక్షిణ దిశలో చేయడం మర్చిపోవద్దు.
7. వాస్తు ప్రకారం.. భూగర్భంలో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయాలంటే ఈశాన్యం ఉత్తమ ప్రదేశం.
8. వాస్తు ప్రకారం.. ట్యాంక్ పై కప్పు ఉత్తర, దక్షిణ, ఆగ్నేయ కోణాలలో నిర్మించకూడదు.
9. వాస్తు ప్రకారం.. ఈశాన్యం నుంచి ఇంటిలోని మొత్తం నీరు బయటకు వచ్చేలా ప్రయత్నించండి.
10. వాస్తు నియమాల ప్రకారం.. బాత్రూమ్ నీరు కూడా ఈశాన్య దిక్కున ప్రవహించాలి.
ఈ సమాచారం మత విశ్వాసాలు, జానపద నమ్మకాలపై ఆధారపడి ఉంటుందని గుర్తించండి.