Kartika Purnima 2024: ఈ ఏడాది కార్తీక పౌర్ణమి రోజున అరుదైన యోగాలు.. వీటిని దానం చేయడం వలన కోటి జన్మల ఫలం..

|

Nov 11, 2024 | 5:46 PM

ప్రతి నెలా వచ్చే పౌర్ణమి తిధిలో అత్యంత విశిష్టత కలిగింది కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి తిధి. ఈ ఏడాది కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేక యాదృచ్చికాలు ఏర్పడనున్నాయి. దీంతో ఈ సంవత్సరం, కార్తీక పూర్ణిమ రోజున చేసే పూజలు , స్నానం దానం వలన అనేక రకాల ఫలితాలను పొందుతారు. జీవితంలో ఏర్పడే సమస్యల నుంచి ఉపశమనం పొందడంతో పాటు ఇంట్లో సంతోషాన్ని పొందుతారు.

Kartika Purnima 2024: ఈ ఏడాది కార్తీక పౌర్ణమి రోజున అరుదైన యోగాలు.. వీటిని దానం చేయడం వలన కోటి జన్మల ఫలం..
Kartika Purnima 2024
Follow us on

కార్తీక పౌర్ణమి హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఒకటి. ఈ రోజున ఆకాశంలో చంద్రుడు పూర్తి ప్రకాశంతో ప్రకాశిస్తూ దర్శనం ఇస్తాడు. ఆ రోజు రాత్రి సమయంలో కూడా కాంతి వాతావరణం ఉంటుంది. అందుకే దీనిని దీపాల పండుగ అని కూడా అంటారు. కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన పండుగగా పరిగణించబడుతుంది. ఈ రోజున విష్ణువు, శివుని పూజిస్తారు. ఈ రోజున పూజించడం దానం చేయడం వల్ల అనేక రెట్లు పుణ్యం లభిస్తుంది. ఈ రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా ఆశించిన ఫలితాలను పొందుతారు. ఈ రోజున స్నానం, దానం, పూజలు చేస్తే సర్వపాపాలు నశించి మోక్షం లభిస్తుందని విశ్వాసం.

కార్తీక పౌర్ణమికు సంబంధించి అనేక పురాణ కథలు ఉన్నాయి. ఈ రోజున శ్రీకృష్ణుడు గీతా ప్రబోధించినట్లు ఓ నమ్మకం. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో కార్తీక పూర్ణిమను వివిధ రకాలుగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు నదులలో స్నానాలు చేస్తారు, దీపాలు దానం చేస్తారు. ప్రత్యెక పూజలను చేస్తారు. ఈ రోజు దానం చేయడం వలన చాలా పుణ్యం లభిస్తుందని ఓ నమ్మకం. ఈ రోజున విష్ణువు లక్ష్మీదేవి లతో పాటు శివుడుని పూజిస్తారు. అయితే ఈ ఏడాది కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేక యాదృచ్ఛికం ఏర్పడుతోంది.

పంచాంగం ప్రకారం కార్తీక మాసంలోని పౌర్ణమి తిధి నవంబర్ 15న ఉదయం 06:19 గంటలకు ప్రారంభమై నవంబర్ 16న తెల్లవారుజామున 02:58 గంటలకు ముగుస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున తెల్లవారుజామున 04.58 నుంచి 5.51 గంటల మధ్యలో స్నానమాచరించి దానం చేయడం శుభప్రదం. ఉదయం 06.44 గంటల నుంచి 10.45 గంటల మధ్యలో సత్యనారయణ స్వామిని పూజించడం శుభప్రదం.

ఇవి కూడా చదవండి

కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేక యాదృచ్చికాలు

కార్తీక పౌర్ణమి రోజున చంద్రుడు.. కుజుడు ఒకరి రాశిలో మరొకరు ఉంటారు. దీంతో ఈ రోజున అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి. కార్తీక పౌర్ణమి నాడు అర్థరాత్రి గజకేసరి రాజయోగం ఏర్పడుతోంది. ఈ రోజున బుధాదిత్య రాజ్యయోగం కూడా ఏర్పడుతోంది. ఆ త‌ర్వాత 30 ఏళ్ల త‌ర్వాత కార్తీక పౌర్ణమి నాడు శ‌శ రాజ‌యోగం ఏర్పడుతుంది. శని 30 సంవత్సరాల తర్వాత కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అటువంటి పరిస్థితిలో కార్తీక పౌర్ణమి రోజున మీరు కొన్ని పనులు చేసినా, దానాలు చేసినా అనేక రకాల ఫలితాలు లభిస్తాయి.

ఏ వస్తువులను దానం చేయాలంటే

  1. ఆహారం: పేదలకు అన్నదానం చేయడం ఉత్తమమైనది.
  2. బట్టలు: అవసరమైన వారికి బట్టలు దానం చేయండి.
  3. డబ్బు: మీ సామర్థ్యం మేరకు డబ్బును విరాళంగా ఇవ్వండి.
  4. ఫలం: పండ్లను దానం చేయడం వల్ల కూడా పుణ్యం వస్తుంది.
  5. నువ్వులు: కార్తీక పూర్ణిమ రోజున నువ్వులను దానం చేయండి.
  6. బెల్లం: బెల్లం దానం చేయడం వల్ల ఇంట్లోని దారిద్య్రం కూడా తొలగిపోతుంది.

కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యత

కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానమాచరిస్తారు. నదీ తీరం వద్ద దీపాలు వెలిగిస్తారు. కార్తీక పూర్ణిమ రోజున దీపదానం చేయడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ రోజున నదిలో, చెరువులో దీపాలను విడిచి పెట్టడం వలన అన్ని రకాల సమస్యలు తొలగిపోయి రుణ విముక్తులు అవుతారని విశ్వాసం. కార్తీక పౌర్ణమి రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద మామిడి ఆకులతో చేసిన తోరణం కట్టడం మంచిది. అంతేకాదు ఇంటి చుట్టూ దీపాలు వెలిగించండి. ఇలా చేయడం వలన జీవితంలో కలిగే అడ్డంకులు తొలగి సంతోషంగా ఉంటారు.

 

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.