Vastu Tips: ఇంటి నిర్మాణంలో వాస్తు దోషాలున్నాయా..! జాగ్రత్త.. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ఎఫెక్ట్

|

Oct 11, 2021 | 12:41 PM

Vastu Tips: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు.. కోట్ల సంపాదన ఉన్నా ఆరోగ్యంగా లేకుంటే దానిని అనుభవించలేరు. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధ్యం.

Vastu Tips: ఇంటి నిర్మాణంలో వాస్తు దోషాలున్నాయా..! జాగ్రత్త.. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ఎఫెక్ట్
Vastu
Follow us on

Vastu Tips: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు.. కోట్ల సంపాదన ఉన్నా ఆరోగ్యంగా లేకుంటే దానిని అనుభవించలేరు. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధ్యం. అందుకే ఈ ప్రపంచంలో డబ్బులు, ధనం ఉన్నవారు అదృష్టవంతులు కాదు మంచి ఆరోగ్యం ఎవరైతే సంపాదిస్తారో వారే అదృష్టవంతులు. అయితే ఇంటి నిర్మాణం చేసేటప్పుడు వాస్తు దోషాలు చేయకూడదు. ఎందుకంటే ఈ ఎఫెక్ట్ ధీర్ఘకాలికంగా ఇంటిలోని కుటుంబ సభ్యులపై పడుతుంది. వాస్తుకు సంబంధించి ఇలాంటి తప్పులు చేయకండి.

1. వాస్తు శాస్త్రం ప్రకారం ఏ ఇంటికైనా సరిహద్దు గోడ తూర్పు, ఈశాన్యం వైపు తక్కువగా ఉండాలి. దీంతో మీ ఇంట్లోకి సూర్యకాంతి సులభంగా ప్రవేశించగలదు.
2. వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిక్కులో ఏ విధమైన వాస్తు దోషం ఉండకూడదు. లేదంటే ఇంట్లో పిల్లలు వికలాంగులుగా పుట్టే అవకాశం ఉంది. అంతేగాక యజమాని పెద్ద కుమారుడు అనారోగ్యం బారిన పడుతాడు.
3. వాస్తు శాస్త్రం ప్రకారం భవనం తూర్పు దిశలో ఉన్నప్పుడు ఇంటి ముందర భవనం ఎత్తుగా ఉన్నా లేదా చెత్త, రాళ్లు, మట్టి గుట్టలు ఉంటే ఆ ఇంట్లో నివసించే వ్యక్తులు కంటి వ్యాధులు, పక్షవాతానికి గురవుతారు.
4. వాస్తు ప్రకారం తూర్పు దిశలో భూగర్భ వాటర్ ట్యాంక్, బావి లేదా బోర్ ఉండటం తల్లి, కొడుకు ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుంది.
5. వాస్తు శాస్త్రం ప్రకారం మీ బెడ్‌రూమ్ పైన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉంటే అది ఖచ్చితంగా పెద్ద వాస్తు దోషాన్ని సృష్టిస్తుంది. దీని కారణంగా ఆ గదిలో నిద్రిస్తున్న వ్యక్తి ఎల్లప్పుడూ ఒత్తిడికి లోనవుతాడు. అతనికి డిప్రెషన్ సమస్య కూడా ఉంటుంది.

ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, జానపద నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవని గుర్తించండి. సాధారణ పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని మాత్రమే రాయడం జరిగింది.

AIBE16 Admit Card 2021: ఈ రోజు ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ విడుదల.. ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే..?