
మకర సంక్రాంతి పర్వదినాన శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. పొన్నంబలమేడు కొండల్లో గురువారం సాయంత్రం.. మకర జ్యోతి కనిపించింది. జ్యోతి దర్శనం కోసం ప్రతి ఏడాది మాదిరిగానే భారీ సంఖ్యలో భక్తులు శబరిమల చేరుకున్నారు. అయ్యప్ప భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. మకర జ్యోతి దర్శనం కాగానే.. శరణు ఘోసతో శబరిమల సన్నిధానం మార్మోగింది. మకర సంక్రాంతి రోజున జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనం ఇస్తాడని భక్తులు నమ్ముతారు. దీంతో జ్యోతి దర్శనం ఇవ్వగానే భక్తులు ఆనంద పరవశానికి లోనయ్యారు.
సాయంత్రం 6.51 గంటల సమయంలో మకర జ్యోతి దర్శనం ఇచ్చిందని ట్రావెన్‌కోర్ దేవస్థానం తెలిపింది.
ఇవి కూడా చదవండి: Video: యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ‘బేబీ షార్క్’ వీడియో..10 మిలియన్ల వ్యూస్ క్రాస్.. మీరు చూశారా..
Gmailలో ఈ ఫీచర్‌ని ఎప్పుడైనా ఉపయోగించారా.. ఇందులో నుంచి సీక్రెట్ ఇమెయిల్ పంపవచ్చు తెలుసా..