Srisailam Temple: కార్తీక శోభను సంతరించుకున్న శ్రీశైలం.. కన్నులపండువగా జరిగిన లక్షదీపోత్సవం

|

Nov 15, 2022 | 9:51 AM

శ్రీశైలంలో వైభవంగా కార్తీకమాస లక్షదీపోత్సవం కన్నులపండువగా సాగిన పుష్కరిణి హరతులలో పాల్గొన్న శ్రీశైల దేవస్థానం చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, ఆలయ ఈవో లవన్న

Srisailam Temple: కార్తీక శోభను సంతరించుకున్న శ్రీశైలం.. కన్నులపండువగా జరిగిన లక్షదీపోత్సవం
Srisailam Karthika Shobha.
Follow us on

కార్తీకమాసం సందర్భంగా ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది. మల్లన్నను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం,దశ హారతులిచ్చారు కార్తికమాస మూడోవ సోమవారం కావడంతో పుష్కరిణి వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో లక్షదీపోత్సవం కన్నులపండువగా జరిగింది పుష్కరిణి వద్ద ప్రత్యేక వేదికపై భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను ఆశీనులను చేసి అర్చకులు వేదపండితులు దీపోత్సవ సంకల్పాన్ని పఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఉత్సవ మూర్తులకు పుష్కరిణికి శాస్త్రోక్తంగా దశ హరతులిచ్చి భక్తులను దీవించారు దశ హారతులను దర్శించుకునేందుకు పుష్కరిణి వద్ద భక్తులతో కిటకిటలాడింది ఉదయం నుంచి శ్రీశైల మల్లన్న క్షేత్రం భక్తులతో పోటెత్తింది ఈ లక్షదీపోత్సవంలో భక్తులు,ఆలయ సిబ్బంది కార్తీక దీపాలను వెలిగించారు.

 

ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ లవన్న,చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి,ట్రస్ట్ బోర్డ్ సభ్యులు,అధికారులు,,భక్తులు పాల్గొని లక్షదీపోత్సవం,పుష్కరిణి హారతి వీక్షించి పునితులైనారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..