
తుర్కియేలోని పురాతన నగరమైన హిరాపోలిస్‌లో ఒక ఆలయం ఉంది. ఇక్కడకు ఎవరు వెళ్ళినా వారి మరణం ఖాయం. అందుకే ఈ ఆలయాన్ని నరక ద్వారం అని కూడా పిలుస్తారు. ఎవరైనా అక్కడికి వెళితే, వారు సజీవంగా తిరిగి రారు. ఆ ఆలయంలోని దేవతల కోపం వల్లే ఇలా జరుగుతుందని స్థానికుల నమ్మకం.
ఈ ఆలయ రహస్యం 2018లో బయటపడింది. వాస్తవానికి. టర్కీలోని పురాతన నగరం హిరాపోలిస్ భారతదేశం నుంచి వెళ్ళే పర్యాటకులకు మాత్రమే కాదు విదేశాల నుంచి వెళ్ళే పర్యాటకులకు ఆకర్షణ కేంద్రంగా ఉండేది. పురావస్తు శాస్త్రంలో ఆసక్తి ఉన్నవారు అక్కడికి వెళ్ళేవారు. అయితే ఆలయానికి వెళ్లి వచ్చిన తర్వాత వారి జాడ కనిపించలేదట. ఈ ఆలయాన్ని ఎవరూ సందర్శించినట్లు ఎటువంటి జాడ లేదు. ఇక్కడికి వెళ్ళే ఎవరైనా చనిపోతారని నమ్మకం. ఆలయం దగ్గరకు వెళ్ళే మనుషులే కాదు, జంతువులు, పక్షులు కూడా చనిపోతాయని చెబుతున్నారు. అందుకనే ఈ ఆలయం రహస్యంగా మారింది.
ఈ ఆలయాన్ని ప్లూటో ఆలయం అని పిలుస్తారు. కొంతమంది దీనిని మృత్యుదేవత ఆలయం అని పిలుస్తారు. మరణాల కారణంగా స్థానిక ప్రజలు ఈ ఆలయం దగ్గరకు వెళ్లడం మానేశారు. పర్యాటకులను అక్కడికి వెళ్ళడానికి అనుమతించలేదు. ఆలయ ద్వారం వద్ద పక్షులను బోనుల్లో ఉంచడం ద్వారా ఈ ఆలయం మృత్యుదేవత ఆలయం అని.. ఇక్కడ మృత్యుదేవత నివసిస్తోందని నిరూపించారని చెబుతున్నారు. ఎందుకంటే ఈ ఆలయం వద్ద ఏ పక్షిని ఉంచినా కొన్ని క్షణాల్లోనే చనిపోతుందని చెబుతారు.
క్రమంగా ఈ ప్రదేశం ప్రాణాంతక ఆలయంగా మారింది. అంటే ఈ ప్లూటో ఆలయం ప్రజలకు ప్రమాదకరంగా మారింది. అయితే ఈ ఆలయ చరిత్ర గురించి పెద్దగా సమాచారం పురావస్తు శాస్త్రవేత్తలు తెలుసుకోలేకపోయారు. రోమన్ పురాణాల ప్రకారం ఈ ఆలయంలో ఉన్న దేవుడు ప్లూటో భూమి క్రింద నివసిస్తున్నాడని నమ్మకం. కొంతమంది ఇది మూఢనమ్మకం అంటారు. మరికొందరు దీనిని నరకానికి ద్వారం అని పిలుస్తారు. ఏది ఏమైనా ఈ ఆలయంలోకి ప్రవేశించడానికి నేటికీ ప్రజలు భయపడతారు.
ఈ ఆలయ రహస్యాన్ని 2018 లో బయల్పడింది. ఈ ఆలయం గురించి పరిశోధన చేసిన పురాతన గ్రీకు భౌగోళిక శాస్త్రవేత్త స్ట్రాబో కూడా .. ఈ ఆలయం లోపలి ఎవరు వెళ్ళినా సజీవంగా తిరిగి రాలేరని అంగీకరించారు. స్ట్రాబో ఆలయం లోపలకి ఒక పక్షిని పంపాడు. అది కొద్దిసేపటికే చనిపోయింది. అయితే గుహలో 91 శాతం ఉన్న కార్బన్ డయాక్సైడ్ దీనికి కారణమని అతను చెప్పాడు.
స్థానిక ప్రజలు ఈ ప్రదేశంలో బలులు అర్పించేవారని…అందుకే ఈ ప్రదేశం తవ్వకాలలో జంతువులు, పక్షుల అస్థిపంజరాలు బయటపడ్డాయని, ఇది నరకానికి ద్వారం అని నమ్ముతారు. ఇప్పుడు ఈ ఆలయానికి సంబందించిన నమ్మకం.. సైన్స్ , నమ్మకాల మధ్య పోరాటంగా మారింది. కారణం ఏదైనా కావచ్చు.. ఇక్కడకి వెళ్ళిన వారు నేటికీ తిరిగి రాలేదనేది నిజం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు