kharmas 2023: ఈ నెల 16 నుంచి ఖర్మ సమయం ప్రారంభం.. శుభకార్యాలకు విరామం.. ఎందుకంటే

|

Dec 14, 2023 | 3:32 PM

హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం సూర్యభగవానుడు 16 డిసెంబర్ 2023 గురువారం మధ్యాహ్నం 3:47 నుండి ధనుస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో ఖర్మలు ప్రారంభమవుతాయి. ఈ ఖర్మ సమయం ఒక నెల పాటు కొనసాగుతుంది. జనవరి 15, 2024న ముగుస్తుంది. ఖర్మ సమయంలో వివాహం, గ్రహ ప్రవేశం, నిశ్చితార్ధం, గృహ నిర్మాణం మొదలైన శుభ కార్యాలు నిషేధించబడ్డాయి.

kharmas 2023: ఈ నెల 16 నుంచి ఖర్మ సమయం ప్రారంభం.. శుభకార్యాలకు విరామం.. ఎందుకంటే
Kharmaas 2023
Follow us on

హిందూమతంలో గ్రహాలకు .. వాటి గమనానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. నవ గ్రహాలకు అధినేత  సూర్యుడు మీన రాశిలో లేదా ధనుస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సమయం  ఖర్మలకు నాందిగా పరిగణించబడుతుంది. కనుక ఖర్మ సమయంలో శుభకార్యాలు చేయడం హిందూ గ్రంధాలలో నిషిద్ధంగా పేర్కొన్నారు. దేవశయని ఏకాదశి రాకతో చాతుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని నమ్మకం. ఖర్మ సమయం ముగిసిన తరువాత శుభకార్యాలు తిరిగి దేవుని ఏకాదశి నుండి ప్రారంభమవుతాయి.

హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం సూర్యభగవానుడు 16 డిసెంబర్ 2023 గురువారం మధ్యాహ్నం 3:47 నుండి ధనుస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో ఖర్మలు ప్రారంభమవుతాయి. ఈ ఖర్మ సమయం ఒక నెల పాటు కొనసాగుతుంది. జనవరి 15, 2024న ముగుస్తుంది. ఖర్మ సమయంలో వివాహం, గ్రహ ప్రవేశం, నిశ్చితార్ధం, గృహ నిర్మాణం మొదలైన శుభ కార్యాలు నిషేధించబడ్డాయి.

వివాహానికి శుభ సమయం ఎప్పుడంటే?

జ్యోతిష్యం ప్రకారం సంవత్సరానికి రెండు సార్లు ఖర్మాలు వస్తాయి. సూర్యుడు.. బృహస్పతి రాశి మీన రాశి లేదా ధనుస్సు రాశిలోకి ప్రవేశించగానే ఖర్మాలు మొదలవుతాయి. ఖర్మ సమయంలో ఎలాంటి శుభ కార్యాలు నిర్వహించరు. జనవరిలో వివాహానికి అనుకూలమైన సమయాలు 18, 20, 21, 22, 27, 28, 30, 31. ఫిబ్రవరిలో శుభ ముహూర్తాలు 1, 3, 4, 5, 6, 7, 8, 12, 13, 18, 19, 24, 25, 26లతో పాటు 27 తేదీలు.

ఇవి కూడా చదవండి

జ్యోతిషశాస్త్రంలో శుభ, అశుభ సమయాలు గ్రహాలు, నక్షత్రాల స్థానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అందువల్ల ఏదైనా శుభ కార్యాన్ని లేదా కొత్త పనిని ప్రారంభించే ముందు ఉత్తమ సమయాన్ని చూస్తారు.  సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ధను సంక్రాంతి అంటారు. ధనుస్సు రాశిలో సూర్యుని ప్రవేశం విశేష ఫలితాలను ఇస్తుంది.

ఖర్మలలో వివాహాలు ఎందుకు చేయరంటే?

డిసెంబర్ 16న అంటే శుక్రవారం నుంచి ఖర్మాలు మొదలు కానున్నాయి. విశ్వాసాల ప్రకారం ఎవరైనా ఖర్మలో వివాహం చేసుకుంటే.. ఆ దంపతుల వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడవచ్చు. కుటుంబంలో కలహాలు పెరిగి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడవచ్చు. ఈ నమ్మకాలను పరిగణనలోకి తీసుకుని..  ఖర్మలలో వివాహాలు నిషేధించబడ్డాయి.

ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడిని ఆరాధించడం ద్వారా సాధకుడికి సుఖం, శాంతి, శ్రేయస్సు లభిస్తాయని విశ్వాసం. శ్రీ మహా విష్ణువును పూజించడం వల్ల సర్వపాపాలు నశిస్తాయి. దీనితో పాటు, కీర్తి , అదృష్టం కూడా లభిస్తాయి. ఈ ధనుర్మాసంలో గోమాతకు, గురుదేవులకు, ఋషులకు సేవ చేయడం విశిష్ట ఫలితాలు ఇస్తుందని హిందువుల నమ్మకం. సూర్యుడిని రోజూ అర్ఘ్యన్ని సమర్పించండి. మీ శక్తి మేరకు పేదలకు దానం చేయండి.

ఖర్మ సమయంలో ఏమి చేయకూడదంటే?

ఖర్మ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు. తామసిక ఆహారాన్ని తినవద్దు. ఎవరితోనూ వాదించవద్దు. జ్యోతిష్యుల ప్రకారం ఖర్మ సమయంలో కుమార్తెను, కోడలిని మరొక ఇంటికి పంపించవద్దు. ఇలా చేయడం అశుభంగా పరిగణిస్తారు. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించవద్దు. దైవ దూషణ చేయవద్దు.  పక్షులను హింసించవద్దు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు